మెదక్

అభివృద్ధిలో మనదే ముందడుగు: మంత్రి హరీష్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జహీరాబాద్‌టౌన్, నవంబర్ 18: దేశంలో ఎవరు చేయని అభివృద్ధిని మన ముఖ్యమంత్రి కెసిఆర్ చేస్తున్నారని భారీ నీటిపారదల శాఖ మంత్రి హరీష్‌రావు అన్నారు. శనివారం కోహీర్ మండలంలోని వెంకటాపూర్‌లో 33/11 కెవి సబ్‌స్టేషన్‌కు శంకుస్థాపన, సజ్జాపూర్‌లో 33/11 కెవి సబ్‌స్టేషన్‌ను ఆయన ప్రారంభించారు. అనంతరం సజ్జాపూర్‌లో నిర్వహించిన సభలో మంత్రి మాట్లాడుతూ దేశంలో తెలంగాణ రాష్ట్రం ఒక్కటే వ్యవసాయసానికి 24 గంటల ఉచిత విద్యుత్‌ను సరఫరా చేస్తోందన్నారు. జహీరాబాద్ ప్రాంతంలో అల్లం, అరటి, పసుపులాంటి వాణిజ్య పంటలు అధికంగా సాగుచేస్తున్నందునా కరెంటు సరఫరాకు అంతరాయం కలుగ కుండా సబ్‌స్టేషన్ ఏర్పాటు చేశామన్నారు. సిఎం కెసిఆర్‌కు సజ్జాపూర్ గురించి తెలుసన్నారు. వచ్చే సంవత్సరం నుంచి ఖరీఫ్, రబీలకు సంబంధించి ఎకరాకు రూ.8వేల చొప్పున రైతుల ఖాతాల్లోవేస్తామన్నారు. భూ ప్రక్షాళనతో రైతులకు మేలు జరుగుతుందన్నారు. అనంతరం కొత్త పాసుపుస్తకాలు, టైటిల్ డీడ్‌లు ఇవ్వడం జరుగుతందన్నారు. తహసిల్దారు కార్యాలయంలోనే భూముల రిజిస్ట్రేషన్లు, మొటేషన్లు జరుగుతాయన్నారు. అవినీతి రహిత పాలనకు సిఎం చర్యలు తీసుకుంటున్నారన్నారు. వైద్యసేవలు మెరుగు పర్చడం జరుగుతుందని, వంద పడకల ఆసుపత్రికి సరిపోను వైద్య సిబ్బంధి ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామన్నారు. సజ్జాపూర్‌లోని నర్సారెడ్డి చెరువును మిషన్ కాకతీయలో చేపట్టాలని అధికారులను అదేశించారు. అదేవిధంగా గ్రామంలోని సిసి రోడ్లు, కల్వర్టుల నిర్మాణానికి రూ.10లక్షలు మంజూరు చేస్తున్నామన్నారు. కొత్తూర్ గ్రామాన్ని గ్రామ పంచయతిగా చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంపి బిబి.పాటిల్, ఎమ్మెల్యే డాక్టర్ జె.గీతారెడ్డి, ఎమ్మెల్సీ ఎండి.్ఫరీదుద్ధీన్, టిఆర్‌ఎస్ పార్టీ ఇంచార్జి మాణిక్‌రావు, ఎఎంసి.డి.లక్ష్మారెడ్డి, సిడిసి చైర్మన్ ఉమాకాంత్‌పాటిల్, జెసి.వాసం వెంకటేశ్వర్లు, ఆర్డీఓ.అబ్దుల్‌హమీద్, విద్యుత్ డీఈఈ.జయరామ్, ఎడిఈ.వెంకట్, ఎఈఈ.మోహన్, తహసిల్దారు ప్రవీణ్‌కుమార్, ఎంపిపి.జంపాల అనిత, ఎంపిడిఓ.శ్రీనివాస్, నాయకులు ఉమర్ హైమద్, రామకృష్ణారెడ్డి, మల్లికార్జున్, పర్వతమ్మ, యాదవరెడ్డి, శ్రవంతిరెడ్డి వివిధ శాఖల అధికారులు, సిబ్బంధి, స్థానికులు పాల్గొన్నారు.