మెదక్

అభివృద్ధిలో బ్యాంకర్లు భాగస్వాములు కావాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంగారెడ్డి టౌన్, మార్చి 14: ప్రభుత్వం అందించే ఆర్థిక మద్దత్తు పథకాల గ్రౌండింగ్ విషయంలో బ్యాంకర్లు సానుకూల దృక్పథంతో వ్యవహరించాలని జిల్లా కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు ఉద్బోదించారు. బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన జిల్లా సంప్రదింపుల కమిటీ (డీసీసీ), జిల్లా స్థాయి సమీక్షా కమిటీ (డీఎల్‌ఆర్‌సీ) సమావేశానికి కలెక్టర్ అధ్యక్షత వహించి మాట్లాడారు. ప్రభుత్వం దారిద్య్రరేఖకు దిగువన ఉన్న ప్రజల ఆర్థికాభివృద్ధి కోసం ఆర్థిక మద్దత్తు పథకాలను ప్రవేశపెట్టి సబ్సిడి రూపంలో డబ్బును ఇవ్వడం జరుగుతుందన్నారు. ముఖ్యంగా బ్యాంకర్లు ఈ పథకాలపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. ఎస్సీ,ఎస్టీ,బీసీ,మైనార్టీ శాఖల ద్వారా అందిస్తున్న వివిధ పథకాలకు సంబంధించి ఈ నెల 25లోగా గ్రౌండింగ్ పూర్తి చేయాలని బ్యాంకర్లను ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్టాండ్ అప్ ఇండియా, స్మార్ట్ అప్ ఇండియా, ముద్ర పథకాలను ప్రజలకు అందించేలా బ్యాంకర్లు చొరవ చూపాలన్నారు. స్వయం సహాయక బృందాల విషయమై మాట్లాడుతూ రుణాలు చెల్లించే విషయంలో ఏదైనా సమస్యలుంటే బ్యాంకర్లు తమ దృష్టికి తీసుకువస్తే, సకాలంలో చెల్లించేలా చర్యలు తీసుకుంటామన్నారు. స్వయం సహాయక సంఘాలకు ఇస్తున్న రుణాల రికవరీ 97శాతం ఉందని, స్ర్తి నిధి ద్వారా ఎక్కువ రుణాలు అందజేయాలన్నారు. సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ మాట్లాడుతూ జిల్లా అభివృద్ధిలో బ్యాంకర్లు బాగస్వాములై నిర్ధేశిత లక్ష్యాలను పూర్తి చేయాలన్నారు. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఆర్థిక మద్దత్తు పథకాలు అర్హులైన వారికి చేరేలా ఎంపీడీఓలు, బ్యాంకర్లు సమన్వయంతో పని చేసిన లబ్ధిదారులకు ఇబ్బంది లేకుండా చూడాలన్నారు. ఆర్థిక మద్దత్తు పథకాల కింద యూనిట్ మంజూరు చేసి గ్రౌండింగ్ అయ్యేలా చూడటంలో బ్యాంకర్ల పాత్ర క్రీయశీలకమైందన్నారు. బీసి,ఎస్సీ,ఎస్టీ,మైనార్టీ శాఖలకు సంబంధించి గ్రౌండింగ్ కానివన్నీ ఈ నెల 25లోపు పూర్తి చేయాలన్నారు. ఎస్‌హెచ్‌జి గ్రూప్‌లు తీసుకుంటున్న రుణాలు సద్వినియోగం అయ్యేలా వారికి అవగాహాన కల్పించడంలో ప్రత్యేక దృష్టి సారించాలని డీఆర్‌డిఓకు సూచించారు. స్ర్తి నిధి, ఇతరాత్ర రుణాల లక్ష్యాలను పెంచేందుకు తగు చర్యలు తీసుకోవాలన్నారు. నాబార్డ్ ఏజీఎం రమేష్ మాట్లాడుతూ నాబార్డు ద్వారా సంగారెడ్డి జిల్లాలో పాడిగేదెలు, సమీకృత వ్యవసాయానికి రూ.170కోట్ల వ్యయంతో ప్రత్యేక పథకం ప్రారంభించినట్లు తెలిపారు. 2022నాటికి రైతుల ఆదాయం రెట్టింపు చేసే కార్యక్రమాన్ని నాబార్డు మొదలుపెట్టిందన్నారు. ఏరియా ఆధారంగా పథకాలను రూపొందించడం జరిగిందని, ఈ పథకాలు జెఎల్‌జి రూపంలో విడుదల చేసేందుకు రుణ ప్రణాళిక రూపొందించినట్లు తెలిపారు. అనంతరం ( నాబార్డ్‌ప్రొటెన్షియల్ లింక్‌డ్ క్రెడిట్ ప్లాన్ ) పాడి పరిశ్రమ అభివృద్ధి, సమీకృత వ్యవసాయ పథకాలను ఏరియా ఆధారంగా రూపొందించిన బుక్‌లెట్‌ను కలెక్టర్, ఎమ్మెల్యే విడుదల చేశారు. సమావేశంలో జాయింట్ కలెక్టక్ నిఖిలారెడ్డి, లీడ్ బ్యాంక్ మేనేజర్ లక్ష్మికాంత్‌రావు, ఆర్‌బిఐ ఎజిఎం వెంకటేశ్వర్లు, రీజినల్ మేనేజర్ షేక్ నజీర్ అహ్మద్, డీఆర్‌డీఓ వెంకటేశ్వర్లు, బ్యాంకర్లు, వివిధ సంక్షేమ శాఖల అధికారులు పాల్గొన్నారు.