మెదక్

ఘణపురం ప్రాజెక్ట్ ఆధునీకరణకు వంద కోట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెదక్, మే 5: తెలంగాణ ప్రభుత్వం 2015 జూన్ 2న ఏర్పడింది. ఆ రోజు నుండి తెలంగాణ ప్రజలకు ప్రభుత్వం ఇచ్చిన హమీల మేరకు నీటి వనరులపై దృష్టి సాధించింది. ఇందులో భాగంగా 1905లో మంజీర నదిపై నిర్మించిన మద్యతరహా ప్రాజెక్ట్ అయిన ఘణపురం ఆయకట్టు క్రింద 21 వేల 625 ఎకరాలు సాగుభూమి ఉంది. ఇది రానురాను ఘణపురం ఆనకట్టలో పూడిక చేరుకొని నీటి మట్టం పూడుకపోయింది. ఘణపురం ఆయకట్టు క్రింద ఉన్నటువంటి కుడి, ఎడమ కాలువలైన ఎఫ్‌ఎన్, ఎంఎన్ కెనాల్స్ మరమత్తులు నోచుకోలేక చివరి భూములు కూడా పంటలకు నోచుకోలేవు. ఆ భూములన్ని బీటలు బారాయి, గత ప్రభుత్వాలో రైతులు అనేక సార్లు విజ్ఞప్తులు చేసినా ప్రజా ప్రతినిధులు ఎంఎన్, ఎఫ్‌ఎన్ కెనాల్ మీద పాదయాత్రలు చేసినా రైతుల మొర ఎవరు పట్టించుకోలేదు. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన వెంటనే మెదక్ శాసనసభ్యురాలు, ఉపసభాపతి పద్మాదేవేందర్‌రెడ్డి పట్టువీడని విక్రమార్కురాలిగా కాలువల మరమతుకు మంజూరైన జైకా నిధులు మరలిపోయిన వాటిని తిరిగి రప్పించుకున్నారు. అంతే కాదు రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్‌ను మెదక్ పట్టణానికి నియోజకవర్గ సమావేశానికి ఆమె రప్పించుకున్నారు. ఘణపురం ఆనకట్ట ఎత్తు పెంచడానికి నిధులను మంజూరు చేయించుకున్నారు. మెదక్ పట్టణాభివృద్దికి మరో కోటి రుపాయలు మంజూరు చేయించుకున్నారు. ఇదిలా ఉండగా రైతుల శ్రేయస్సు కోసం ఘణపురం ఆనకట్టపై దృష్టి సాధించిన పద్మాదేవేందర్‌రెడ్డి తెలంగాణ భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్‌రావుతో ఘణపురం ఆనకట్ట ఎత్తు పెంచడానికి 44 కోట్లు మంజూరు చేయించుకున్నారు. ఈ ఆనకట్ట ఎత్తుకు శుక్రవారం మంత్రి హరిష్‌రావుతో శంకుస్థాపన చేయించనున్నారు. ఎంఎన్, ఎఫ్‌ఎన్ కెనాల్స్ ఆధునీకరణ పనుల కోసం మంత్రి హరిష్‌రావుతో శంకుస్థాపన చేయించిన విషయం తెలిసిందే. ఈ రెండు కెనాల్స్ ఆధునీకరణ పనులు కూడా పూర్తి అయ్యాయి. జైకా నిధులు 25 కోట్లు, మరో 21 కోట్లు అదనంగా మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి మంజూరు చేయించారు. ఈ విధంగా ఘణపురం ప్రాజెక్ట్ పూర్తి నిర్మాణాల కోసం ముఖ్యమంత్రి 50 కోట్లు మంజూరు చేశారు. మొత్తం ఈ ప్రాజెక్ట్ నిర్మాణం కోసం వంద కోట్లు పద్మాదేవేందర్‌రెడ్డి మంజూరు చేయించుకొని ఈ పనులలో సఫలీకృతులయ్యారు. ఈ విషయంలో పద్మాదేవేందర్‌రెడ్డికి రైతులు రుణపడి ఉంటారని కూడా స్పష్టంగా తెలుస్తుంది. అంతే కాకుండా మెదక్ అసెంబ్లీ నియోజకవర్గంలోని గుండువాగు పనులు చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న విషయంతెలిసిందే. వీటి సమస్యలన్నియు కూడా పద్మాదేవేందర్‌రెడ్డి పరిష్కరించి గుండువాగు అభివృద్దికి 1.18 కోట్ల రుపాయలు మంజూరు చేయించారు. ఈ నిధులతో గుండువాగుకు మంత్రి హరీష్‌రావుతో శంకుస్థాపన శుక్రవారం చేయిస్తున్నారని నీటి పారుదల శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఏసయ్య, డిప్యూటి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శివనారాయణ గురువారం నాడు విలేఖరులతో మాట్లాడుతూ మాట్లాడుతూ తెలిపారు. ఆ తరువాత దౌలాపూర్‌లోని ఏటి కాలువ మిషన్ కాకతీయ క్రింద ఫెస్-2లో మంజూరైన 74 లక్షలతో మంత్రితో పద్మాదేవేందర్‌రెడ్డి శంకుస్థాపన చేయిస్తున్నారని వారు తెలిపారు. మెదక్, నర్సాపూర్ నియోజకవర్గాల పరిధిలో ఫేస్-1లో 336 చెరువులు మిషన్ కాకతీయ క్రింద మంజూరు కాగా అందులో 300 చెరువులను పూర్తి చేసినట్లు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఏసయ్య, శివనారాయణ తెలిపారు. ఇందుకు పేమెంట్లు కూడా 34 కోట్లు ఇచ్చినట్లు తెలిపారు. రెండవ దశలో మంజూరైన 422 చెరువులలో 255 చెరువులు గ్రౌండ్ చేసినట్లు తెలిపారు. ఈ పనులు ముమ్మరంగా జరుగుతున్నాయన్నారు. ఈ విధంగా మంత్రి హరీష్‌రావు, డిప్యూటి స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి ఆదేశాల మేరకు మెదక్ డివిజన్‌లో నీటి పారుదలకు సంబంధించిన పనులు ముమ్మరంగా జరుగుతున్నాయని వారు తెలిపారు.