మెదక్

ఇందిర త్యాగనిరతి అనితర సాధ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంగారెడ్డి టౌన్, నవంబర్ 19: బడుగు, బలహీన వర్గాల కోసం పోరాడి, దేశం కోసం తన ప్రాణాలనే ఆర్పించిన మహనీయురాలు మాజీ ప్రధాని ఇందిరాగాంధీ అని సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆదివారం ఇందిరాగాంధీ శత జయంతి ఉత్సవాలను సంగారెడ్డిలో ఘనంగా నిర్వహించారు. పాత బస్టాండ్ నుంచి ఐబి అతిధి గృహం వరకు భారీ ర్యాలీ చేపట్టారు. ఐబి ముందుగల ఇందిరాగాంధీ విగ్రహానికి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి, జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు నిర్మలాజగ్గారెడ్డిలు పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జగ్గారెడ్డి మాట్లాడుతూ ఇందిరాగాంధీ 12యేళ్ల వయస్సులోనే గాంధీ, నెహ్రులతో కలిసి స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొనడంతో పాటు ఎన్నో సందర్భాల్లో జైలుకు సైతం వెళ్లారని గుర్తుచేశారు. మెదక్ పార్లమెంట్‌ను గెలుపొంది ప్రధాన మంత్రి అయ్యారన్నారు. సంగారెడ్డిలో ఆర్డినెన్స్, బిడిఎల్ పరిశ్రమలను నెలకొల్పి వేల మందికి ఉపాధి కల్పించారన్నారు. తన రాజకీయ జీవితాన్ని ప్రజలకే అంకితం చేశారని కొనియాడారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు తోపాజి అనంతకిషన్, కసిని రాజు, సాబేర్‌తో పాటు పెద్ద సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.

రాష్ట్రంలో అత్యుత్తమ పారిశ్రామిక విధానంతో కొత్త పరిశ్రమల వెల్లువ
సిద్దిపేట, నవంబర్ 19 : తెలంగాణ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా మార్చేందుకు సీఎం కేసిఆర్ ప్రణాళికాబద్ధంగా కృషిచేస్తున్నట్లు రాష్ట్ర హోంశాఖ మంత్రి నాయిని నర్సింహా రెడ్డి వెల్లడించారు. ప్రపంచంలో ఎక్కడా లేనివిధంగా రాష్ట్రంలో ముఖ్యమంత్రి అత్యుత్తమ పారిశ్రామి విధానం అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. సీఎం కార్యాలయంలో ప్రత్యేక సెల్‌ను ఏర్పాటు చేసి సింగిల్ విండో విధానంతో వివిధ రకాల అనుమతులు పరిశ్రమలకు మంజూరు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఒక్క పైసా ఖర్చులేకుండా పరిశ్రమలకు అనుమతులు మంజూరు చేసిన ఘనత సీఎం కేసీఆర్‌కు దక్కుతుందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో శాంతి భద్రతలు సక్రమంగా ఉండటం వల్లనే కొత్తగా 2500 పరిశ్రమలు వచ్చాయని..50వేల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభించాయన్నారు. పరిశ్రమల స్థాపనకు విద్యుత్, నీరు, రవాణ ఇతర వసతులు కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రపంచంలోని వివిధ దేశాలు తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నారన్నారు. రాష్ట్రంలో ఐటీ పరిశ్రమను మంత్రి కేటీఆర్ అభివృద్ధి చేస్తున్నట్లు పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో 16 ఉపాధి కార్యాలయాలు, 3 ప్రాంతీయ ఉపాధి కార్యాలయాలు సేవలు అందిస్తున్నారన్నారు. 31 జిల్లాలో ఉపాధి కార్యాలయాలను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ఇప్పటి వరకు 9,26,713 మంది నిరుద్యోగుల వివరాలను ఉపాధి కార్యాలయంలో నమోదు చేసినట్లు పేర్కొన్నారు. వివిధ రకాల యజమన్యాల నుంచి 2017 వరకు 8435 వరకు నోటిఫికేషన్లు స్వీకరించినట్లు పేర్కొన్నారు. 2009 మందిని ప్రభుత్వ, ప్రైవేటురంగ సంస్థల్లో నియమించినట్లు పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 583 జాబ్ మేళాలు నిర్వహించి 592 సంస్థల యజమాన్యాలు 10,546 మందికి ఉద్యోగం కల్పించినట్లు పేర్కొన్నారు. జాబ్ మేళాలను పూర్తి సద్వినియోగం చేసుకోవాలన్నారు. జాబ్ మేళాలలతో భవన నిర్మాణ కార్మికులకు సైతం ఉపాధి కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. విదేశాల్లో ఉపాధి కల్పించేందుకు కృషిచేస్తున్నారన్నారు. టామ్ కామ్ కంపెనీ ద్వారా విదేశాల్లో సైతం ఉద్యోగాలతో రక్షణ కల్పిస్తామన్నారు. ప్రైవేటు బ్రోకర్లను నమ్మి మోసపోవద్దని సూచించారు. భవన నిర్మాణ కార్మికులు గుర్తింపు కార్డులు నమోదు చేసుకోవాలన్నారు. గుర్తింపు పొందిన కార్మికులకు ప్రభుత్వ పరిహారం అందుతాయన్నారు. బంగారు తెలంగాణ కల్పన కోసం సీఎం కేసీఆర్ 20వేల మందికి విద్యుత్ కార్మికులను రెగ్యులరైజ్ చేస్తే కాంగ్రెస్ నేతులు కోర్టుకెళ్లి అడ్డుకున్నారన్నారు. అసెంబ్లీలో ప్రాజెక్టులు కట్టాలని కాంగ్రెస్ నేతలు కోర్టుకెళ్లి అడ్డుకుంటున్నారన్నారు. కాంగ్రెస్ నేతలు రెండు నాల్కల దోరణి అవలంభిస్తున్నారని విమర్శించారు. మిషన్‌భగీరథతో ప్రతి ఇంటికీ తాగునీరు అందించేందుకు కృషిచేస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న జాబ్ మేళాలను సద్వినియోగం చేసుకోవాలని నిరుద్యోగ యువతకు సూచించారు. బంగారు తెలంగాణకు సిద్దిపేట నమూనా అని హోమంత్రి నర్సింహరెడ్డి అన్నారు. 24 గంటల పాటు పనిచేసే మంత్రి హరీష్‌రావు లభించటం సిద్దిపేట ప్రజల అదృష్టమన్నారు. ఈకార్యక్రమంలో మంత్రి హరీష్‌రావు, డిప్యూటీ స్పీకర్ పద్మదేవేందర్‌రెడ్డి, ఎంపి కొత్తప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్సీ ఫారూక్‌హుస్సేన్, కార్మిక శాఖ ప్రిన్సిపాల్ కార్యదర్శి శశాంక్‌గోయల్, ఉప సంచాలకులు యాకుబ్‌నాయక్, జిల్లా కలెక్టర్ వెంకట్రామ్‌రెడ్డి, జాయింట్ కలెక్టర్ పద్మాకర్ మున్సిపల్ చైర్మన్ రాజనర్సు తదితరులు పాల్గొన్నారు.

