మెదక్

పశువులకు మేత..నీరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెదక్, ఏప్రిల్ 28: మెదక్ డివిజన్ నల్లవాగు ప్రాంగణంలో శుక్రవారం నాడు పశు సంరక్షణ కేంద్రంను ఆ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ ప్రారంభిస్తున్నట్లు మెదక్ జిల్లా పశు సంరక్షణ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ లక్ష్మారెడ్డి తెలిపారు. గురువారం నాడు ఆయన మెదక్ వెటర్నరీ ఆస్పత్రిలో విలేఖరులతో మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించారు. పశు సంరక్షణ కేంద్రం జూన్ మాసం వరకు కొనసాగుతుందన్నారు. ఈ కేంద్రంలో రెండు వేలపైన పశువులకు మేత, నీళ్లు, నీడ ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌తో పాటు జిల్లా మంత్రి హరీష్‌రావును కూడా ఆహ్వానించినట్లు ఆయన తెలిపారు. అయితే హరీష్‌రావు కర్ణాటక రాష్ట్ర పర్యటనకు వెళ్లారని లక్ష్మారెడ్డి తెలిపారు. స్థానిక ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి కూడా హాజరవుతున్నారని తెలిపారు. రాష్ట్ర పశు సంవర్దక సంచాలకులు డాక్టర్ తిరుపతయ్య కూడా హాజరవుతున్నారని తెలిపారు. నారాయణఖేడ్ నియోజకవర్గంలో పశువులు అధికంగా ఉండటం, అక్కడ పశుగ్రాసం, నీటి ఎద్దడి ఎక్కువగా ఉన్నందున ఈ ప్రాంతంలో పశు సంరక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ప్రతి గ్రామంలో రెండు నీటి తొట్లను ఏర్పాటు చేసి ఆ నీటి తొట్లను ట్యాంకర్ల ద్వారా నింపబోతున్నట్లు లక్ష్మారెడ్డి తెలిపారు. 50 శాతం సబ్సిడితో దానా రైతులకు ఇస్తున్నట్లు కూడా తెలిపారు. ఒక్కొక్క పశువుకు రెండు కిలోల దానా వంతున సబ్సిడిపై ఇస్తున్నట్లు తెలిపారు. మెదక్ జిల్లాలో ఉన్న 46 మండలాల్లో పాల ఉత్పత్తి పడిపోకుండా రైతులు ఇబ్బందులు పడకుండా 75 శాతం సబ్సిడిపైన గడ్డి విత్తనాలు ఇవ్వనున్నట్లు తెలిపారు. ఎక్కడైతే బోర్లు ఉంటాయో, ఏ ప్రాంతంలో కరెంట్ మోటర్లు నడుస్తాయో అక్కడ గడ్డి విత్తనాలు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. ప్రతి మండలంలో 500 పశువులకు 50 శాతం సబ్సిడిపై దానా సరఫరా చేయనున్నట్లు తెలిపారు. రైతులు అధైర్యపడవద్దు, నీటి తొట్లు ప్రతి గ్రామంలో నిర్మిస్తామని తెలిపారు. రానున్న కాలంలో మంచి రోజులు రాబోతున్నాయన్నారు. జిల్లా కలెక్టర్ రోనాల్డ్ రాస్ పశుసంపదకు ఎక్కడ కూడా నష్టం జరగకూడదని ఆదేశాలు జారీ చేశారని డాక్టర్ లక్ష్మారెడ్డి తెలిపారు. మెదక్ జిల్లాలో ఎనిమిది లక్షల 20 వేల గేదెలు, ఆవుల సంపద ఉన్నట్లు ఆయన తెలిపారు. మేకలు, గొర్రెలు 17 లక్షలు ఉన్నట్లు తెలిపారు. పశువుల సంతలలో మధ్య దళారుల నివారణ కోసం ప్రత్యేక చర్యలు తీసుకోబోతున్నట్లు ఆయన తెలిపారు. పశువులు డయోరియా, ఎండదెబ్బకు గురవుతున్నాయన్నారు. మెదక్ వెటర్నిటి ఆస్పత్రిలో రెగ్యులర్ డాక్టర్ విషయాన్ని మంత్రి దృష్టికి తెస్తానని ఆయన తెలిపారు. మెదక్ వెటర్నిటి ఆస్పత్రి క్రింద మాచవరం, కూచనపల్లి, సర్దన, బూర్గుపల్లి హావేళి ఘణాపూర్, మెదక్ మండలం, మెదక్ టౌన్ విస్తరించి ఉన్నాయని తెలిపారు. ఆరు నెలలుగా రెగ్యులర్ డాక్టర్, కాంపౌండర్ లేని విషయాన్ని డాక్టర్ లక్ష్మారెడ్డి దృష్టికి తేగా మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ దృష్టికి తెస్తానని వెల్లడించారు.

అంత్యోదయ కార్డులివ్వాలి
సంగారెడ్డి టౌన్, ఏప్రిల్ 28: వికలాంగులందరికి అంత్యోదయ రేషన్ కార్డులు ఇవ్వాలని ఎన్‌పిఆర్‌డి జిల్లా సహాయ కార్యదర్శి బి.బస్వరాజ్ డిమాండ్ చేశారు. జివో నంబర్ 1 ప్రకారం సంక్షేమ పథకాల్లో వికలాంగులకు 3శాతం కోటాను అమలు చేయాల్సి ఉన్నపట్టికి అధికారుల నిర్లక్ష్యంతో అమలు కావడం లేదన్నారు. సదరన్ సర్ట్ఫికేట్లు ఉన్న ప్రతి వికలాంగుడికి ఫించన్ మంజూరు చేయాలని, బస్ పాస్‌లను జిల్లాకే పరిమితం చేయాలన్న ఆలోచనను విరమించుకోవాలని డిమాండ్ చేశారు. వికలాంగులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఈ నెల 30న సంగారెడ్డిలో నిర్వహించే జిల్లాకమిటి సమావేశానికి వికలాంగులు పెద్ద సంఖ్యలో హాజరు కావాలని కోరారు.