మెదక్

గ్రామీణ క్రీడాకారులకు ప్రోత్సాహం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గజ్వేల్, సెప్టెంబర్ 19: గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహించి మట్టిలోని మాణిక్యాలను వెలికి తీసేందుకు టిఆర్‌ఎస్ సర్కార్ కృత నిశ్చయంతో ముందుకెళ్తున్నట్లు రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ చైర్మెన్ వెంకటేశ్వర్‌రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం గజ్వేల్ పట్టణంలోని క్రీడాస్టేడియాన్ని పరిశీలించడంతో పాటు ఆయా పాఠశాలల విద్యార్థులకు క్రీడాసామగ్రి అందజేసిన సందర్భంగా ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో క్రీడలను సిఎం కెసిఆర్ ప్రోత్సహిస్తూ రూ. 100 కోట్ల కెటాయింపుకు అంగీకారం తెలిపినట్లు స్పష్టం చేశారు. ముఖ్యంగా కేరళ, పంచాబ్ తరహాలో గ్రామీణ క్రీడలను ప్రోత్సహించి రాష్ట్రంలో ఉత్తమ క్రీడాకారులను తయారు చేసేందుకు ముందుకెల్తుండగా, త్వరలోనే 200 మంది కోచ్‌ల నియామకం చేపట్టడానికి చర్యలు చేపట్టినట్లు తెలిపారు. అలాగే వచ్చే నవంబర్‌లో గజ్వేల్‌లో రాష్ట్ర స్థాయి కబడ్డీ క్రీడలను నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటుండగా, గజ్వేల్‌లో అకాడమి ఏర్పాటుతోపాటు కోచ్‌ల నియామకానికి దృష్టి సారించినట్లు చెప్పారు. కాగా పట్టన శివారులో నిర్లక్ష్యానికి గురవుతున్న క్రీడా స్టేడియాన్ని పరిశీలించి ఆయన సంబందిత అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ త్వరలోనే క్రీడాస్టేడియానికి మంచి రోజులు రానున్నట్లు పేర్కొన్నారు. అయితే విద్యతోపాటు ప్రభుత్వం క్రీడలను ప్రోత్సహిస్తుండగా ఉద్యోగవకాశాల్లో 2 శాతం రిజర్వేషన్ కల్పిస్తున్న విషయాన్ని ఆయన స్పష్టం చేశారు. క్రీడలతో మానసిక ఉల్లాసం, శరీరదారుడ్యంతోపాటు ఆరోగ్యకర సమాజ నిర్మాణానికి తోడ్పడనున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర హౌజింగ్ కార్పోరేషన్ చైర్మెన్ మడుపు భూంరెడ్డి, గడా అధికారి హన్మంతరావు, మున్సిపల్ చైర్మెన్ గాడిపల్లి భాస్కర్, వైస్ చైర్మెన్ అరుణ భూపాల్‌రెడ్డి, ఎంపిపి అధ్యక్షులు చిన్నమల్లయ్య, నేతలు గోపాల్‌రెడ్డి, కల్యాన్‌కర్ శ్రీనివాస్, రాం చంద్రాచారి, జకియొద్దీన్, నక్క రేగొండగౌడ్ తదితరులు పాల్గొన్నారు.
దొంగలున్నారు జాగ్రత్త
* ఎస్పీ చందనా దీప్తి
మెదక్, సెప్టెంబర్ 19: పార్కింగ్ చేసిన బైక్‌లను దొంగిలించిన నలుగురు యువకులను మెదక్ జిల్లా పోలీసులు మంగళవారం అదుపులోకి తీసుకున్నారని మెదక్ జిల్లా ఎస్పీ చందనాదీప్తి వెల్లడించారు. పోలీసులు వాహనాల తనిఖిలో శ్రీనివాస్, సురేష్, రామ్, ప్రభాకర్‌లను వారి వాహనాలకు సంబంధించిన కాగితాలను చూపించాలని కోరగా వారు ఉడాయించే ప్రయత్నంలో పోలీసులు వారిని పట్టుకొని విచారించారని ఎస్పీ చందనాదీప్తి తెలిపారు. ఈ నలుగురు వ్యక్తులు గత కొంత కాలంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పార్కింగ్ ప్రాంతం, మేడ్చల్, తూప్రాన్ పార్కింగ్ ప్రాంతాల్లో సుమారు 10 బైక్‌లను దొంగిలించినట్లు వారు ఒప్పుకున్నట్లు తెలిపారు. ఆ దొంగల నుండి 10 బైక్‌లను రికవరి చేసి, వారిపై కేసు నమోదు చేసి గజ్వేల్ కోర్టుకు తరలించినట్లు ఆమె తెలిపారు.

