మెదక్

డ్రైనేజీ పనులు వేగవంతం చేయండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిద్దిపేట, జనవరి 22: సిద్దిపేట పట్టణంలో 300 కోట్లతో నిర్మిస్తున్న అండర్‌గ్రౌండ్ డ్రైనైజీ పనులు వేగవంతం చేయాలని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి హరీష్‌రావు ఆదేశించారు. సోమవారం సిద్దిపేట పట్టణంలోని 2,3, 7,31వ వార్డులో జరుగుతున్న అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ పనులు క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. ఈసందర్భంగా మంత్రి హరీష్‌రావు మాట్లాడుతూ 66 కోట్లతో 44కి.మీ పనులు పూర్తయినాయన్నారు. మిగత పనులు మరింత వేగిరంగా చేపట్టాలని సూచించారు. అదే విధంగా 116 కోట్ల పనులు టెండర్ ప్రక్రియ పూర్తయిందని, పనులు ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. పనుల్లో రాజీపడేది లేదని, నాణ్యతతో కూడిన పనులు చేపట్టాలని ఆదేశించారు. సిద్దిపేట పట్టణంలో నిర్మిస్తున్న అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వంద ఏండ్లకు పునాదని, ప్రజల భాగస్వామ్యం, సహాకారం గొప్పదన్నారు. ప్రజలకు ఎక్కడ ఇబ్బంది కలుగ కుండ పనులు చేయాలన్నారు. పనులకుప్రజలు సైతం పూర్తి స్థాయిలో సహాకారం అందించాలన్నారు. అండర్ గ్రౌండ్‌లో భాగంగా ఛాంబర్ నిర్మాణాలు పటిష్టం చేయాలన్నారు. మార్చిలోగా వరద నీటి కాలువ పనులు పూర్తి చేయాలని ఆదేశించారు.
తడి, పొడి చెత్తను వేరు చేయాలి
ప్రజలు తడి, పొడిచెత్తను వేరు చేసి మున్సిపల్ చెత్త వాహనానికి అందించాలని మంత్రి హరీష్‌రావు సూచించారు. పట్టణంలోని వార్డు పర్యటనలో భాగంగా మున్సిపల్ వాహనం ఇంటింటీ చెత్త సేకరణను పరిశీలించారు. మహిళలను చెత్తను ఏలా ఇస్తున్నారని మున్సిపల్ సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. స్వచ్ఛ సర్వేక్షన్‌లో భాగస్వామ్యం అవుతున్నారని అడిగి తెలుసుకున్నారు. ప్రతి ఇంటికి తిరిగి స్వచ్ఛ సర్వేక్షన్‌లో ప్రజలు భాగస్వామ్యం అయ్యే విధంగా అవగాహన కల్పించాలని కమిషనర్ శ్రీనివాస్‌రెడ్డికి ఆదేశించారు.
రోడ్డుపై చెత్తవేయంపై మంత్రి హరీష్ ఆగ్రహం
పట్టణంలోని పారుపల్లి వీధీలోని నేహ్రు పార్కు వద్ద రోడ్డు చెత్త వేయటంపై మంత్రి హరీష్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. రోడ్డుపై ఉన్న చెత్తను వెంటనే తొలగించాలని ఆదేశించారు. ప్రజలు సైతం రోడ్డున చెత్తవేయవద్దని సూచించారు. రోడ్డుపై చెత్త వేయకుండ మున్సిపల్ అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.ఈకార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రాజనర్సు, కౌన్సిలర్లు బర్లమల్లికార్జున్, ప్రభాకర్, ప్రశాంత్, నాయకులు పాల సాయిరాం, శ్రీకాంత్, రామన్న, మల్యాల బాలరాజు,కనకరాజు, నటరాజ్ తదితరులు పాల్గొన్నారు.