మెదక్

50 ఏళ్ల రైల్వే స్వప్నం.. త్వరలో సాకారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిద్దిపేట టౌన్, నవంబర్ 19: గోదావరి నీళ్లు వస్తే రైతుల కష్టాలు తీరుతాయని, బావులు, బోర్లు ఎండవు..పంటలు సమృద్దిగా పండుతాయన్నారు. రైతుల సంక్షేమానికి కృషి చేస్తున్న ప్రభుత్వానికి రైతులు భూములు ఇచ్చి అభివృద్థికి సహకరిస్తున్న రైతులందరికీ కృతజ్ఞతలని నీటిపారుదల శాఖ మంత్రి హరీష్‌రావు అన్నారు. ఆదివారం సిద్దిపేట జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో రైల్వేలైన్ నిర్మాణానికి రైతులు ఇచ్చిన భూములకు పరిహారం చెక్కులు అందించారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్‌రావు మాట్లాడుతూ వాతావరణ సమతుల్యత తగ్గి మార్పులు చోటుచేసుకుంటున్నాయని, కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా గోదావరి నీళ్లు వస్తే సీజన్ అయినా కాకపోయినా పంటల సాగుకు నష్టం ఉండదన్నారు. ప్రభుత్వ అభివృద్థికి ప్రజలు భాగస్వాములై అన్ని విధాల సహకారం అందిస్తున్నారన్నారు. సిద్దిపేట ప్రజల పదేళ్ల ఆకాంక్ష సిఏం కేసీఆర్ సహాకారం, కృషితో ఇప్పుడు నెరవేరుతుందన్నారు. రైల్వేలైన్‌తో రవాణా సౌకర్యాలు మెరుగైన విద్య, వ్యాపార పరంగా అభివృద్ధి జరుగుతుందన్నారు. హైదరాబాద్ నుండి కొత్తపల్లి వరకు రైల్వేలైన్‌కు భూసేకరణలో గజ్వేల్ నుండి సిద్దిపేట, సిరిసిల్ల మీదుగా కరీంనగర్ వరకు భూ సేకరణ జరుగుతుందన్నారు. నియోజకవర్గంలో జక్కాపూర్, మాచాపూర్ గ్రామాల రైతులు 110 మందికి 73 ఏకరాలకు రూ.4,7,17,875లు పరిహారంగా ఇవ్వడం జరిగిందన్నారు. వచ్చిన పరిహారంతో వృథా ఖర్చులు చేయకుండా తిరిగి భూమినే కొనుక్కోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపి కొత్తప్రభాకర్‌రెడ్డి, కలెక్టర్ వెంకట్రామ్‌రెడ్డి, జెసి పద్మాకర్, డిఆర్‌ఓ చంద్రశేఖర్, ఆర్డీఓ ముత్యంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
శ్రీరాంకుంట స్మృతి వన సందర్శన
సిద్దిపేట పట్టణ శివారులోని శ్రీరాంకుంట మోడల్ వైకుంఠ దామం నిర్మాణ పనులను మంత్రి హరీష్‌రావు పరిశీలించారు. అక్కడ జరుగుతున్న పనులను అడిగి తెలుసుకున్నారు. పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు. మంత్రి వెంట ఎంపి ప్రభాకర్‌రెడ్డి, మున్సిపల్ చైర్మన్ రాజనర్శు, కార్పోరేషన్ చైర్మన్ భూంరెడ్డి, పలువురు సర్పంచ్‌లు పాల్గొన్నారు.

తెలుగు మహాసభలతో తెలంగాణ సాహితీ ఔన్నత్యాన్ని చాటుదాం
* సాహిత్య అకాడమీ చైర్మన్ నందిని సిధారెడ్డి
సిద్దిపేట టౌన్, నవంబర్ 19: తెలంగాణ సాహిత్య గొప్పతనాన్ని చాటడానికే తెలుగు మహాసభలు నిర్వహిస్తున్నట్లు తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ నందిని సిధారెడ్డి అన్నారు. ప్రపంచ తెలుగు మహాసభలు సందర్భంగా సిద్దిపేట ప్రెస్‌క్లబ్‌లో ఆదివారం జరిగిన కవి సమ్మేళనంలో పాల్గొని మాట్లాడారు. తెలంగాణ ఉద్యమాన్ని నడిపిన సిద్దిపేటకు దేశ, ప్రపంచ వ్యాప్తంగా గొప్పగౌరవం దక్కిందన్నారు. తెలుగు మహాసభల ద్వార సిద్దిపేట ఔన్నత్యం మరింత పెరుగనుందన్నారు. తెలుగు మహాసభలు నిర్వహించే అవకాశం తనకు దక్కడం సిద్దిపేట సాహిత్యానికి దక్కిన గౌరవమన్నారు. సమైక్య రాష్టల్రో తెలంగాణ ప్రాంత కవులకు అనాడు జరిగిన మహాసభలకు ఆహ్వనం వస్తేనే గొప్పగా భావించేవారన్నారు. తెలంగాణ కవులంతా తమ పేర్లను నమోదు చేసుకోవాలని కవి సమ్మెళనాలకు ప్రత్యేక వేదిక ఏర్పాటు చేస్తున్నట్లు, ఆంధ్ర ప్రాంత కవులు రావడానికి సంసిద్ధంగా ఉన్నారన్నారు. అన్ని జిల్లాల్లో సన్నాహక సదస్సులు, సాహిత్య సభలు నిర్వహణకు 31జిల్లాలకు 5లక్షల చొప్పున నిధులు మంజూరు చేయడం జరిగిందన్నారు. విద్యార్థులకు కవిత్వ, ఉపన్యాస పోటిలు నిర్వహిస్తు సాహిత్య అవగహన ఇవ్వడం జరుగుతుందన్నారు. జిల్లా సమన్వయ కర్త రంగాచారి, ఉన్నత విద్యమండలి సభ్యుడు పాపయ్య, ప్రెస్ అకాడమీ సభ్యుడు కె.అంజయ్య, చంద్రయ్య, చంద్రారెడ్డి, తోట అశోక్, లక్ష్మయ్య, యాదగిరి, సురేందర్, ముళీదర్‌శర్మ, శైలజా, సువర్ణదేవి, అనురాధ పాల్గొన్నారు.