మెదక్

విష జ్వరాల విజృంభణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంగారెడ్డి, అక్టోబర్ 20: వర్షాకాలం ముగిసే చివరి అంకంలో కురుస్తున్న వర్షాలతో సకల జనులను విష జ్వరాలు పీడిస్తూ దడ పెట్టిస్తున్నాయి. ప్రాణాంతకమైన డెంగీ వ్యాధి అన్ని వర్గాల వారిని బెంబేలెత్తిస్తోంది. అక్కడక్కడ డెంగీతో పలువురు మృతి చెందుతున్న సంఘటనలు వెలుగు చూస్తుండటంతో మరింత ఆందోళనకు గురి చేస్తుంది. చలి, జ్వరం, దగ్గు, నీరసం అంటూ ఆసుపత్రులకు వెళుతున్న రోగులకు రక్త పరీక్షలు తప్పనిసరి చేస్తూ సొమ్ము చేసుకుంటున్నా వైద్యుడు చెప్పిందే వేదం అన్నట్లుగా పరిస్థితులు దాపురించాయి. పురుడు పోసుకున్న శిశువు మొదలుకుని పండు వృద్ధులే కాదు, యువతీ యువకులు, మద్య వయస్కులను సైతం విష జ్వరాలు కంగారు పెడుతున్నాయి. ప్రధానంగా రక్త పరీక్షలు నిర్వహించుకోవాలంటేనే బెంబేలెత్తుతున్నారు. రక్త పరీక్షల నివేదికలు వచ్చిందే మొదలు రక్త కణాల శాతం పరిమితికన్నా తక్కువగా పడిపోయాయని చెప్పడం, అందుకు అవసరమైన చికిత్సలు నిర్వహించడం పరిపాటిగా మారింది. ఒకరిని చూసి మరొకరు ఆందోళన చెందుతూ రక్త పరీక్షలు ఒకటికి రెండు సార్లు నిర్వహించుకుంటున్నారని, ఒకప్పుడు చికెన్ గున్యా వ్యాధి పట్ల ఎంత ఆందోళన చెందారో ఇప్పుడు డెంగీ పట్ల కూడా రోగుల్లో ఆత్మ విశ్వాసం సన్నగిల్లిపోయిందని వైద్యులు పేర్కొంటున్నారు. ఇటీవల కురిసిన వర్షాలతో భూమిపై తేమ శాతం ఇంకా కొనసాగుతుండటం, దోమల బెడద అధికం కావడం వల్ల మలేరియా, టైపాయిడ్ లాంటి రోగాలు వృద్ధి చెందుతున్నాయని వైద్యులు వివరిస్తున్నారు. దీపావళి పండుగతో చలికాలం ప్రారంభం కానుండాల్సి ఉండగా ఇంకా వర్షాకాల ప్రభావమే కొనసాగడం కూడా వ్యాధుల ప్రబలడానికి ప్రధాన కారణమన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రభుత్వ ఆసుపత్రులు మొదలుకునిన ప్రైవేట్ ఆసుపత్రులు, చివరకు ఆర్‌ఎంపి, పిఎంపి వైద్యులు ఎక్కడ చూసినా రోగులే కనిపిస్తున్నారు. దారిద్య్రరేఖకు దిగువన ఉన్న కుటుంబాల్లో వ్యాధుల బారిన పడినవారంతా ప్రభుత్వ ఆసుపత్రులను ఆశ్రయిస్తున్నారు. దీంతో పడకలు సరిపడకపోవడంతో ఒకే మంచంపై ఇద్దరికి వైద్య సేవలు అందిస్తున్న ఆసుపత్రులు లేకపోలేదు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో సరిపడా సౌకర్యాలు లేకపోగా అవసరమైన వైద్యులు, సిబ్బంది కొరత వల్ల సరియైన వైద్య సేవలకు నోచుకోవడం లేదు. నిధుల లేమితో కొట్టుమిట్టాడుతున్న గ్రామ పంచాయతీలు మొదలుకుని నగర పంచాయతీలు, గ్రేడ్-1 మున్సిపాలిటీలను పరిశీలిస్తే ఏమున్నది గర్వకారణం ఎక్కడ చూసినా అపరిశుభ్రత దర్శనమిస్తోంది. ఉమ్మడి మెదక్ జిల్లాలో ఒక్క సిద్దిపేట పురపాలక సంఘం మినహా అన్ని మున్సిపల్ పట్టణాలు మురికి కూపాలుగా మారిపోయాయి. అధికారుల నిర్లక్ష్యం పుణ్యమాని ఎక్కడ పడితే అక్కడ ఇళ్ల నిర్మాణాలు కావడం, అనుమతి లేని వెంచర్లు వెలువడటం కూడా పారిశుద్ధ్య లోపానికి ప్రధాన కారణంగా తెలుస్తోంది. ఏ ఇంట్లో చూసినా ఎవరో ఒకరు దగ్గని వ్యక్తి కనిపించకపోవడం బాదాకరం. రోగి లేని ఇల్లు గ్రామాలు, పట్టణాల్లో లేవంటే ఆశ్చర్యపోనక్కర లేదు. అభివృద్ధికి ఆమడ దూరం, అపరిశుభ్రతకు కేరాఫ్ అయిన గిరిజన తండాల ప్రజలను విష జ్వరాలతో గిలగిల కొట్టుకుంటున్నారు. వాతావరణ పరిస్థితుల్లో మార్పులు వస్తున్నాయని, రోగుల సంఖ్య కూడా తగ్గిపోతుందని వైద్యులు పేర్కొంటున్నారు. ప్రధానంగా స్వల్ప జ్వరానికే భయాందోళన చెందుతున్నారని, మానసిక ధైర్యం అత్యవసరమంటున్నారు డాక్టర్లు. దసరా, దీపావళి వేడుకలను ఆడంబరంగా నిర్వహించుకోవాల్సిన వేళ రోగాలతో సతమతమవడం అన్ని వర్గాలను ఆందోళనకు గురి చేస్తోంది. అంతుచిక్కని రుగ్మతలు రోగులను కంగారు పెడుతుంటే, ఆసుపత్రులకు మాత్రం కాసుల పంట పండుతుందని చెప్పడంలో అతిశయోక్తి లేదు.