మెదక్

కష్టాల్లో రైతులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంగారెడ్డి, జనవరి 17: తెలంగాణాలోని ప్రతి రైతు నెత్తిపై 93 వేల చొప్పున సగటు అప్పు కూర్చుందని, మూడేళ్లలో రైతులు ఎదుర్కొన్న కష్టాలు ఎప్పుడు చూడలేదని టీజేఏసీ చైర్మన్ కోదండరాం ఆవేదన వ్యక్తం చేసారు. పోరాడి సాధించుకున్న తెలంగాణాలో మంచి బతుకును ఇవ్వాలని కోరుకునే హక్కు మనకు ఉందని చాటి చెప్పడానికి ప్రతి ఒక్కరు చైతన్యవంతులు కావాలని పిలుపునిచ్చిరు. బుధవారం సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణంలోని ఆస్రా పంక్షన్‌హాల్‌లో నిర్వహించిన రైతు, నిరుద్యోగ గర్జన సభకు కోదండరాం ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అంతకుముందు ఐబీ నుండి ఆస్రా కాంప్లెక్స్ వరకు కళాకారుల నృత్యాల మద్య బైకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుపై ఎండగట్టారు. తెలంగాణ ఉద్యమం సమయంలో మూడు రోజులు నిద్రాహారాలు మానుకుని రైలు పట్టాలపై కూర్చున్నారని గుర్తు చేసారు. జైళ్లకు వెళ్లారు..కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకున్నారు. తెలంగాణ వస్తే బతకులు బాగుపడుతాయని జీవితాలను త్యాగం చేసారని, జెండాలు పట్టుకుని తిరిగితే ఈసడించుకున్నా లెక్క చేయలేదన్నారు. ప్రొఫెసర్ జయశంకర్‌ను జనరల్ బోగీలో కూర్చుండబెట్టి రైలు ప్రయాణం చేయించిన విషయాన్ని గుర్తు చేసారు. అన్ని రకాలుగా కొట్లాడినందుకే ఇప్పుడు అడగడానికి అదనపు హక్కు ఉందన్నారు. వ్యవసాయంలో మార్పును కోరుకుని నిపుణులతో సంప్రదించి సూచనలు చేస్తే ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. ఆత్మహత్యలపై కోర్టుకు వెళ్లాల్సిన దుస్థితి నెలకొందని, తాము చేసిన సూచనలు బాగున్నాయని ప్రభుత్వం కోర్టు ముందు అంగీకరించినా ఆచరణలోకి తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేసారు. రైతు సమస్యలపై కమిటీలు వేస్తే పరిష్కరించే అవకాశం ఉంటుందని చెప్పినా ప్రభుత్వం పెడచెవిన పెడుతుందన్నారు. తెలంగాణాలో 4 వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని, ఇందులో సిద్దిపేట జిల్లాలో అధికంగా ఉండగా గజ్వేల్ నియోజకవర్గం నంబర్ వన్ స్థానంలో ఉండటం దురదృష్టకరమన్నారు. బోర్లు ఎక్కడ ఎక్కువగా ఉంటే అక్కడ రైతుల ఆత్మహత్యలు అధికంగా ఉన్నాయని తమ పరిశీలనలో తేలిందన్నారు. పత్తి సాగు ఉన్న ప్రాంతంలో కూడా రైతుల బలవన్మరణాలు ఎక్కువగా ఉన్నట్లు స్పష్టం చేసారు. ఆత్మహత్యలపై ప్రభుత్వం స్పందించకపోవడం వల్లనే నిలదీయాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. బ్యాంకుల నుండి రుణాలు రావడం లేదని, దీంతో ప్రైవేట్ వడ్డీ వ్యాపారులను ఆశ్రయించి అన్నదాతలు అప్పుల పాలవుతున్నారని ఆందోళన వ్యక్తం చేసారు. రుణ మాఫీపై రైతుల్లో అసంతృప్తి ఉందని, వడ్డీ అలాగే నెత్తిన మోస్తున్నారని చెప్పారు. పాలీహౌస్ సాగుకు వెయ్యి కోట్లు కేటాయించారని, ఆ వెయ్యి కోట్లతో చిన్న రైతులను బాగు చేయవచ్చని సూచించానా పట్టించుకోలేదని, కమీషన్ల కోసమే ఇలాంటి ఆలోచనలు చేస్తున్నారని కోదండరాం ఆరోపించారు. పంటలపై ఆశిస్తున్న చీడపీడలు, తెగుళ్లను అరికట్టలేమని శాస్తవ్రేతలు చేతులెత్తి వేసారన్నారు. అష్టకష్టాలు పడిన రైతు అంగట్లోకి వెళ్లి అధ్వాన్న పరిస్థితిని చవిచూస్తున్నారని విచారం వ్యక్తం చేసారు. సాగు చేసుకోవడానికి ఇచ్చిన అసైన్డ్ భూములను లాక్కోవడానికి చూస్తున్నారని, అవసరమైతే భయానికి గురి చేస్తున్నారని విమర్శించారు. నిజాం కట్టించిన చక్కర ఫ్యాక్టరీ తెలంగాణ వస్తే గాడిలో పడుతుందని ఆశిస్తే మొత్తానికే మూతపడిందని ఆవేదన వ్యక్తం చేసారు. మూడేళ్లలో జరిగినన్ని అన్యాయాలను రైతులు ఎప్పుడు చవిచూడలేదన్నారు. వ్యవసాయం లేకపోతే ఎవరు బతకరని, వ్యవసాయ రంగాన్ని పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఒక్క కుటుంబానికే బతుకా అందరికి కావాలని కోరడమే తప్పుగా బావిస్తున్నారని వివరించారు. కొలువుల కొట్లాట సభ నిర్వహించుకోవడానికి అనేక అవాంతరాలు సృష్టించారని, కోర్టుకు వెళ్లి అనుమతి తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని, కోర్టు అనుమతిస్తే అర్ధరాత్రి పూట అరెస్టుల పర్వం కొనసాగించారన్నారు. రైతుల సమస్యల పరిష్కారం కోసం సుదీర్ఘంగా పోరాటం చేసేందుకు ఫిబ్రవరి మొదటి వారంలో కూర్చుని కార్యాచరణ రూపొందిస్తామన్నారు. పరిష్కారమయ్యే వరకు నిద్రపోకుండా నిరంతర ఉద్యమాలు నిర్వహిస్తామని, ఇందుకు ప్రతి ఒక్కరు సహకరించాలని, మా వెనుక కూడా పెద్ద దండు ఉందని, కదలడమే తరువాయిగా తమ సత్తా ఏమిటో చూపిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో టీ జేఏసీ నాయకులు అశోక్‌కుమార్, బీరయ్య యాదవ్, తుల్జారెడ్డితో పాటు వందల మంది పాల్గొన్నారు.