మెదక్

కాంగ్రెస్ కంచుకోటపై టీఆర్‌ఎస్ కన్ను!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంగారెడ్డి, మే 21: జహీరాబాద్ అంటే కాంగ్రెస్, కాంగ్రెస్ అంటే జహీరాబాద్ కేరాఫ్‌గా గడచిన ఏడు దశాబ్దాల కాలంగా కాంగ్రెస్ పార్టీ తిరుగులేని సత్తాను చాటుకుంటుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తొలి నాళ్లలోనే అనివార్యమైన సార్వత్రిక ఎన్నికల్లో ఉద్యమ సునామి సైతం జహీరాబాద్ నియోజకవర్గంలో ప్రభావం చూపించలేకపోయింది. స్థానికత నినాదం, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిందన్న టీఆర్‌ఎస్ పార్టీపై పెద్దగా సానుభూతిని చూపించలేకపోయింది. సిట్టింగ్ ఎమ్మెల్యేగా, మంత్రి హోదాలో బరిలోకి దిగిన ప్రస్తుతం ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వహిస్తున్న గీతారెడ్డికి పార్టీలో అంతర్గత పోరు ఉన్నా నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి ఉన్న ఓటు బ్యాంకు ద్వారా చావుతప్పి కన్ను లొట్టబోయిన చందంగా గీతారెడ్డి గెలిచి గట్టెక్కారు. టీఆర్‌ఎస్ పార్టీ నుండి బరిలోకి దిగిన మానిక్‌రావు రాజకీయాలకు కొత్త కావడం, నియోజకవర్గంలో అంతగా గుర్తింపు లేకపోయినా ఉద్యమ ప్రభావంతో గీతారెడ్డికి గట్టిపోటీని ఇచ్చారు. ప్రస్తుతం నియోజకవర్గ ఇన్‌చార్జిగా మానిక్‌రావు కొనసాగుతున్న రాబోయే 2019 సార్వత్రిక ఎన్నికల్లో మానిక్‌రావును బరిలోకి దింపుతారా లేదా అన్నది సందేహాలకు తావిస్తోంది. నియోజకవర్గానికి చెందిన ఓ యువకుడిని రంగంలోకి దింపి కాంగ్రెస్ పార్టీ కంచుకోటకు కన్నం వేయాలన్న పట్టుదలతో స్థానిక శ్రేణులు ఉన్నట్లు తెలిసింది. ఈ మేరకు ఒక యువ నాయకుడి పేరును రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరీష్‌రావు ముందు ప్రస్తావనకు తీసుకువచ్చినట్లు సమాచారం. స్థానికుడు కావడమే కాకుండా ఎస్సీ వర్గంలో బలమైన ఓటు బ్యాంకు ఉన్న వర్గానికి చెందిన వ్యక్తికావడం వల్ల సదరు యువకుడిని గెలిపించుకుని తీరుతామన్న నమ్మకాన్ని మంత్రి హరీష్‌రావు ముందు వ్యక్తం చేసినట్లు తెలిసింది. స్థానికుడైన మాజీ మంత్రి ఫరీదోద్దీన్ టీఆర్‌ఎస్‌ఎమ్మెల్సీగా కొనసాగుతుండటంతో ఆయన సూచనలను అధిష్టానం పరిగణలోకి తీసుకునే అవకాశం లేకపోలేదు. ఇప్పటి వరకు జహీరాబాద్ నియోజకవర్గానికి జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 1994 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన చెంగల్ బాగన్న మినహా ఇతర నాయకులు ఎవరు కూడా కాంగ్రెస్ పార్టీని ఓడించలేకపోయారు. మాజీ మంత్రి, ఏడు పర్యాయాలు ఓటమి లేకుండా పార్లమెంటుకు ఎన్నికైన బాగారెడ్డి కాంగ్రెస్ పార్టీని గ్రామ గ్రామాన ఇనుమడింపజేసి తిరుగులేని ఓటు బ్యాంకును సాధించి పెట్టారు. 2009 సార్వత్రిక ఎన్నికల్లో జహీరాబాద్ నియోజకవర్గం ఎస్సీ రిజర్వ్ కావడంతో గజ్వేల్ ఎస్సీ రిజర్వ్ నుండి ప్రాతినిథ్యం వహించిన గీతారెడ్డిని అప్పటి ముఖ్యమంత్రి రాజశేఖర్‌రెడ్డి ఇక్కడి నుండి రంగంలోకి దింపారు. అప్పటి వరకు ఈ నియోజకవర్గానికి ప్రాతినిథ్యం వహించిన ఫరీదోద్దీన్ రాజకీయ ఉనికి కోల్పోవాల్సి వచ్చింది. ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఎంపికై నియోజకవర్గంలోని టీఆర్‌ఎస్ శ్రేణులకు అండగా నిలుస్తూ వచ్చారు. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో జహీరాబాద్ నియోజకవర్గంలో గులాబి జెండాను ఎగురవేయాలన్న దృక్పతంతో అధిష్టానం ఉండగా, పార్టీ శ్రేణులు కూడా స్థానిక నాయకత్వాన్ని బలపరుస్తూ స్థానిక నినాదంతో గెలిపించుకోవాలని తహతహలాడుతున్నారు. ఈ మేరకు ఝరాసంగం మండలానికి చెందిన ఓ యువ నాయకుడి పేరును మంత్రి హరీష్‌రావు ముందు ప్రస్తావనకు తీసుకువచ్చి ఆ దిశగా పావులు కదుపుతున్నట్లు తెలిసింది. ఉమ్మడి మెదక్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి జహీరాబాద్, నారాయణఖేడ్ నియోజకవర్గాలు కంచుకోటగా నిలుస్తూ వచ్చాయి. గడచిన ఎన్నికల్లో జహీరాబాద్, నారాయణఖేడ్ నియోజకవర్గాలతో కాంగ్రెస్ పార్టీ సరిపెట్టుకోగా, అనివార్య కారణాలతో నారాయణఖేడ్ నియోజకవర్గానికి ఉప ఎన్నిక ఏర్పడటంతో అక్కడ కూడా టీఆర్‌ఎస్ పాగా వేసింది. రాబోయే ఎన్నికలను టీఆర్‌ఎస్ ప్రతిష్టగా తీసుకుంటుండగా వరుసగా రెండు పర్యాయాలు జహీరాబాద్ నియోజకవర్గం నుండి గెలుపొందిన గీతారెడ్డి రాజకీయ ప్రతిష్టకు బలమైన పరీక్షగా మారడం ఖాయమని చెప్పవచ్చు.