మెదక్

రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేయడమే సీఎం లక్ష్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంగారెడ్డి టౌన్, జనవరి 19: తెలంగాణ రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేయాలన్నదే ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యమని డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి అన్నారు. శుక్రవారం జెడ్పీ చైర్ ప ర్సన్ రాజమణి మురళీయాదవ్ అధ్యక్షతన ఉమ్మడి మెదక్ జిల్లా పరిషత్ సర్వసభ్య సాధారణ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యఅతిధి గా హాజరైన పద్మాదేవేందర్‌రెడ్డి మా ట్లాడుతూ గొల్ల,కుర్మలు ఆర్థికంగా అ భివృద్ధి చెందాలన్న ఉద్దేశంతో ప్రభు త్వం గొర్రెల యూనిట్ల పంపిణీ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టిందన్నారు. ఏలా ంటి అవకతవకలకు తావులేకుండా లబ్ధిదారులందరికీ న్యాయం జరిగేలా యూనిట్ల పంపిణీ చేయాలన్నారు. మార్చి చివరిలోపు యూనిట్ల పంపిణీ లక్ష్యాన్ని పూర్తిచేయాలని సంబంధిత శాఖ అధికారిని ఆదేశించారు. సంచార పశువైద్యశాలకు స్పందన ఎలా ఉం దని అడిగి తెలుసుకున్నారు. గొర్ల కా పారులకు ఎన్‌ఆర్‌ఇజిఎస్ కింద షెడ్లు నిర్మించుకునేందుకు రూ.50వేలు ఇవ వడం జరుగుతుందని, దీనిపై ప్రచారం కల్పించి సద్వినియోగపర్చుకునేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. భూ రికార్డుల ప్రక్షాళన కార్యక్రమం సీఎం కేసీఆర్ తీసుకున్న సహసోపేత నిర్ణయమన్నారు. రాష్ట్రం లో 93శాతం భూ ప్రక్షాళన పూర్తయిందని, 7శాతం చిన్న చిన్న సమస్యలతో కాలేకపోయాయన్నారు. రికార్డులన్ని ఆన్‌లైన్‌లో నమోదు చేయించి మే మాసం నుండి ఎకరాకు 4వేల చొ ప్పున రైతుల ఖాతాల్లో జమ అవుతాయని వెల్లడించారు. కేసీఆర్ కిట్‌తో ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాల స ంఖ్య పెరిగిందన్నారు. తక్కువ సంఖ యలో ప్రసవాలు జరుగుతున్న పిహెచ్‌సిలను పరిశీలించాలని ఇన్‌చార్జ్ జిల్లా వైద్యాధికారి గాయత్రిని ఆదేశించారు. సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని, ప్రతిపక్షాలు చిన్నచిన్న పొ రపాట్లను భూతద్దంలో పెట్టి చూపడ ం సరికాదన్నారు. నూతన రాష్ట్రంలో రూ. 17వేల కోట్ల రుణమాఫీ జరగడం చరిత్ర పుటల్లో నిలుస్తుందన్నారు. వ్యవసాయం, విద్యుత్, ఇరిగేషన్, వైద్య ఆరోగ్య, విద్యాశాఖ, పశు సంవర్ధక శాఖ, పంచాయతీరాజ్, పౌర సరఫరాలు తదితర శాఖల ద్వారా అ మలు చేస్తున్న అభివృద్ధి పథకాలను సంబంధిత అధికారులు వివరించా రు. పలువురు జెడ్పీటీసీలు, ఎంపీపీలు పలు సమస్యలను సమావేశం దృష్టికి తీసుకొచ్చి పరిష్కరించాలని కోరారు. సమావేశంలో మెదక్, జహీరాబాద్ పార్లమెంట్ సభ్యులు కొత్త ప్రభాకర్‌రెడ్డి, బిబి పాటిల్, ఎమ్మెల్యేలు మదన్‌రెడ్డి, బాబుమోహన్, ఎమ్మెల్సీలు భూపాల్‌రెడ్డి, రాములునాయక్, జిల్లా కలెక్టర్ మాణిక్యరాజ్ కణ్ణన్, జెడ్పీ సీఈఓ రవి తదితరులు పాల్గొన్నారు.