మెదక్

వ్యవసాయ రుణ పరిమితిపై స్పష్టత కరువు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిన్నశంకరంపేట, డిసెంబర్ 12: రకరకాల సమస్యలతో సతమతమవుతున్న రైతాంగానికి బ్యాంకర్ల తీరు మరింత ఆందోళనకు గురిచేస్తోంది. పంట రుణాల బట్వాడాలో ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలను ఏమాత్రం పట్టించుకోవడం లేదు. రుణాలు మంజూరు చేయడంలో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నందున సకాలంలో పెట్టుబడులు సమకూర్చలేక అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. తెలంగాణ ప్రభుత్వం రైతు సంక్షేమానికి అనేక పథకాలు అమలు చేస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం పంట రుణాలు పరిమితి పట్ల జరుగుతున్న పర్యవేక్షణ లోపం కారణంగా ఆశించిన ఫలితాలు సాధ్యం కావడం లేదు. ఏఏ పంటకు ఎకరానికి ఎంత మొత్తాన్ని రుణంగా ఇవ్వాలన్న అంశంపై రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ సమావేశంలో నిర్ణయించింది. అయినప్పటికీ గ్రామ స్థాయిలో అవి అమలుకు నోచుకోవడం లేదు. 2017-18 వ్యవసాయ సంవత్సరానికి సంబంధించిన సీఎం కేసీఆర్ సమక్షంలో నిర్దేశించిన రుణ పరిమితిని ఏ ఒక్క బ్యాంక్ కూడా పరిగణలోకి తీసుకోవడం లేదు. ప్రభుత్వ లెక్కల ప్రకారం పేట మండలంలో 9360 రైతు కుటుంబాలు ఉన్నాయి. ప్రతి ఎకరం సాగుపై రూ.29 వేల నుంచి 31 వేల వరకు రుణాలు మంజూరు చేయాల్సి ఉంది. కానీ రూ.15 వేలకు మించి రుణం ఇవ్వడం లేదని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంలో వాణిజ్య గ్రామీణ బ్యాంక్‌లతో పాటు రైతులకు చేదోడువాదోడుగా ఉండే సహకార బ్యాంక్‌లు కూడా అదే విధానాన్ని అవలంభిస్తున్నాయి. పంట రుణాలకు సంబంధించి ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం మొక్కజొన్న పంటకు 25 వేల నుండి 27 వేల వరకు రుణం ఇవ్వాల్సి ఉంది. కానీ గ్రామ స్థాయిలో బ్యాంక్‌లు ఎకరానికి 10 వేలకు మించి రుణం మంజూరు చేయలేని పరిస్థితి ఉంది. జిల్లాలో కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ చూసినా నిర్దేశిత మొత్తంలో సగం వరకు కూడా రుణాలు ఇవ్వని పరిస్థితి నెలకొంది. పంట సాగు పెట్టుబడులు భారీగా పెరిగినా నేపథ్యంలో ఈ విషయాన్ని ప్రభుత్వం తీవ్రంగా పరిగణించి తగిన చర్యలు తీసుకోవాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ కాలానికి చెరువులో నీళ్లు లేకపోవడంతో ఆయకట్టు క్రింద భూములన్ని బీడుగా ఉన్నాయి.

కన్నుల పండువగా మల్లికార్జున భ్రమరాంబ
కల్యాణోత్సవ వైభవం

కొల్చారం, డిసెంబర్ 12: మండలంలోని కోనాపూర్ గ్రామ శివారులో మంగళవారం మల్లిఖార్జున బ్రమరాంబల కల్యాణోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. స్థానిక సర్పంచ్‌లు వెంకటేశంగుప్త, దుర్గమ్మ లక్ష్మాగౌడ్ ఆధ్వర్యంలో ఈ కల్యాణోత్సవాన్ని నిర్వహించారు. ఉదయానే్న కలశ స్థాపన, పూర్ణకుంభంతో స్వామివారిని కల్యాణ మండపానికి తీసుకువుళ్లి బ్రమరాంబ పట్టువస్త్రాలతో కల్యాణోత్సవాన్ని పురోహితుల సమక్షంలో నిర్వహించారు. ప్రతి సంవత్సరం డిసెంబర్ మాసంలో శట్టి ఏడు వారాల్లో భాగంగా అగ్నిగుండాలు, స్వామివారి కల్యాణోత్సవం నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. కోనాపూర్, ఏటిగడ్డ మాందాపూర్‌తో పాటు ఎనగండ్ల, పైతర, రంగంపేట సమీపంలోని భక్తులు భారీయెత్తున పాల్గొన్నారు.