మెదక్

వారం రోజుల్లో ఇంటింటికీ నీటి సరఫరా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెదక్, మార్చి 22: మిషన్ భగీరథ పథకం ద్వారా సింగూరు ప్రాజెక్టు నుంచి పరిశుద్ధమైన నీటిని వారం రోజుల్లో పట్టణ ప్రజలకు అందిస్తామని మెదక్ మున్సిపల్ ఇంజనీర్ చిరంజీవి తెలిపారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించారు. మెదక్ ఖిల్లా మీద 4,700 కె ఎల్ ఎస్. కెపాసిటీ గల ట్యాంకు పనులు మొదలైనట్లు ఆయన తెలిపారు. బాటమ్ ఫ్లోరింగ్ నడుస్తుందని చెప్పారు. పంప్‌హౌస్ రోడ్డుపై సిమెంట్ రోడ్డు పనులు సాగుతున్నట్లు చెప్పారు. పంప్‌హౌస్ ప్రాంగణంలో ప్రహరీగోడ నిర్మాణం పూర్తయిందని, ఇంటెక్ వెల్ పనులు అభివృద్ధి దశలో నడుస్తున్నట్లు చెప్పారు. 1,600 కె ఎల్ ఎస్. ట్యాంకు పూర్తయిందని చెప్పారు. అక్కడే 8 స్ట్ఫా క్వార్టర్లు, జనరేటర్ గది, పంపు రూమ్ ఇవన్నీ కూడా 30 రోజుల్లో పూర్తవుతాయని చెప్పారు. మెదక్ పట్టణంలో 94 కిలోమీటర్ల పైప్‌లైన్లలో 50 కిలోమీటర్ల పైప్‌లైన్ పూర్తయినట్లు ఆయన చెప్పారు. ఈ పైపులు క్వాలిటీ డీ ఈ పైపు అని అన్నారు. హౌస్ కనెక్షన్ల మెటీరియల్ వచ్చాయని తెలిపారు. ఇంటింటి కనెక్షన్లు ఏప్రిల్ మొదటి వారం ప్రారంభిస్తామన్నారు. మెదక్ పట్టణంలో 11, 000 హౌస్ కనెక్షన్లు ఉన్నట్లు ఆయన చెప్పారు. ఖిల్లా మీద ట్యాంపింగ్ కనెక్షన్ ఆర్ డబ్ల్యు. ఎస్. అధికారులు వచ్చారని తెలిపారు. కాగా ఇప్పటి వరకు పూర్తయిన 50 కిలోమీటర్ల పైప్‌లైన్‌కు సంబంధించి సింగూరు ప్రాజెక్టు నుంచి పరిశుద్ధమైన నీటిని సరఫరా చేస్తామని ఆయన వెల్లడించారు. కాగా మిషన్ భగీరథ పనులు చాలావేగంగా నడస్తున్నాయని, ఈ విషయంలో ఛైర్మన్ మల్లికార్జున్‌గౌడ్ ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నట్లు చిరంజీవి తెలిపారు.