మహిళల అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ
కొల్చారం, సెప్టెంబర్ 19: మహిళలు ఆర్దికంగా అభివృద్ధి చెందాలనే దృష్టితో సిఎం కెసిఆర్ ప్రత్యేకంగా పాడి గేదెలు ఇవ్వడానికి ప్రతిపాధనలు సిద్ధం చేస్తున్నట్లు నర్సాపూర్ శాసనసభ్యులు చిలుముల మదన్‌రెడ్డి అన్నారు. మంగళవారం మండలంలోని కొంగోడ్, పోతిరెడ్డిపల్లి, అంసాన్‌పల్లి గ్రామాల్లో బతుకమ్మ పండుగలో భాగంగా మహిళలకు చీరల పంపిణీ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సమావేశం స్థానిక సర్పంచ్ సుకన్య ఇంద్రసేనారెడ్డి ఆధ్వర్యంలో కొనసాగగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మైనార్టీలు, క్రైస్తవులకు బట్టలు పంపిణీ చేసిన విషయాన్ని దృష్టిలో పెట్టుకొని తెలంగాణలో బతుకమ్మ పండుగకు ముఖ్యమంత్రి చీరలు పంపిణీ చేస్తున్నట్లు ఆయన తెలిపారు. 14 సంవత్సరాల పోరాటంలో మహిళలు దళంగా రోడ్లపై ఉద్యమాలు చేపట్టి ముందున్నారని, మహిళలు లేనిదే ఏది సాధ్యం కాదని ఎమ్మెల్యే తెలిపారు. కొల్చారం మండలానికి కాళేశ్వరం నుండి కాలువల ద్వారా 10 వేల ఎకరాలకు నీరు అందించేందుకు ఇప్పటికే కాలువ పనులు కొనసాగుతున్నాయని, వాటి పనులు కొనసాగకుండా అడ్డుకోడానికి కాంగ్రెస్ నాయకులు కేసులు వేస్తున్నారన్నారు. మండల ప్రత్యేక అధికారి జయరాజ్ మాట్లాడుతూ మండలంలో ఇటీవల హరితహారం మూడవ విడతలో అంసాన్‌పల్లిలో గ్రామస్తులు ముందుకు వచ్చి పెద్దయేత్తున మొక్కలు నాటారని, అవే కాకుండా వంద శాతం మరుగుదొడ్ల నిర్మాణంలో మండలంలో అందరికంటే ముందుండి 90 శాతం వరకు పూర్తి చేసుకున్నట్లు ఆయన తెలిపారు. డిసిఎంఎస్ వైస్ చైర్మన్ ఇంద్రసేనారెడ్డి మాట్లాడుతూ మా గ్రామానికి ప్రతి సంవత్సరం సమయానికి వర్షాలు కురియక తెచ్చిన పెట్టుబడులు పంటలకు పెట్టి తీరా పంటలు ఎండిపోతున్నాయని, ఎమ్మెల్యే ప్రత్యేక చొరవ తీసుకొని కాలువల ద్వారా చెరువులు నింపాలన్నారు. తహశీల్దార్ రమేశ్, ఎంపిడిఓ వామనరావు, శివ్వంపేట ఎంపిపి కల్లూరి హరికృష్ణ, ఎఎంసీ డైరెక్టర్లు రాజాగౌడ్, నాగేశ్వర్‌రావు, మాజీ మండల పరిషత్ అధ్యక్షురాలు మణెమ్మ, రైతు సమన్వయ సమితి మండల కన్వీనర్ భూపాల్‌రెడ్డి, పార్టీ అధ్యక్షులు శేఖర్, మాజీ అధ్యక్షులు గౌరిశంకర్, సంగమేశ్వర్, ఆత్మ కమిటి చైర్మన్ రాములు, సర్పంచ్‌లు, ఎంపిటిసిలు తదితరులు పాల్గొన్నారు.
