మెదక్

నేడు వేములగాట్‌లో మల్లన్నసాగర్ భూసేకరణకు తొలి గ్రామసభ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిద్దిపేట/తొగుట, అక్టోబర్ 20: తెలంగాణ సర్కార్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మల్లన్నసాగర్ రిజర్వాయర్ భూసేకరణ కోసం గ్రామసభకు తొగుట మండలం వేములగాట్ గ్రామం సిద్దమైంది. ఈ నెల 21న వేములగాట్ గ్రామంలో గ్రామసభ కోసం అధికార యంత్రాంగం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టులో బాగంగా మల్లన్నసాగర్ రిజర్వాయర్ కోసం ప్రభుత్వం చేపట్టిన భూసేకరణ 90 శాతం పైగా పూర్తయ్యింది. ఇందులో బాగంగా వేములగాట్, పల్లెపహడ్, బ్రాహ్మణ బంజెరుపల్లి, సింగారం, ఏటిగడ్డకిష్టాపూర్, ఎర్రవెళ్లి గ్రామాలు ముంపుకు గురవనుండగా తొగుట, కొండపాక మండలాల పరిధిలోని రాంపూర్, లక్ష్మాపూర్, మంగోల్ గ్రామాలు పాక్షికంగా ముంపుకు గురవుతున్నాయి. వీటిలో ఎల్లారెడ్డిపేట, తుక్కాపూర్, తొగుట గ్రామాల్లోని భూములు సైతం ముంపుకుగురవుతున్నాయి. ప్రాజెక్టు పరిధిలో 17,256.23 ఎకరాల భూమి సేకరించాల్సి ఉండగా 15,635.06 ఎకరాల భూమిని సేకరించారు. వేములగాట్ గ్రామంలో 1600 ఎకరాల మేర భూమిని సేకరించాల్సి ఉంది. మిగిలిన గ్రామాల్లో దాదాపుగా భూసేకరణ పూర్తి అయ్యింది. కాగా వేములగాట్ గ్రామస్థులు భూసేకరణను వ్యతిరేకిస్తూ గత 500 రోజులుకు పైగా గ్రామంలో రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. నిబంధనలకు విరుద్దంగా భూసేకర చేపడుతున్నారని, గ్రామసభ నిర్వహించకుండా భూసేకరణ చేశారని, 2013 చట్టం ప్రకారం చేయాల్సి ఉండగా జిఓ 123తో చేస్తున్నారని హైకోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు గ్రామసభ నిర్వహించి భూసేకరణ చేయాలని ప్రభుత్వ యంత్రాంగాన్ని ఇటీవల హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 25 చేయాలని హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీచేసింది. దీంతో ఈ నెల 21న వేములగాట్‌లో గ్రామసభ నిర్వహించేందుకు జిల్లా రెవెన్యూ యంత్రాంగం అన్ని ఏర్పాట్లను చేస్తుంది. గ్రామసభ నిర్వహించి గ్రామస్థుల అభిప్రాయాన్ని సేకరించనున్నారు.
గ్రామసభకు భారీ బందోబస్తు
తొగుట మండలం వేములగాట్‌లో జరిగే భూసేకరణ గ్రామసభ కోసం సిద్దిపేట పోలీస్ యంత్రాంగం భారీ బందోబస్తు ఏర్పాటు చేసింది. ఇందుకోసం ఎసిపి నర్సింహరెడ్డి ఆధ్వర్యంలో పటిష్టమైన బందోబస్తును ఏర్పాటు చేశారు. గ్రామస్థులు మినహా ఇతరులను ఎవరిని గ్రామ సభకు అనుమతి లేకుండా చర్యలు చేపడుతున్నారు. ఈ ముఖ్యంగా నాలుగు రూట్లలో బంజెరుపల్లి, తొగుట, ఎర్రవల్లి, వేములగాట్ గ్రామాల్లో చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి పకడ్బందీ చర్యలు చేపట్టారు. వందలాది మంది పోలీసులు రానుండటంతో ప్రజలు ఆందోళనలో ఉన్నారు.

జూదరులకు చెక్‌పెట్టిన ఖేడ్ ఎస్‌ఐ
నారాయణఖేడ్ అక్టోబర్ 20: దీపావళి రోజున గురువారంనాడురాంత్రి 9.30 గంటల నుంచి ఎస్ ఐ నరేందర్ పోలీసులతో పట్ణంలో తిరుగుతూ జూదరులకు భయాందోళన గురి చేశారు. ముందుగానే లక్ష్మీపూజలు రోజున దుకాణాల ముందు లోపల బహిరంగంగా పేకాటను వ్యాపారస్థులు అడుతుండే వారు చట్టం ప్రకారం పేట నేరం అవుతుందని ఎవరు జూదం అట అడిన అరెస్ట్ కేసులు నమోదు చేస్తామని ఎస్ ఐ నరేందర్ మందు ప్రకనట చేయడంతో జూదరులు దిక్కులేని పరిస్థితిలో పక్కదారి పట్టి ఇతర ప్రాంతాలకు వెళ్లి గురురంనాడు రాత్రి పేటకాను అడుకునట్లు తెలిసింది. దొడ్డి దారిలో తప్ప ఎక్కడా పేకాట అడినట్లు కనిపించ లేదని పోలీసులు చెబుతున్నారు.
పోలీస్ అమరవీరులకు ఘన నివాళి

మెదక్, అక్టోబర్ 20: పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం పురష్కరించుకొని మెదక్‌లో శుక్రవారం జిల్లా ఎస్పీ చందనాదీప్తి 2కె రన్‌ను ప్రారంభించారు. 2కె రన్‌లో డిగ్రీ కళాశాల విద్యార్థులు, యువకులు పెద్దయేత్తున పాల్గొన్నారు. మెదక్ పోలీస్ స్టేషన్ నుండి ధ్యాన్‌చంద్ విగ్రహం వరకు 2కె రన్‌ను ఎస్పీ చందనాదీప్తి జెండా ఊపి ప్రారంభించారు. రోడ్డుపైన భారీ పోలీస్ బందోబస్తు మధ్య 2కె రన్ కొనసాగింది. ట్రాఫిక్ అంతరాయం లేకుండా పోలీసులు అప్రమత్తంగా 2కె రన్‌కు ఏర్పాట్లు చేశారు. 2కె రన్‌లో వై.రాఘవేంద్ర అనే ఇందిరాగాంధీ స్టేడియం అథ్లెటిక్ విద్యార్థి మొదటి స్థానంలో నిలిచాడు. రెండవ స్థానంలో బి.అనిల్, మూడవ స్థానంలో ఎన్.శివ గెలుపొందారు. వీరిని జిల్లా ఎస్పీ కరచాలం చేసి అభినందించారు. అంతే కాకుండా మ్యాంగో జూస్ ఫ్యాకెట్లను ఆమె వారికి అందజేశారు. వారికే కాకుండా 2కె రన్‌లో పాల్గొన్న వారందరికి అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎఎస్పీ రాంచంద్రారెడ్డి పాల్గొన్నారు.