మెదక్

క్షయవ్యాధి రహిత తెలంగాణకు కృషి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెదక్ టౌన్, మార్చి 24: జర్మనీ టెక్నాలజీతో వైద్య పరీక్షలు జరిపి టిబిని పూర్తిగా నిర్మూలిస్తూ టీబీరహిత తెలంగాణగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి అన్నారు. అర్బన్ హెల్త్ సెంటర్‌లతో పట్టణ పేదలకు కార్పోరేట్ వైద్యం అందుబాటులోకి వస్తుందన్నారు. శనివారం మెదక్ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన టిబి పరీక్షల విభాగం, యంత్రాన్ని ఆమె ప్రారంభించారు. అనంతరం స్థానిక మిలటరీ కాలనీలో ఏర్పాటు చేసిన అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్‌ను కలెక్టర్ ధర్మారెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా పద్మాదేవేందర్‌రెడ్డి మాట్లాడుతూ అత్యాధునిక పరికరాలతో రోగులను పరిశీలించి అన్ని రకాల వ్యాధుల నివారణ కోసం కార్పోరేట్ వైద్యం ప్రభుత్వాసుపత్రుల్లో అందించేందుకు సిఎం కెసిఆర్ కృషి చేస్తున్నారన్నారు. జిల్లా కేంద్రాల్లో అర్బన్ హెల్త్ సెంటర్ ఏర్పాటుచేసి సామాన్యులకు మంచి వైద్యం అందించడం జరుగుతుందన్నారు. కెసిఆర్ కిట్‌లు, అమ్మఒడి, ఆరోగ్యశ్రీ వంటి పథకాలు దీర్ఘకాలిక వ్యాధులు సైతం సత్వరమే తగ్గించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతుందన్నారు. అమ్మఒడి పథకంలో గర్బిణీలను ఇంటి నుండి ఆసుపత్రికి, కాన్పు అయ్యాక ఆసుపత్రి నుండి ఇంటికి తీసుకెళ్లడం జరుగుతుందన్నారు. దీంతో ప్రయాణభారం లేకుండాపోయిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి వెంకటేశ్వర్‌రావు, డిసిహెచ్ డాక్టర్ పి.చంద్రశేఖర్, మున్సిపల్ చైర్మన్ ఆరేళ్ల మల్లిఖార్జున్‌గౌడ్, వైస్ చైర్మన్ అశోక్, వైద్యులు డాక్టర్ నవీన్, డాక్టర్ శివదయాళ్, డాక్టర్ చంద్రశేఖర్, జడ్‌పిటిసి లావణ్యారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆశ వర్కర్లు తమకు ప్రభుత్వం వేతనాలు పెంచడంపట్ల డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డికి పుష్పగుచ్చం అందజేసి కృతజ్ఞతలు తెలిపారు. అంతకుముందు పట్టణంలోని పెద్దబజార్ వీధిలో 14వ ఆర్థిక సంఘం ద్వారా 50 లక్షలతో నిర్మించే సిసి రోడ్డు, మురికి కాలువలకు పద్మాదేవేందర్‌రెడ్డి శంఖుస్థాపన చేశారు. రోడ్డు విస్తరణకు సహకరించిన వ్యాపారులకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రజల సహకారంతో మరింత అభివృద్దికి కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో కమీషనర్ సమ్మయ్య, కౌన్సిలర్లు ఆర్‌కె శ్రీనివాస్, చంద్రకళ, అరునార్తి వెంకటరమణ పాల్గొన్నారు.

కలెక్టరేట్ గార్డెన్ ఆహ్లాదకరంగా ఉండాలి
సంగారెడ్డి టౌన్, మార్చి 24: సమీకృత కలెక్టరేట సముదాయంలోని గార్డెనింగ్‌ను జిల్లా కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు శనివారం సాయంత్రం తనిఖీ చేశారు. కలెక్టరేట్ చుట్టు ఉన్న గార్డెనింగ్‌లోని పచ్చికబయలు, పూల మొక్కలు, చెట్లను నిశితంగా పరిశీలించారు. మొక్కలకు ప్రతి రోజు నీటిని పట్టాలని, చెట్ల మధ్యలో ఉన్న గడ్డిని తొలగించాలని తోటమాలిని కలెక్టర్ ఆదేశించారు. పాడైన మొక్కల స్థానంలో కొత్త మొక్కలు నాటాలని, కలెక్టరేట్‌కు వచ్చే వారికి పచ్చికబయళ్లు ఆహ్లాదకరంగా కనిపించాలని సూచించారు. చెట్ల మధ్య ఉన్న చెత్త, ఆకులను తొలగించి శుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని ఉద్యాన శాఖ అధికారి సోమేశ్వర్‌రావును ఆదేశించారు. వేసవి కాలం ప్రారంభమైనందున కలెక్టరేట్‌కు వచ్చే ప్రజల దాహార్తి తీర్చేందుకు కలెక్టరేట్ సముదాయంలో ఉన్న ఆక్వా నీటి ఫిల్టర్‌ను వాడుకలోకి తీసుకురావాలని సంబంధిత అధికారులకు సూచించారు. కలెక్టరేట్‌లోని కార్యాలయాల ముందు వాహనాలు నిలుపరాదని, వాహనాలను పార్కింగ్ స్థలంలోనే నిలుపాలన్నారు. వివిధ శాఖల కార్యాలయాలు, పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా చూడాలన్నారు. కలెక్టర్ వెంట తహసీల్ధార్ విజయ్‌కుమార్, ఉద్యాన శాఖ అధికారులు తదితయి ఉన్నారు.