మెదక్

పదేళ్ల పాలనలో పిఆర్ పల్లికి చేసిందేమీ లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంగారెడ్డి టౌన్, నవంబర్ 19: పదేళ్ల పాలనలో గుర్తుకు రాని గ్రామాలు, ప్రజలపై జగ్గారెడ్డికి ఇప్పుడేందుకంత ప్రేమ పుట్టుకొస్తుందని సీడీసి చైర్మన్ ఎస్.విజయేందర్‌రెడ్డి ప్రశ్నించారు. ఆదివారం పోతిరెడ్డిపల్లిలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జగ్గారెడ్డి తన పదేళ్ల కాలంలో పోతిరెడ్డిపల్లికి చేసిన అభివృద్ధి ఎమిటో ప్రజలకు తెలుసన్నారు. ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ మూడున్నర యేళ్ల కాలంలో పార్టీలకు అతీతంగా అభివృద్ధికి సహకరించారని, కాంగ్రెస్ సర్పంచ్ ఉన్నప్పటికీ రూ.4.50కోట్ల నిధులను వెచ్చించి అభివృద్ధి పనులు చేపట్టారన్నారు. జగ్గారెడ్డి నిర్వహిస్తున్న ముఖాముఖికి ప్రజాధరణ కరువై అద్దె మనుషులతో కార్యక్రమాలు నిర్వహిస్తున్నాడని ఆరోపించారు. నియోజకవర్గ ప్రజలు తనను మరిచిపోతారన్న భయంతోనే ముఖాముఖి నిర్వహిస్తున్నాడని, ఈ పర్యటనలో ఒరిగేదేమి లేదని ఎద్దేవా చేశారు. అధికారంలో ఉన్నప్పుడు ముగ్గురు ముఖ్యమంత్రులను తీసుకొచ్చి నియోజకవర్గ ప్రజలకు చేసిందేమిటో జగ్గారెడ్డి స్పష్టం చేయాలన్నారు. ముఖ్యమంత్రి కేసిఆర్ సంగారెడ్డికి రాలేదనడంలో అర్థం లేదని, ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ ఎల్లవేళల ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యలను పరిష్కరిస్తూ సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగుతున్నారన్నారు. తెరాస ప్రభుత్వ పరిపాలనలో ప్రజలంతా సంతృప్తిగా ఉన్నారని, రానున్న ఎన్నికల్లో మళ్లీ తెరాస అధికారంలోకి రావడం ఖాయమని ధీమావ్యక్తం చేశారు. చేసిన అవినీతి, అక్రమాలపై జైలుశిక్ష తప్పదన్న భయంతోనే ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలు చేయడం తగదన్నారు. ఎన్ని జిమ్మిక్కులు చేసిన ప్రజలు నమ్మేస్థితిలో లేరన్నారు. సమావేశంలో నాయకులు బత్తుల శ్రీనివాస్, దశరథ్‌రెడ్డి, దయాకర్‌రెడ్డి, మల్లారెడ్డి, రామప్ప తదితరులు పాల్గొన్నారు.