మెదక్

కలసిమెలసి జీవించినప్పుడే జాతీయ సమైక్యత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెదక్, నవంబర్ 19: ప్రజలందరూ కుల, మత, వర్గ బేధాలు లేకుండా కలసిమెలసి జీవించినప్పుడే జాతీయ సమైక్యత సాధ్యపడుతుందని జిల్లా కలెక్టర్ భారతి హొళ్లికేరి ఆదివారం తెలిపారు. జాతీయ సమైఖ్యత వారం నవంబర్ 19 నుండి 25 వరకు పాటించాలన్న కేంద్ర హోం శాఖ ఆదేశాల మేరకు మెదక్ జిల్లా కేంద్రంలో అన్ని వర్గాల ప్రజలు పాల్గొన్నారు. ర్యాలీలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ విభిన్న సంస్కృతులు, సంప్రదాయాలు, భాషలు, మతాలు ఉన్నా మన దేశం సామరస్యంగా జీవిస్తూ జాతీయ ఐక్యతను కలిగి ఉందని పేర్కొన్నారు. అందుకే అభివృద్ది సాధ్యమైందని కలెక్టర్ తెలిపారు. నవంబర్ 25న కమ్యూనల్ హర్మోని ప్లాగ్ డే పాటించాలని తెలిపారు. వారం రోజుల జరిగే ఈ జాతీయ సమైక్యతా వారోత్సవాల్లో భాగంగా నవంబర్ 19న జాతీయ సమైఖ్యత దినం, 20న మైనార్టీల సంక్షేమ దినం, 21న భాష సామరస్యదినం, 22న బలహీన వర్గాలదినం, 23న సాంస్కృతిక ఐక్యతదినం, 24న మహిళలదినం, 25న ప్రకృతి సంరక్షణదినం పాటించాలని కలెక్టర్ కోరారు. అదే విధంగా విద్య, సంక్షేమ విభాగాధికారులు సంబంధిత కార్యక్రమాలు చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో స్వచ్చతను కూడా భాగం చేస్తూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని కలెక్టర్ తెలిపారు. ఈ ర్యాలీలో జిల్లా సంయుక్త కలెక్టర్ నగేష్, డీఆర్‌డీఓ పీడీ సీతారామరావు, డీపీఓ హనూక్, డీసీఓ వెంకట్‌రెడ్డి, జిల్లా సైన్‌స అధికారి రాజిరెడ్డి, ఇతర జిల్లా అధికారులు, వివిధ వర్గాల ప్రజలు, విద్యార్థులు పాల్గొన్నారు.