అన్నదాతల ఆత్మహత్యల నివారణకు కేంద్రం ప్రణాళికాబద్ధ కృషి

సిద్దిపేట, సెప్టెంబర్ 19 : రైతు సంక్షేమానికి కేంద్ర సర్కార్ పెద్దపీట వేస్తుందని..అన్నదాతల ...అప్పుల బాధలు, ఆత్మహత్యల నివారణ కోసం మోదీ సర్కార్ ప్రణాళిక బద్ధంగా కృషిచేస్తుందని భారతీయ జనతా కిసాన్‌మోర్చ జాతీయ కార్యవర్గ సభ్యుడు జైపాల్‌రెడ్డి వెల్లడించారు. మంగళవారం సిద్దిపేటలో జరిగిన బిజెపి జిల్లా స్థాయి కిసాన్‌మోర్చ కార్యవర్గ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హజరై మాట్లాడారు. రైతుల ఆదాయం రెట్టింపు చేసేందుకు బిజెపి సర్కార్ ఆలోచించి రైతుల స్థితి గతులను క్షేత్ర స్థాయిలో అధ్యయనం చేసేందుకు నీతికమిటీని నియమించిందన్నారు. రైతు స్థితి గతులను క్షేత్ర స్థాయిలో అధ్యయనం చేసి అన్నదాతల అభ్యున్నతి కోసం 7 సూత్రాల పథకాన్ని తీసుకొచ్చినట్లు పేర్కొన్నారు. 2022 వరకు రైతు ఆదాయాన్ని రెట్టింపు చేసేందుకు ప్రణాళిక బద్దంగా కృషిచేస్తున్నట్లు పేర్కొన్నారు. రైతుల ఉత్తత్తి కారకాలు పెంచటం, తక్కువ ధరతో అధికంగా పంట ఉత్పత్తి పెంచటం, భూసార పరీక్షలు చేపట్టడం, నీమ్ కోటేడ్ యూరియా వినియోగించటం, పంట వృధా కాకుండ చర్యలు తీసుకోవటం, పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించటం, ఈనామ్ మార్కేట్లు ఏర్పాటు చేయటం, రైతుల పంట నష్టపోకుండ ఇన్స్ రెన్స్ సదుపాయం కల్పించినట్లు చెప్పారు. కేంద్ర సర్కార్ భూసార పరీక్షల కోసం 251కోట్లు కేటాయించి భూ సార పరిశోధన కేంద్రాలు అభివృద్ధి చేసినట్లు పేర్కొన్నారు. పంటలకు నీమ్ కోటేడ్ యూరియను వినియోగించం 60 శాతం వరకు గతంలో కంటే ఆదా అయిందన్నారు. కేంద్ర సర్కార్ యూరియాను పారదర్శకంగా కొనుగోలు చేసేలా చర్యలు చేపట్టి, యూరియాపై వృధా ఖర్చులను తగ్గించిందన్నారు. ఎరువుల్లో సర్కార్ ఆధాయం పెరిగేలా ప్రత్యేక చర్యలు తీసుకొచ్చిందన్నారు. ధాన్యం నిల్వ చేసేందుకు ప్రత్యేక పద్దతిలోగోదాంల నిర్మాణం చేపట్టిందన్నారు. రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధరకు దేశంలో ఎక్కడైన విక్రయించేందుకు ఈ-నామ్ మార్కెట్లను ప్రవేశపెట్టినట్లు పేర్కొన్నారు. ఈ-నామ్ మార్కెట్ల నిర్మాణం కోసం దేశ వ్యాప్తంగా 550 మార్కెట్లకు ఒక్కో మార్కెట్‌కు 30 లక్షల రూపాయలు కేటాయించిందన్నారు. రైతులు పండించిన పంటలకు సర్కార్ పరిహారం అందించేందుకు ఇన్స్‌రెన్స్ పథకాలను తీసుకొచ్చినట్లు కేంద్ర సర్కార్ ప్రవేశపెట్టిన ఫసల్‌బీమా పథకం రైతులకు ఏంతో ప్రయోజనం కలుగుతుందన్నారు. తెలంగాణ సర్కార్‌కు పంట నష్టం కింద కేంద్రం 240 కోట్లు కేటాయిస్తే ఇంతవరకు రైతుల ఖాతాల్లో జమచేయలేదన్నారు. ఉమ్మడి మెదక్ జిల్లాకు 2కోట్లు కేటాయించిందన్నారు. ఇందులో కేంద్రం వాట 50 శాతం ఉండగా రాష్ట్రం మరో 50 శాతం చెల్లించాల్సి ఉంటుందన్నారు. గత ఏడాది కేంద్రం బడ్జెట్‌లో పంట పరిహారం కోసం 9వేల కోట్లు కేటాయిస్తే రైతలకు 17 వేల కోట్ల నష్టంగా పరహారం చెల్లించిందన్నారు. వ్యవసాయ అనుబంధరంగాలైన పాడిపరిశ్రమ, సెరికల్చర్, మత్స్యపరిశ్రమను అభివృద్ధి కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందన్నారు. రైతుల అభివృద్ధి కోసం చిత్తశుద్ధితో పనిచేయాలన్నారు. ఈకార్యక్రమంలో కిసాన్‌మోర్చ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కమలకర్‌రెడ్డి, రాష్ట్ర నేతలు రాంరెడ్డి, రాందాస్, భగవాన్‌రెడ్డి, జిల్లాఅధ్యక్షుడు శ్రీనివాస్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

గ్రామాల అభివృద్ధే లక్ష్యం

* కాంగ్రెస్ పాలనలో ఆగమైన తెలంగాణ
* మండలానికి రూ.50 లక్షల
నిధులివ్వని ఆంధ్ర పాలకులు
* గ్రామానికి రూ.50 లక్షలకు పైగా నిధులిస్తున్న సిఎం కెసిఆర్
* మంత్రి హరీష్‌రావు

చిన్నకోడూరు, సెప్టంబర్ 19 : కాంగ్రెసు పాలనలో తెలంగాణ పూర్తిగా నాశనమైందని , ఆంధ్ర పాలకులు మండలనికి 50 లక్షల నిధులు కూడా కేటాయించలేదని భారీనీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు అన్నారు. మంగళవారం మండలంలోని మాటిండ్ల గ్రామంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్ధాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 60 సంవత్సరాల్లో మండలానికి 50 లక్షలు నిధులు కేటాయించిన పాపాన పోలేదన్నారు. మన ముఖ్యమంత్రి కెసిఅర్ గ్రామానికి 50 లక్షలకు పైగా నిధులు మంజూరు ఇచ్చి గ్రామాల అభివృద్ధికి కృషి చేశాడన్నారు. ఇళ్లు లేని నిరుపేదలకు ప్రభుత్వమే ఇళ్లు నిర్మించి ఇస్తుందన్నారు. సిద్దిపేట నియోజకవర్గాన్ని అన్నివిధాలుగా అభివృద్ధి చేయడానికి తనవంతు కృషి చేస్తున్నరన్నారు. ఈ యేడాది నియోజకవర్గనికి కొత్తగా మరో 17 సబ్‌స్టేషన్లు మంజూరు చేశామన్నారు. నక్కవాగు ఎత్తును పెంచడానికి 94లక్షల నిధులు కేటాయించారన్నారు. నక్కవాగు పూర్తిగా నిండితే చుట్ట్టూ ఉన్న నాలుగైదు గ్రామాలకు భూగర్భజలాలు పెరిగి బోరు బావులలకు నీరువచ్చి రైతులకు పుష్కలంగా పంటలు పండుతాయన్నారు. మాటేండ్ల గ్రామానికి డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణం కోసం రూ.1కోటి 