మెదక్

విభజన హామీల అమలు ఏదీ?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంగారెడ్డి టౌన్, జూలై 20: విభజన చట్టంలోని అంశాలను అమలు చేయించే బాధ్యత సీఎం కేసీఆర్‌పై ఉందని, స్పందించకపోతే విభజన అంశాలపై తెలుగుదేశం పార్టీ కార్యచరణ రూపొందించి ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతుందని టీడీపీ జిల్లా అధ్యక్షులు నరోత్తం అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విభజన చట్టంలోని అంశాల విషయంలో దోబూచులాడుతున్నాయని విమర్శించారు. శుక్రవారం పార్టీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో నరోత్తం మాట్లాడుతూ విభజన చట్టంలో పేర్కొన్న విధంగా తెలంగాణ రాష్ట్రంలో బయ్యారం స్టీల్ ప్లాంట్ ఏర్పాటు, ఖాజీపేటలో రైల్వేకోచ్ ఫ్యాక్టరీ, యూనివర్సిటీలు తదితర హామిలను విస్మరించారన్నారు. ఐటీఐఆర్ ద్వారా లక్షల ఉద్యోగాలు వస్తాయని గతంలో మంత్రి కేటీఆర్ గొప్పగా చెప్పిన మాటలు ఎమాయ్యాయని? ఈ విషయాన్ని ప్రధాని దృష్టికి తీసుకేళ్లారా అని ప్రశ్నించారు. ప్రాణిహిత-చేవెళ్ల ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించుకుని ఐదేళ్లలో పూర్తి చేసుకుంటామని ఎన్నికల సమయంలో కేసీఆర్ చెప్పారు కానీ అధికారంలోకి వచ్చాక ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టుకు ప్రాణం పోయిందన్నారు.కొత్తగా తెరపైకి తెచ్చిన కాళేశ్వరం ప్రాజెక్టుకు రూ.20వేల కోట్లు ఇవ్వాలని సీఎం కేసీఆర్ ప్రధాని మోడీని అడిగారని, ఈ 20వేల కోట్లను కేసీఆర్ ఎందుకు అడుగుతున్నారో ప్రజలు అర్థం చేసుకుంటున్నారన్నారు. నీతి అయోగ్ సమావేశంలో కేసీఆర్ ప్రధానికి సలహాలు ఇచ్చేందుకు కాకుండా రాష్ట్రానికి రావాల్సిన హక్కులను సాధించుకోవడం కోసం ఉపయోగించుకుంటే బాగుండేదన్నారు. బయ్యారం ఉక్కు ప్రాజెక్టుపై పరీక్ష చేస్తూనే ఉన్నామని చెబుతున్న కేంద్ర ప్రభుత్వ ఉదాసీనతను, రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ప్రజలు గమనిస్తున్నారని, రాబోయే ఎన్నికల్లో తగిన గుణాపాఠం చెబుతారని హెచ్చరించారు.సమావేశంలో నారాయణఖేడ్ మాజీ ఎమ్మెల్యే విజయపాల్‌రెడ్డి, మాజీ జెడ్పీ చైర్మన్ శ్రీనివాస్‌గౌడ్, తెలుగు యువత జిల్లా అధ్యక్షులు ఎడ్ల రమేష్, శ్రీశైలం, సత్యనారాయణ, మాణిక్యప్రభు, మల్లారెడ్డి, విజయ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.

పేదల అభ్యున్నతే ధ్యేయం
- అంచనాల కమిటీ చైర్మన్ రామలింగారెడ్డి
తొగుట, జూలై 20: తెలంగాణ ప్రభుత్వం అన్ని వర్గాల అభ్యున్నతికి అహర్నిశలు పాటు పడుతుందని రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మెన్ సోలిపేట రామలింగారెడ్డి అన్నారు. శుక్రవారం తొగుట మండల కేంద్రంలో షాదీముబారక్, కళ్యాణ లక్ష్మి చెక్‌లను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ పేదలను అక్కున చేర్చుకునేందుకు ప్రజాహిత పాలన చేస్తున్నాడని తెలిపారు. అనంతరం కన్గల్ గ్రామంలో ఇటీవల మృతి చెందిన టిఆర్‌ఎస్ సీనియర్ నాయకుడు కానుగంటీ లక్ష్మారెడ్డి, కుటుంబాన్నీ ఆయన పరామర్శించారు. ఈకార్యక్రమంలో ఎంపీపి రేణుక, ఎం ఆర్‌ఓ శ్రీనివాసరెడ్డి, సర్పంచ్ స్వామి పాల్గొన్నారు.