మెదక్

నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేస్తే సహించం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంగారెడ్డి టౌన్, జూన్ 21: పాఠశాల,కళాశాలల బస్సు డ్రైవర్లు రోడ్డు భద్రతా నియమాలను తప్పనిసరిగా పాటించాలని, నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి హెచ్చరించారు. గురువారం సంగారెడ్డి పోలీస్ కల్యాణ మండపంలో బస్సు డ్రైవర్లకు అవగాహాన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన ఎస్పీ మాట్లాడుతూ తమ పిల్లలను మంచి పాఠశాలల్లో చదివించి ఉన్నత స్థాయికి చేర్చాలన్న ఉద్దేశంతో తల్లిదండ్రులు గ్రామాల నుండి పట్టణాలకు బస్సుల్లో పంపుతున్నారని, కొన్ని సందర్భాల్లో డ్రైవర్ల తప్పిదాలతో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయన్నారు. కొన్ని సంఘటనల్లో విద్యార్థులు ప్రాణాలు సైతం కోల్పాయారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి పరిస్థితులను నివారించాలంటే రోడ్డు భద్రతా నియమాలు పాటించడమే మార్గమన్నారు. సెల్‌పోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేస్తే లైసన్స్‌లు రద్దు చేస్తామని, మద్యం సేవించడం, నిర్లక్ష్యంగా వాహనాన్ని నడపడంలాంటివి చేస్తే కఠినంగా వ్యవహరించాల్సి ఉంటుందన్నారు. ట్రాఫిక్ సీఐ సంజయ్‌కుమార్ మాట్లాడుతూ బస్సు డ్రైవర్ చేతిలో తోటి ప్రయాణికుల ప్రాణాలు ఉన్నాయన్న విషయాన్ని గమనించి జాగ్రత్తగా డ్రైవింగ్ చేయాలని సూచించారు. కార్యక్రమంలో ఎస్‌ఐలు వెంకట్‌రాజు, సుభాష్‌రెడ్డి, డ్రైవర్లు పాల్గొన్నారు.