26 లక్షల నిధులు కేటాయించారన్నారు. సబ్‌స్టేషన్ నిర్నాణం కోసం రూ.55లక్షలు సిసి రోడ్డు నిర్మాణం కోసం రూ.15లక్షలు కేటాయించారన్నారు. గ్రామాల అభివృద్ధి కోసం ప్రభుత్వం అధిక నిధులు కేటాయించి అభివృద్ధికి సహకరిస్తుందన్నారు. ప్రతి పేద మహిళ ప్రసవం కోసం ప్రభుత్వ దవాఖానకు పోవాలన్నారు. అవసరం లేకున్న ప్రైవేటు ఆసుపత్రుల్లో అపరేషన్ చేసి ఇబ్బందులకు గురిచేశారన్నారు. నియోజక వర్గానికి ఇప్పటి వరకు సిఎం రిలీఫ్‌పండ్ కింద నియోజకవర్గానికి 1600 మందికి ససాయం అందించినట్లు పేర్కొన్నారు. జక్కాపూర్ నుంచి దాచారం వరకు రోడ్డు నిర్మాణంకు 1.30కోట్లు, సలేంద్రి నుంచి మెట్‌పల్లి వరకు 1.20కోట్లు, కమ్మర్లపల్లి నుంచి బిక్కబండ వరకు 90లక్షలు, మల్యాల నుంచి పెద్దలింగారెడ్డిపల్లి వరకు 1.20లక్షలు, చౌడారం నుంచి మెడిపల్లి వరకు 70లక్షలు రోడ్ల నిర్మాణం కోసం నిధులు కేటాయించినట్లు తెలిపారు. నియోజకవర్గంలోనే మాటిండ్ల గ్రామం మారుమూల గ్రామంగా ఉండేదని, ఇప్పుడు అన్ని సౌకర్యాలతో ఆదర్శ గ్రామం అయిందన్నారు. రైతులకు 24గంటల విద్యుత్ సౌకర్యం కల్పించి సిఎం కెసిఆర్ రైతుల పక్షపాతిగా నిలిచారన్నారు. ఒకప్పుడు గ్రామాల్లో విద్యుత్ ఎప్పుడు వచ్చి ఎప్పుడు పోయేదో తెలిసేది కాదన్నారు. రాష్ట్రం ఏర్పాడ్డాక విద్యుత్ ఎప్పుడు పోతుంతో కూడా ఎవరికీ తెలియకుండా నిరంతర విద్యుత్ అందుతుందన్నారు. విద్యుత్ ఉంటే సరిపోదని, ప్రాజెక్టులు నిర్మిస్తే నీరు-కరెంటు రెండు ఉండి రైతులు పంటలు పండించుకొని ఆర్థికంగా ఎదుగుతారన్నారు. సిఎం కెసిఆర్ రైతుల ఎదుగుదలకు అనేక పథకాలు ప్రవేశపెట్టి రైతులను అన్ని విధాల ఆదుకుంటున్నారన్నారు. అంతకు ముందు గోపూలపూర్ గ్రామంలో ప్రభుత్వ పంపిణీ చేసిన సిబ్సిడీ గొర్రెలను మంత్రి పరిశీలించారు. లబ్ధిదారులను వాటి గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ జనార్థన్‌రెడ్డి, ఎంపిపి మాణిక్యరెడ్డి, జడ్పీటిసి కమల, ఎఎంసి చైర్మన్ వెంకట్‌రెడ్డి, ఆత్మకమిటీ చైర్మన్ సత్యనారాయణరెడ్డి, రైతు సమన్వయ కమిటి మండల అధ్యక్షుడు మల్లేశం, టిఆర్‌ఎస్ రాష్ట్ర నాయకులు రాధకిషన్‌శర్మ, సర్పంచ్‌లు సత్తయ్య, శ్రీనివాస్, దేవేందర్, ఆంజనేయులు, ఎంపిటిసిలు బాలమల్లు, బాల్‌రెడ్డి, అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

అంబరాన్నంటిన బతుకమ్మ సంబురం
