మెదక్

వేగం పెంచండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెదక్ రూరల్, జూలై 20: మెదక్ జిల్లా నూతన సమీకృత కలెక్టరేట్ భవన నిర్మాణ పనుల్లో వేగం పెంచాలని ఇంజనీరింగ్ అధికారులకు కలెక్టర్ దర్మారెడ్డి ఆదేశించారు. శుక్రవారం ఔరంగాబాద్ శివారులో నిర్మిస్తున్న కలెక్టరేట్ పనులను ఆకస్మికంగా పరిశీలించారు. ఈ సందర్భంగా సాగుతున్న నిర్మాణ పనుల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. నిర్మాణం మందకొడిగా సాగుతుందని అసంతృప్తి వ్యక్తం చేశారు. పనుల నిర్మాణంలో మరింత వేగం పెంచాలని అధికారులు, గుత్తేదారును ఆదేశించారు. నిర్ణీత గడువులోగా పనులు పూర్తిచేసివ్వాలన్నారు. స్థలాన్ని అప్పగించి ఐదు నెలలు గడిచినా ఆశించిన స్థాయిలో నిర్మాణ పనులు జరగలేదన్నారు. ఇంకా నిర్మాణం చేయాల్సిన పిల్లర్లు చాలా ఉన్నాయన్నారు. పిల్లర్ల వద్ద ఇంత ఆలస్యం జరిగితే ఎలా అని ప్రశ్నించారు. మున్ముందు స్లాబు, ఇతర పనులు ఎప్పుడు చేస్తారన్నారు. ఎక్కువ మంది కూలీలను పెట్టుకుని పనులు వేగంగా చేపట్టాలని సూచించారు. సిద్దిపేట, మెదక్ కలెక్టరేట్‌లు ఒకే గుత్తేదారు నిర్మిస్తే అక్కడి వేగం ఇక్కడ ఎందుకు లేదని ప్రశ్నించారు. వారం రోజుల్లో కలెక్టరేట్ వద్ద రోడ్లను గుర్తించి మొక్కలు నాటేందుకు ఏర్పాటు చేయాలని ఆర్‌అండ్‌బి అధికారులను ఆదేశించారు. కలెక్టర్ వెంట ఇఇ చంద్రయ్య, డిసిఓ వెంకట్‌రెడ్డి తదితరులున్నారు.

చిరుజల్లుకే చిత్తడి
- రోడ్డుపై దిగపడ్డ ఆర్టీసీ బస్సు
నంగునూరు, జూలై 20: చిరుజల్లుకు రోడ్లు బుదమయమై నడువలేని పరిస్థితి నెలకొందని నంగునూరు గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. నంగునూరు నుండి నాగరాజుపల్లి వెళ్లె దారిలో ప్రభుత్వ ఆస్పత్రి ఆవరణలో రోడ్డు బురదమయమై అటుగా వెలుతున్న ఆర్టీసీ బస్సు దిగబడింది. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బంది ఎదుర్కోన్నారు. బురదలో టైర్లు దిగబడిపోయి బస్సు వెళ్లలేని పనిస్థితి నెలకొంది, 2గంటల పాటు అసౌకార్యనికి గురై ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు. గ్రామస్తుల సహాకారంతో బురదలో దిగబడిన బస్సును పైకి లేపి ప్రయాణికులకు సౌకర్యం కల్పించారు. రోడ్లు మరమ్మతులు తక్షణమే చేయించాలని గ్రామస్తులు కోరుతున్నారు.

ఎస్సీ, ఎస్టీ మైనార్టీలను మోసగిస్తున్న ప్రభుత్వం
- రాష్ట్ర మైనార్టీసెల్ కాంగ్రెస్ నేత ఎక్బాల్
గజ్వేల్, జూలై 20: ఎన్నికల సందర్బంగా అరచేతిలో వైకుంఠం చూపి అధికారంలోకి వచ్చిన టీఆర్‌ఎస్ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలను అన్ని రకాలుగా అన్యాయం చేస్తున్నట్లు రాష్ట్ర మైనార్టీసెల్ కాంగ్రెస్ ప్రచార కార్యదర్శి ఎక్బాల్ విమర్శించారు. శుక్రవారం గజ్వేల్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. టీఆర్‌ఎస్ అధికారం చేపట్టి 4యేండ్లు పూర్తయినా ఇప్పటివరకు నిరుద్యోగులకు ఇచ్చిన హామీని అమలు చేయలేకపోగా, ఎన్నికలు సమీపిస్తున్న క్రమంలో నోటిఫికేషన్‌లు జారీ చేసి పక్కదారి పట్టిస్తున్నట్లు ఆరోపించారు. అలాగే ఆయా వర్గాలకు చెందిన కార్పోరేషన్‌లను నిర్వీర్యం చేసిన ప్రభుత్వం నిదులు వెచ్చించకుండా అలసత్వం ప్రదర్శించడంతోపాటు మైనార్టీలకు ఇచ్చిన 12 శాతం రిజర్వేషన్ ఊసే ఎత్తడంలేదని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో మజ్లీస్‌తో దోస్తీ, కేంద్రంలో బీజేపీతో స్నేహం చేస్తున్న టీఆర్‌ఎస్ నేతల వైఖరిని మైనార్టీలు అర్థం చేసుకోవాలని వివరించారు.