మెదక్

ఎన్నాళ్ల కెన్నాళ్లకూ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంగారెడ్డి, మార్చి 21: తెలుగు పత్రికల్లో ప్రచురితమవుతున్న ప్రభుత్వం, అధికార యంత్రాంగానికి అనుకూల, ప్రతికూల వార్తలకు మంచి రోజులు వచ్చాయని చెప్పవచ్చు. ఇటీవల సంగారెడ్డి జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన వాసం వెంకటేశ్వర్లు రెండు నెలలుగా ఆయా దిన పత్రికల్లో వచ్చిన వార్తా కథనాలపై ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలిసింది. ఈ మేరకు రెండు నె లల కాలంగా పత్రికల్లో ప్రచురితమైన ప్రత్యేక కథనాల కు సంబంధించిన వివరాలను అందించాలని సమాచా ర పౌర సంబంధాల శాఖ అధికారులను ఆదేశించిన ట్లు సమాచారం. దీంతో కార్యాలయ సిబ్బంది అన్ని ది న పత్రికల్లో ప్రచురితమైన ప్రతికూల, అనుకూల వార్త ల క్లిప్పింగులను సేకరించే కార్యక్రమంలో నిమగ్నమయ్యారు. 2013 ఎన్నికలకు ముందు ఉమ్మడి మెదక్ జి ల్లా కలెక్టర్‌గా దినకర్‌బాబు పని చేసిన విషయం తెలిసిందే. దినకర్ బాబు తరువాత స్మితా సబర్వాల్, రా హుల్ బొజ్జా, రొనాల్డ్ రోస్, మానిక్కరాజ్ కణ్ణన్‌లు కలెక్టర్లుగా పని చేశారు. వీరంతా కూడా తెలుగేతరులు కావడంతో తెలుగు దిన పత్రికల్లో వచ్చిన ఏ వార్తలపై కూడా అంతగా స్పందించిన దాఖలాలు లేవు. సమాచార శాఖ అధికారులతో వార్తా కథనాలు ప్రచురితమైన శాఖ అధికారుల ద్వారానో కలెక్టర్లకు పూర్తి సమాచారం లభించేది. స్వయంగా వారే తెలుగు పత్రికలను చదివారా లేదా సందేహమే. ఇటీవల కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన వాసం వెంకటేశ్వర్లు అచ్చ తెలుగు భాషా పరిపూర్ణుడు కావడంతో తెలుగు పత్రికల్లో ప్రచురితమవుతున్న వార్తలపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది. గతంలో జర్నలిస్టుగా చేసిన అనుభవం కూడా ఉండటంతో ఆయా పత్రికల్లో వచ్చే వార్తల విషయాలపై అవగాహన ఉన్న మేరకే ప్రజాసమస్యలను పత్రికల ద్వారా తెలుసుకుని వాటిని పరిష్కరించే దిశగా అడుగులు వేస్తున్నారు. పత్రికల్లో ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు తీరు, ప్రభుత్వ కార్యాలయాల్లో పని చేసే ఉద్యోగుల సమయ పాలన, అభివృద్ధి పనుల నాణ్యత లోపాలు, ఇతరత్రా ప్రజలు ఎదుర్కొనే సమస్యలపై ప్రధానంగా పత్రికల్లో ప్రచురితం కావడం పరిపాటి. కాగా చాలా కాలం తరువాత తెలుగు దిన పత్రికల కథనాలపై కలెక్టర్ స్వయంగా దృష్టి సారించారంటే ప్రభుత్వానికి, ఇటు ప్రజలకు కలిసివచ్చే అంశం అని చెప్పవచ్చు. సదాశివపేటలో నిర్మాణంలో ఉన్న ఆర్టీసి బస్టాండ్ పనులను బిల్లు రాలేదనే సాకుతో కాంట్రాక్టర్ పనులను అర్ధాంతరంగా నిలిపివేసాడు. ఈ విషయం తెలిసిన కలెక్టర్ మంగళవారం సదాశివపేట బస్టాండ్‌కు చేరుకుని పనులను పరిశీలించి అక్కడి నుండే కాంట్రాక్టర్‌తో ఫోన్ ద్వారా మాట్లాడి పనులు చేపట్టాలని ఆదేశించడంపై పేట ప్రజలు సంతృప్తిని వ్యక్తం చేసారు. ఓ కలెక్టర్‌గా తన కార్యాలయంలోనే కూర్చుండి కాంట్రాక్టర్‌తో ఫోన్‌లో మాట్లాడే అవకాశం ఉన్నప్పటికీ క్షేత్ర స్థాయికి వెళ్లి పనులను పర్యవేక్షించిన కలెక్టర్ చొరవపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. రాష్ట్రంలో ఇప్పుడిప్పుడే ఎన్నికల వాతావరణం అలుముకుంటున్న వేళ ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల దరికి చేర్చే విధంగా కలెక్టర్ తీసుకుంటున్న నిర్ణయాలు ప్రభుత్వానికి కలిసివస్తుందన్న అభిప్రాయం అధికార టీఆర్‌ఎస్ పార్టీ శ్రేణులు సంతృప్తిని వ్యక్తం చేస్తున్నాయి. కొత్త పంథాను ఎంపిక చేసుకున్న కలెక్టర్ రెండు నెలల కాలంగా ఆయా దిన పత్రికల్లో వచ్చిన వివిధ వార్తా కథనాలపై ఏ మేరకు స్పందిస్తారో వేచి చూడాల్సిందే. మొత్తంమీద చాలా కాలం తరువాత వార్తా పత్రికల్లో వచ్చే ప్రత్యేక వ్యాసాలు, ప్రజల సమస్యలపై దృష్టి సారించిన కలెక్టర్‌గా వాసం వెంకటేశ్వర్లు వినుతికెక్కారని చెప్పవచ్చు.