సిద్దిపేట అర్బన్/తొగుట, సెప్టెంబర్ 19: సిద్దిపేట నియోజక వర్గంలో వివిధ పాఠశాలలు, కళాశాలల్లో బతుకమ్మ సంబరాలు అంబరాన్నంటాయి. పుస్తకాలతో కుస్తీలు పట్టే విద్యార్థులు బతుకమ్మ పండుగ బుధవారం ప్రారంభం కానుండటంతో ఒక రోజు ముందుగానే పాఠశాలలు, కళాశాలల్లో బతుకమ్మ ఆటా పాటతో హోరెత్తించారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు బతుకమ్మలను పేర్చి కళాశాలలు పాఠశాలల ముందు ఏర్పాటు చేసి లయబద్దంగా బతుకమ్మ ఆటలాడారు. పట్టణంలోని ప్రభుత్వ డిగ్రి కళాశాల జాగృతి ఆధ్వర్యంలో నిర్వహించిన బతుకమ్మ సంబరాల్లో జిల్లా జాగృతి కన్వినర్ సువర్ణ, ప్రిన్సిపాల్ శ్రీనివాస్‌రెడ్డిలు ప్రారంభించారు. అలాగే స్థానిక శ్రీచైతన్య, సెలస్టియల్ పాఠశాలల్లో నిర్వహించిన బతుకమ్మ సంబరాల్లో ఆటలు, పాటల పోటీల్లో విజేతలకు జాగృతి జిల్లా కన్వినర్ సువర్ణ విజేతలకు బహుమతులు అందించారు. ఈ కార్యక్రమాల్లో ప్రిన్సిపాల్స్ ఇజాజ్‌అలీ, కృష్ణమాచారి, రాజిరెడ్డి, బాబు, సునయనా తదితరులు పాల్గొన్నారు. ఇర్కోడ్‌లోని మాడల్ స్కూల్‌లో జరిగిన బతుకమ్మ సంబరాల్లో ఎంఇఓ ప్రసూనదేవి బతుకమ్మను ఎత్తుకుని విద్యార్థులతో కలిసి ఆడిపాడారు.
తొగుటలో....
మండలంలోని వివిధ పాఠశాలల్లో బతుకమ్మ సంబరాలను ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా పెద్దమాసాన్‌పల్లి, వేములగాట్, తొగుట, కాన్గల్, వెంకట్రావ్‌పేట, పల్లెపహడ్, గుడికందుల, ఏటిగడ్డకిష్టాపూర్ పాఠశాలల్లో విద్యార్థులు, ఉపాధ్యాయులు బతుకమ్మ సంబరాల్లో ఆటలు ఆడి పాటలు పాడుతూ ఆనంద పారవశ్యంలో మునిగిపోయారు.

ఉన్నంతలో కొత్తచీర..మరి రాజకీయమెందుకో?
* మనసున్న సిఎం...అన్న కెసిఆర్
* డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్ రెడ్డి
మెదక్ రూరల్, సెప్టెంబర్ 19: మనసున్న మారాజు...యావత్ తెలంగాణ ఆడబిడ్డలకు ఆన్న మన ముఖ్యమంత్రి కెసిఆర్...గతంలో ఎన్నడూలేనివిధంగా ఉన్నంతలో బతుకమ్మ పండుగకు ఆడబిడ్డలకు చీరలిస్తుంటే రాజకీయమెందుకని డిప్యూటీ స్పీకర్ ఎం.పద్మాదేవేందర్‌రెడ్డి ప్రతిపక్షాలను ప్రశ్నించారు. మంగళవారం మండల కేంద్రం హవేళీఘణాపూర్‌లో నూతనంగా 13 లక్షల వ్యయంతో నిర్మించిన గ్రామ పంచాయతీ కార్యాలయం ఆమె ప్రారంభించారు. అనంతరం బతుకమ్మ పండుగ సందర్భంగా ప్రభుత్వం తరపున చీరలను మహిళలకు అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మాట్లాడారు. గతంలో ఏ ప్రభుత్వం ఇవ్వని విధంగా మన ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు అన్ని మతాలు, సంస్కృతులను గౌరవించి ఉన్నంతలో కొత్త బట్టలు ఇవ్వడానికి ముందుకురావడం జరిగింది. ప్రతిపక్షాలు విమర్శలు చేయడం వారి