మెదక్

ప్రజాహితం టీఆర్‌ఎస్ ప్రభుత్వ లక్ష్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గజ్వేల్, ఫిబ్రవరి 20: ప్రజాహితం కోరుతూ టీఆర్‌ఎస్ ప్రభుత్వం వివిద సంక్షేమ పథకాలకు రూపకల్పన చేసి పేదల జీవితాల్లో వెలుగులు నింపుతున్నట్లు సీఎం కేసీఆర్ జన్మదిన వారోత్సవాల కమిటీ చైర్మెన్ నర్సింహారెడ్డి పేర్కొన్నారు. మంగళవారం పిడిచెడ్, బయ్యారంలలో నిర్వహించిన కార్యక్రమాలలో పాల్గొని ఆయన మాట్లాడారు. అన్నదాతల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని పండించిన పంటలకు గిట్టుబాటు దర కల్పించడంతోపాటు 24గంటల ఉచిత విద్యుత్ అందిస్తున్న ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కిందని స్పష్టం చేశారు. అలాగే ప్రతి ఎకరాకు పంట రాయితీ క్రింద రూ. 8వేలు అందజేస్తుండగా, పంట రుణమాఫీని వర్తింపజేసి రైతులను రుణ విముక్తులను చేసిన సీఎం కేసీఆర్‌కు ఎప్పుడూ రుణపడి ఉండాలని తెలిపారు. పేదల ఆర్థిక స్థితిగతులను దృష్టిలో పెట్టుకొని కళ్యాణలక్ష్మి, షాధీముబారక్, కేసీఆర్ కిట్స్, వివిద రకాల పెన్షన్‌లు, డబల్‌బెడ్‌రూం ఇండ్ల మంజూరీ, పేద మైనార్టీ, బీసీ విద్యార్థులకు కార్పోరేట్ తరహాలో గురుకుల విద్యాబోదన, మిషన్‌భగీరథ, మిషన్ కాకతీయతో తాగునీరు, సాగునీటి సమస్యకు పరిష్కారం, ప్రాజెక్టుల నిర్మాణంతో బీడుభూముల సాగు, భూరికార్డుల ప్రక్షాలనతో సమస్యలకు పరిష్కారం, సీసీరోడ్లు, మురికి కాలువల నిర్మాణం, పాఠశాలలకు అదనపు తరగతి గదులు, హరితహారంతో పచ్చటి వాతావరణం, మరుగు దొడ్ల నిర్మాణంతో వ్యక్తిగత, పరిసరాల పరిశుబ్రత వంటి అంశాలకు ప్రాధాన్యతనిస్తూ సీఎం కేసీఆర్ నిదులు వెచ్చిస్తున్నట్లు చెప్పారు. అయితే గతంలో ఎన్నడూ లేని విదంగా నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో తీర్చి దిద్దుతున్న టీఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని ఆదరించి ఆశీర్వదించాలని వివరించారు. ఈ నెల 21న సింగాటంలో జరగనున్న కార్యక్రమానికి ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డితోపాటు రాష్ట్ర కార్పోరేషన్ చైర్మెన్‌లు నర్సారెడ్డి, భూంరెడ్డి, ఎలక్షన్‌రెడ్డిలు హాజరు కానున్నట్లు ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ నాగిరెడ్డి, నేతలు అంజనేయులు, నర్సింలు, రామచంద్రరాజు, లక్ష్మినారాయణ, మహిపాల్‌రెడ్డి, మహేశ్, కిష్టయ్య తదితరులు పాల్గొన్నారు.