‘్భమి’ వార్తకు స్పందన
*పోచారం ప్రాజెక్టు వద్ద పోలీస్ హెచ్చరిక బోర్డులు
మెదక్ రూరల్, నవంబర్ 19: ‘ప్రాజెక్టు అంచున ప్రమాద ఘంటిక’ అనే శీర్షికన ఈ నెల 12న ఆంధ్రభూమి కథనానికి హవేళీఘణాపూర్ పోలీసులు స్పందించారు. ఆదివారం ఎస్‌ఐ శ్రీకాంత్ తన సిబ్బందితో ప్రాజెక్టు పలుచోట్ల హెచ్చరికలతో కూడిన బోర్డులను ఏర్పాటు చేయించారు. మెదక్-కామారెడ్డి జిల్లా సరిహద్దులోని పోచారం ప్రాజెక్టు పిక్నిక్ స్పాట్ కావడంతో ఆదివారం ఇతర సెలవు దినాల్లో మిత్ర బృందాలు, కుటుంబ సభ్యులతో కలిసి విహరించడానికి విచ్చేస్తారు. ప్రాజెక్టు అంచు వరకెళ్లి సెల్ఫీలు, ఫొటోలు దిగే క్రమంలో ప్రమాదాలు జరిగేందుకు ఆస్కారముందంటూ ఆంధ్రభూమిలో వచ్చిన కథనంపై స్పందించిన హవేళీఘణాపూర్ ఎస్‌ఐ శ్రీకాంత్ ప్రత్యేకంగా హెచ్చరిక బోర్డులు తయారుచేయించారు. ‘నీటిలోకి వెళ్లి సెల్ఫీలు దిగరాదు’, పిల్లలు, మహిళలు, వృద్ధులు బోటింగ్ చేయునపుడు జాగ్రత్తగా ఉండవలెను’ అనే సూచనలతో కూడిన బోర్డులు ఏర్పాటు చేయించారు. పర్యాటకులు సంతోషంగా వచ్చి ఇక్కడ గడిపి అదే ఆనందంతో ఇంటికి వెళ్లాలని సూచించారు. ప్రమాదాలు కొనితెచ్చుకోరాదు, కుటుంబాల్లో విషాదం నింపకుండా ఉండేందుకు తమవంతు ప్రయత్నంగా ప్రాజెక్టు వద్ద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయడమేకాకుండా ఆదివారం సెలవు దినాల్లో తమ సిబ్బంది ఉంటారని, తాను సైతం పర్యవేక్షించనున్నట్లు ఎస్‌ఐ శ్రీకాంత్ తెలిపారు.