మెదక్

ప్రచార ఆర్భాటమే.. ప్రజలకు చేసిందేమీలేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కౌడిపల్లి, డిసెంబర్ 12. 2014 ఎన్నికల్లో హామీల వర్షం కురిపించిన టీఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వాటిని పూర్తిగా విస్మరించి, తెలంగాణ ప్రజలను మోసం చేసిందని మాజీ మంత్రి, ఉమ్మడి మెదక్ జిల్లా డీసీసీ అధ్యక్షురాలు సునీతారెడ్డి అన్నారు. మంగళవారం చిలప్‌చెడ్ మండలం చండూర్ గ్రామంలో మండల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల విసృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశానికి సునీతారెడ్డి ముఖ్యఅతిథిగా హజరై మాట్లాడారు. 2014 ఎన్నికల మెనిఫెస్టోలో పొందుపరిచిన హమీలను టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఏ ఓక్కటి కూడ సక్రమంగా అమలు పరచడంలేదన్నారు. రైతులకు రుణమాఫీ కాలేదని, ఓక్క తెలంగాణ రాష్ట్రంలోనే 3వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నప్పటికి ప్రభుత్వానికి చీమ కుట్టినట్లు లేదన్నారు. ఉద్యోగ నోటిఫికేషన్లు వేయకపోవడం మూలంగా నిరుద్యోగులైన యువకులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. డీఎస్సీ నోటిఫికేషన్ ఆలస్యమైతే కొంపలు మునుగుతాయా అని స్వయంగా కేసీఆర్ మాట్లాడం నిరుద్యోగ యువతీయువకులను మానసికంగా ఆవేదనకు గురిచేయడం సమంజసమేనా అని ఆమె ప్రశించారు. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ ప్రాజెక్టుల పేరుతో ప్రజాధనాన్ని పాలకులు దోచుకుంటున్నారని ఆరోపించారు. డబుల్ బెడ్‌రూం ఇండ్ల నిర్మాణం ఏమైందని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. భూమిలేని నిరుపేద దళితులకు మూడెకరాల సాగుభూమి పంపిణీ చేస్తామని హమీ ఇచ్చిన టీఆర్‌ఎస్ సర్కార్ ఎంత మంది దళితులకు భూపంపిణీ చేసిందో వారి వివరాలను వెల్లడించాలన్నారు. నిధులు, నీళ్లు, నియామకాలు ఏమైయ్యాయని ప్రభుత్వంపై సునీతారెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైతే తమ ప్రాంతానికి చెందిన వారికి ప్రభుత్వ ఉద్యోగాలు వస్తాయనే ఆశతో యువకులు ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నారని, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వకుండా వారి జీవితాలతో అడుకుంటుందని ఉద్యమించిన వారిని అరెస్టులు చేసి కేసులు పెడుతున్న ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించుకుంటుందని సునీతారెడ్డి అన్నారు. అసాధ్యమైన హమీలను ఇచ్చి ప్రజల నడ్డివిరిచిన కేసీఆర్‌కు వచ్చే ఎన్నికల్లో ప్రజలే బుద్ధి చెబుతారన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పార్టీలకతీతంగా ప్రభుత్వ పథకాలను ప్రజలకు వర్తింపజేసిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధి పనులే నేటికి గ్రామాలలో దర్శనిమిస్తున్నాయని ఆమె పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలకు పేర్లు మార్చి వాటిని తమ ప్రభుత్వం చేసిందని చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వంలో మంత్రులకు, ఎమ్మెల్యేలకు మాట్లాడే స్వేచ్ఛ లేకపోవడం నిరకుంశపాలనకు నిదర్శనమన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో కేవలం నలుగురితోనే పరిపాలన కొనసాగుతుందని, కుటుంబ పాలనకు ప్రజలు చరమగీతం పాడాలని ఆమె పిలుపునిచ్చారు. ప్రజల్లో ప్రభుత్వంపై చాలా వ్యతిరేకత ఉందని, వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీదే అధికారమని సునీతారెడ్డి స్పష్టం చేశారు. ఎన్నికల హమీలను విస్మరించిన టీఆర్‌ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టి కాంగ్రెస్ కార్యకర్తలు ప్రజలకు అవగాహన కల్పించి పార్టీని బలోపేతం చేయాలన్నారు. గ్రామాలలో బూత్‌కమిటీలను పటిష్టపరిచి వచ్చే ఎన్నికల నాటికి పార్టీని పటిష్టపరిచి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని సునీతారెడ్డి అన్నారు. ఈ సమావేశంలో మండల పార్టీ అధ్యక్షులు ఎం.సి.విఠల్, మాజీ ఎంపీపీ యాదగౌడ్, మాజీ మార్కెట్ కమిటీ ఛైర్మెన్ నారాయణరెడ్డి, సిడిసి మాజీ ఛైర్మెన్ దుర్గారెడ్డి, మాజీ పార్టీ అధ్యక్షులు మాణిక్యరెడ్డి, సంగాగౌడ్, నారాయణరెడ్డి, సర్పంచులు రాజు, అనంతరామాగౌడ్, విఠల్, స్థానిక ఎంపీటీసీ సభ్యులు యోగేష్, నాయకులు అంజయ్యగుప్తా, రాంచెంద్రారెడ్డి, జగన్‌మోహన్‌రెడ్డి, ఖలీల్, హన్మంత్, మధుసూధన్, భీమయ్య, వివిధ గ్రామాలకు చెందిన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
కాంగ్రెస్‌పార్టీలో చేరికలు.
చండూర్‌లో మంగళవారం జరిగిన సమావేశంలో అజ్జమర్రి, చిలప్‌చెడ్, శీలాంపల్లి గ్రామాలకు చెందిన పలువురు కాంగ్రెస్ పార్టీలో చేరారు. చేరిన వారికి సునీతారెడ్డి పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వనించారు. పార్టీలో చేరిన ఎం.డి.పాష, మల్లేశం, యాదగిరి, రమేష్, మల్లేశం, శ్రీనివాస్‌రెడ్డి, దుర్గయ్యతో పాటు సుమారు 50 మంది వరకు ఉన్నారు.
రైతులకు ఏకకాలంలో 2లక్షల రుణమాఫీతో పాటు రైతులు పండించిన పంటలకు రైతులు కోరిన విధంగా ప్రభుత్వ మద్దతు ధరలు చెల్లిస్తామని, లక్ష ప్రభుత్వ ఉద్యోగాలు, నిరుద్యోగులకు నెలకు 3వేల రుపాయల నిరుద్యోగ భృతి, ఇందిరమ్మ ఇండ్ల బిల్లులు మంజూరు, మహిళా సంఘాలకు 1800 కోట్ల రుణాల బకాయిలను విడుదల చేస్తామని సునీతారెడ్డి తెలిపారు. బడుగు, బలహీన వర్గాల ప్రజలను అన్ని రంగాలల్లో అభివృద్ధి చేస్తామని, రాజకీయాలకతీతంగా అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలను అందజేస్తామని ఆమె తెలిపారు.