నైజం, కానీ చీరలను దగ్దం చేయించడం వారి అవివేకానికి నిదర్శనమన్నారు. రాష్ట్రంలో కోటి 8 లక్షల చీరలు పంపిణీ చేస్తున్నారు. మన రాష్ట్రంలో అన్ని చీరలు తయారుకాకపోవడంతో సూరత్ నుండి తెప్పించడం జరిగింది. వచ్చేనాటికి మన రాష్ట్రంలో ఉన్న చేనేతలతో తయారుచేయించి ఇవ్వడం జరుగుతుందన్నారు. ప్రతిపక్షాలు ప్రతిదాన్ని రాజకీయం చేయడం సరికాదని హితవు పలికారు. ప్రపంచంలోనే పూలను ఆరాదించే సంస్కృతి మన తెలంగాణదన్నారు. ఈ నెల 26న ప్రపంచానికి చాటేవిధంగా పెద్దయెత్తున బతుకమ్మ సంబరాలు జరగబోతున్నాయన్నారు. సమైఖ్యాంద్ర పాలనలో మన సంస్కృతిని చాటిచెప్పలేదు, బతుకమ్మలు నిమజ్జనం చేయడానికి చెర్వుల్లో నీరులేని దుస్థితి ఉండేదన్నారు. నేడు భగవంతుని దయతో వర్షాలు కురిసి చెర్వులు నిండాయన్నారు. వర్షం కోసం ఆకాశం, భూమివైపు చూడకుండా ఉండేందుకు కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మిస్తున్నారన్నారు. ఉద్యమించి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రానికి అన్ని తెలిసిన ముఖ్యమంత్రి కెసిఆర్ సంక్షేమం, అభివృద్దే ధ్యేయంగా ముందుకు వెళ్తున్నారన్నారు. ఎకరాకు 4 వేల రూపాయల పెట్టుబడులు ఇవ్వడానికే భూమి రికార్డుల ప్రక్షాళన కార్యక్రమం జరుగుతుందన్నారు. ఆడబిడ్డల పెళ్లిళ్లకు ఇబ్బందులు కాకుండా కళ్యాణలక్ష్మీ, షాదీముబారక్ ద్వారా ఆర్థిక సహాయం అందజేస్తున్నారన్నారు. తాగు నీటి ఇబ్బందులు తీర్చేందుకు మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి సరఫరా అవుతాయని పద్మాదేవేందర్‌రెడ్డి వివరించారు. మండల కేంద్రం చేసిన హవేళీఘణాపూర్ మరింత అభివృద్దికి సహకరిస్తానన్నారు. సభకు అద్యక్షత వహించిన సర్పంచ్ సునీతసాయిలు గ్రామంలో సిసి రోడ్డు, మురికికాలువలు, ఇళ్లు మంజూరుచేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి లక్ష్మీకిష్టయ్య, జడ్‌పిటిసి లావణ్యారెడ్డి, ఆర్‌డిఓ నగేశ్, జిల్లా బిసి సంక్షేమ అధికారి సుధాకర్, ఎంపిడిఓ రాంబాబు, పిఆర్ డిఇ జగదీశ్వర్, మండల రైతు సమన్వయకర్త మంద శ్రీహరి, ఎంపిటిసి శ్రీకాంత్, ఎపిఎం ఇందిర, ఇవోపిఆర్‌ఆర్‌డి శ్రీనివాస్, ఎఇ సిద్దిరాజ్‌సింగ్, మండల తెరాస అధ్యక్షులు శ్రీనివాస్‌రెడ్డి, అంజాగౌడ్, నాయకులు రాంచంద్రారెడ్డి, శ్రీపాల్, సాయిలు, కిష్టయ్య తదితరులు పాల్గొన్నారు. డైట్‌లో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలని ఛాత్రోపాధ్యాయులు వినతిపత్రం సమర్పించగా పద్మాదేవేందర్‌రెడ్డి సానుకూలంగా స్పందించారు.