మెదక్

వినియోగదారులు జాగృతం కావాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంగారెడ్డి టౌన్, జూలై 20: మనం ఖర్చుపెట్టే ప్రతి పైసాకు నాణ్యమైన వస్తువులను, సేవలను పొందడం మన హక్కని జాయింట్ కలెక్టర్ నిఖిల పేర్కొన్నారు. వినియోగదారులు ఎదుర్కొనే సమస్యలపై ప్రభుత్వానికి ఫిర్యాదు చేసేందుకు టోల్ ఫ్రీ నంబర్ 180042500333తో రూపొందించిన ప్రచార పోస్టర్లను శుక్రవారం కలెక్టరేట్‌లోని తన చాంబర్‌లో జేసీ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ నకిలీ విత్తనాలు, కల్తీ ఎరువులు, నాణ్యత లేని వస్తులు అమ్ముతున్నా, కొనుగోలు చేసిన వస్తువులకు బిల్లు ఇవ్వటానికి నిరాకరించినా, ఆసుపత్రుల్లో నిర్లక్ష్యంగా తప్పుడు వైద్యం పొంది ఆనారోగ్యంతో బాధపడుతున్నా తదితర అంశాలపై టోల్‌ఫ్రీ నంబర్‌కు ఫిర్యాదు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి శ్రీకాంత్‌రెడ్డి, వినియోగదారుల ఫోరం అధ్యక్షులు కూన వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు.

నర్సాపూర్ బస్ డిపోకు 26న శంకుస్థాపన
-ఎమ్మెల్యే మదన్‌రెడ్డి వెల్లడి
నర్సాపూర్,జూలై 20: డివిజన్ కేంద్రమైన నర్సాపూర్‌లో ఈనెల 26న ఆర్టీసీ బస్‌డిపో ఏర్పాటుకు రాష్ట్ర మంత్రులు శంకుస్థాపన చేయనున్నట్లు ఎమ్మెల్యే చిలుముల మదన్‌రెడ్డి వెల్లడించారు. శుక్రవారంనాడు నర్సాపూర్-హైదరాబాద్ ప్రధాన రహదారిపై గల ఆర్టీసీ డిపో స్థలాన్ని పరిశీలించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ నర్సాపూర్ నియోజకవర్గ ప్రజల చిరకాల వాంఛ త్వరలోనే తీరనుందని అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారని అన్నారు. నర్సాపూర్‌లో ఆర్టీసీ డిపో ఏర్పాటు చేయాలని ప్రజల విజ్ఞప్తుల మేరకు 10కోట్లు మంజూరు చేశారని అన్నారు. ఈనెల 26న రాష్ట్ర రవాణాశాఖ మంత్రి మహెందర్‌రెడ్డి, భారీనీటిపారుదలశాఖ మంత్రి హరీష్‌రావు, డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి చేతుల మీదుగా డిపో నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నట్లు తెలిపారు. డిపో స్థలం కబ్జా అయినట్లు వచ్చిన ఆరోపణల్లో నిజం లేదని స్పష్టం చేశారు. కార్యక్రమం అనంతరం భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. సభ విజయవంతానికి గాను పెద్ధ సంఖ్యలో ప్రజలు హాజరుకావాలని కోరారు.
సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి
రాష్ట్ర ప్రభుత్వం పేద సంక్షేమమే ద్యేయంగా పని చేస్తుందని వాటిని సద్వినియోగం చేసుకొని లబ్ధి పొందాలని ఎమ్మెల్యే చిలుముల మదన్‌రెడ్డి, జడ్పీ చైర్ పర్సన్ రాజమణి సూచించారు. శుక్రవారంనాడు నర్సాపూర్ మండల పరిషత్ కార్యాలయంలో కల్యాణ లక్ష్మీ, షాధి ముభారక్ 72మందికి 54లక్షల రూపాయల చెక్కులు పంపిణీ చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని టీఆర్‌ఎస్ ప్రభుత్వం పూర్తిగా పేదల ప్రభుత్వమని అన్నారు. అన్ని వర్గాల ప్రజల అభివృద్ధే ద్యేయంగా పని చేస్తున్న ప్రభుత్వానికి అండగా నిలవాలని కోరారు. బంగారు తెలంగాణ సాధన కోసం చేస్తున్న కృషిలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. మొక్కల పెంపకంపై ప్రతి ఒక్కరు దృష్టిసారించాలని అన్నారు. అనంతరం స్థానిక చిల్డ్రన్ పార్కులో మొక్కలు నాటి విద్యార్థులకు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఆర్డీఓ వెంకటేశ్వర్లు, తహాశీల్ధార్ మనోహర్ చక్రవర్తి, ఎంపీడీఓ శ్రావన్‌కుమార్, ఎంపిపి శ్రీనివాస్‌గౌడ్, స్థానిక సర్పంచ్ రమణారావు, నాయకులు మురళీయాదవ్, సర్వేష్ పాల్గొన్నారు.