మెదక్

పిడిచెడ్ అభివృద్ధికి నా వంతు సహకారం అందిస్తా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గజ్వేల్, జనవరి 21: పిడిచెడ్ గ్రామ అభివృద్ధికి తన వంతు సహకారం అందిస్తానని మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం పిడిచెడ్ గ్రామస్తులు మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డిని కలిసి గ్రామంలో నెలకొన్న సమస్యలు ఆయన దృష్టికి తెచ్చారు. దీంతో స్పందించిన ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి పాఠశాల కాంపౌండ్‌వాల్ నిర్మాణానికి రూ. 10లక్షలు, ఎస్సీ కమ్యూనిటీహాల్ భవనానికి రూ. 10లక్షలు అప్పటికప్పుడే మంజూరీ చేశారు. అయితే ఈ అభివృద్ది పనులకు ఈ నెల 27న శంఖుస్థాపన చేయడంతోపాటు గ్రామంలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి స్వయంగా పరిశీలించి నిదులు మంజూరీ చేస్తానని హామీ ఇచ్చారు. సీసీ రోడ్లు, మురికి కాలువల నిర్మాణం, తాగునీటి సమస్యలు పరిష్కరించాలని ఉపసర్పంచ్ లక్ష్మి, న్యాయవాది అశోక్‌రెడ్డిలు ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డిని కోరారు. ఈ కార్యక్రమంలో నేతలు నారాయణ, యాదగిరి, సత్యం, పిట్ల రాములు, నర్సింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
గుర్తు తెలియని వృద్ధుడు మృతి
సదాశివపేట, జనవరి 21: నెల రోజుల కాలంగా మండల పరిధిలోని పెద్దాపూర్ గ్రామంలో అడుక్కుని తింటున్న గుర్తు తెలియని వృద్దుడు బస్టాండ్ సమీపంలో మృతి చెందాడని ఇన్స్‌పెక్టర్ కేతిరెడ్డి సురేందర్‌రెడ్డి తెలిపారు. సుమారు 55 సంవత్సరాల వయస్సు కల వృద్దుడు కొంత కాలంగా పెద్దాపూర్ గ్రామంలో బిక్షాటన చేస్తూ జీవనం సాగిస్తున్నాడని అన్నారు. బస్టాండ్ సమీపంలో ఉన్న ఓంకార్ స్వీట్‌హౌస్ ముందు రోడ్డు మీద మురికి నీటిలో చనిపోయినట్లు తెలిపారు. ఈ మేరకు శవాన్ని సదాశివపేట ప్రభుత్వ ఆసుపత్రి మార్చురికి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు.
పీఎస్ ముందు ఆందోళన చేసిన వారిపై కేసు నమోదు
సదాశివపేట, జనవరి 21: బంధువు మృతికి కారణమైన వారిని అరెస్టు చేయకుండా ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారని కొంత మంది సదాశివపేట పోలీస్ స్టేషన్ ముందు 65వ జాతీయ రహదారిపై ధర్నాకు దిగగా వారిపై కేసు నమోదు చేసినట్లు ఇన్స్‌పెక్టర్ కేతిరెడ్డి సురేందర్‌రెడ్డి తెలిపారు. మూడు రోజుల క్రితం పట్టణంలో ఓ మహిళ చనిపోగా అందుకు కుటుంబ సభ్యుల వేధింపుల వల్లనే చనిపోయిందని పిర్యాదు చేసారన్నారు. ఈ కేసును దర్యాప్తు చేస్తుండగా ఆదివారం నాడు అరుణరెడ్డి, మణి, శేక్ యూనూస్, జహుర్, సాహిదా, సాసీద్, రఫీతో మరికొంత మంది వచ్చి ధర్నా చేపట్టారన్నారు. జిల్లాలో 30 పోలీస్ యాక్ట్ అమలులో ఉండగా ఇలాంటి ధర్నాలు చేయకూడదని, పైగా వాహనాలతో రద్దీగా ఉండే జాతీయ రహదారిపై ధర్నా చేసి ట్రాఫిక్‌కు అంతరాయం కల్గించారన్నారు. ఈ మేరకు ఆందోళన చేపట్టిన వారిపై కేసు నమోదు చేసినట్లు ఆయన వెల్లడించారు.