మెదక్

సిద్దిపేటలో ఎమ్మెల్సీ ఫారూఖ్ ఫ్లెక్సీ దగ్ధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిద్దిపేట, ఏప్రిల్ 25 : సీనియర్ కాంగ్రెస్ నేత, ఎమ్మెల్సీ ఫారూఖ్‌హుస్సేన్ టిఆర్‌ఎస్ పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించటంతో సిద్దిపేట కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ ఫారూఖ్‌హుస్సేన్ ప్లక్సితో ర్యాలీ నిర్వహించి గాంధీ చౌక్ వద్ద దగ్ధం చేశారు. ఫారూఖ్‌హుస్సేన్ టిఆర్‌ఎస్ చేరుతున్నట్లు ప్రకటించటంపై మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ గూడూరి శ్రీనివాస్, జిల్లా కాంగ్రెస్ నేత మార్క సతీష్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ శ్రేణులు టపాసులు పేల్చి సంబురాలు జరుపుకున్నారు. ఈసందర్భంగా మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ గూడూరి శ్రీనివాస్, జిల్లా కాంగ్రెస్ కార్యదర్శి మార్క సతీష్‌లు మాట్లాడుతూ కన్నతల్లి లాంటి కాంగ్రెస్ పార్టీలో అన్ని పదవులు అనుభవించిన ఫారూఖ్‌హుస్సేన్ ఎమ్మెల్సీ పదవి గడువు సమీపిస్తున్న క్రమంలో తన స్వార్ధంతో టిఆర్‌ఎస్ పార్టీలో చేరుతున్నట్లు తెలిపారు. కాంగ్రెస్ పార్టీలో సామాన్య కార్యకర్తగా ఉన్న ఫారూఖ్‌హుస్సేన్ కౌన్సిలర్‌గా, కార్పోరేషన్ చైర్మన్, ఎమ్మెల్సీగా అవకాశం కల్పించిందన్నారు. ఎమ్మెల్సీగా ఉన్న ఫారూఖ్‌హుస్సేన్ ఏనాడు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను పట్టించుకోలేదన్నారు. తన కోటా నిధులను సైతం కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులకు కేటాయించకుండ ఇతర పార్టీల నాయకులకు కమీషన్‌పై అమ్ముకున్నట్లు తెలిపారు. పైరవిలు చేస్తు జెబులు నింపుకోవటమే దిన చర్య అన్నారు. అయిన్పటికి కాంగ్రెస్ అధిష్టానం ఫారూఖ్‌హుస్సేన్‌ను కేటాయించినట్లు తెలిపారు. కాంగ్రెస్ పార్టీలో కీలక పదవిలో కొనసాగుతునే టిఆర్‌ఎస్ పార్టీ నేతలకు కోవర్టుగా పనిచేశారని ఆరోపించారు. ఎమ్మెల్సీ ఫారూఖ్ హుస్సేన్ టిఆర్‌ఎస్‌లో చేరుతున్న ప్రకటనపై కాంగ్రెస్ శ్రేణులు సంబురాలు చేసుకుంటున్నారన్నారు. సిద్దిపేట కాంగ్రెస్ పార్టీకి పట్టిన గ్రహణం వీడిందన్నారు. ఎమ్మెల్సీ టిఆర్‌ఎస్ పార్టీలో చేరటంపై తమకు ఏలాంటి అభ్యంతరం లేదన్నారు. కాంగ్రెస్ పార్టీ నమ్మకంతో కట్టబెట్టిన ఎమ్మెల్సీ పదవికి ఫారూఖ్‌హుస్సేన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తేనే ప్రజలు ఫారూఖ్‌హుస్సేన్‌ను విశ్వసిస్తారన్నారు. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయకుండ సిద్దిపేట నియోజక వర్గంలో పర్యటిస్తే కాంగ్రెస్ శ్రేణులు అడ్డుకొని తరమి కోడుతారని హెచ్చరించారు. ఎమ్మెల్సీ ఫారూఖ్‌హుస్సేన్ టిఆర్‌ఎస్ పార్టీలో చేర్చుకుంటే టిఆర్‌ఎస్ పార్టీ పతనం ప్రారంభమైందన్నారు. 2019లో సిద్దిపేటలో టిఆర్‌ఎస్ పార్టీ ఓడిపోవటం ఖాయమన్నారు. మాజీ మంత్రి మదన్‌మోహన్ శిష్యున్ని.. నేను మృతిచెందిన నాపై కాంగ్రెస్ జెండా కప్పాలని పలుమార్లు వేదికలపై చెప్పిన ఫారూఖ్‌హుస్సేన్ ఇప్పుడు ఏం సమాధానం చెపుతారని ప్రశ్నించారు. కన్నతల్లి లాంటి కాంగ్రెస్ పార్టీని వీడటం ఫారూక్‌హుస్సేన్ నమ్మక ద్రోహం చేయటమేనన్నారు. సమావేశంలో నేతలు నాయిని నర్సింహారెడ్డి, అత్తు ఇమామ్, వంగరి నాగరాజు, పూజల గోపీకృష్ణ, తాడూరి సాయి ఈశ్వర్‌గౌడ్, నర్సింలు, గూడూరి నాగరాజు, వాహేబ్, కమలహాసన్, రమేశ్ పాల్గొన్నారు