మెదక్

బ్యాంక్‌లతో సంబంధం లేకుండా బీసీ కార్పొరేషన్ రుణాల పంపిణీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెదక్, ఆగస్టు 13: తెలంగాణలోని అన్ని జిల్లాల్లో బ్యాంక్‌లతో సంబంధం లేకుండా వంద మంది లబ్ధిదారులకు బీసీ సంక్షేమ శాఖ ద్వారా వెనుకబడిన తరగతుల వారికి రుణాలు పంపిణీ చేసేందుకు జిల్లా కలెక్టర్లు ఏర్పాటు చేసుకోవాలని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి జోగు రామన్న కలెక్టర్లను ఆదేశించారు. సోమవారం హైదరాబాద్ నుండి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కె.జోషి పంద్రాగస్టు నుండి పంపిణీ చేయాల్సిన బీసీ రుణాలపై వీడీయో కాన్పరెన్స్ ద్వారా మార్గదర్శకాలను కలెక్టర్లకు సూచించారు. ఈ వీడీయో కాన్ఫరెన్స్‌లో మంత్రి ఆదిలాబాద్ నుండి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ బీసీ కార్పోరేషన్ ద్వారా స్వయం ఉపాది కోసం దరఖాస్తులు చేసుకున్న లబ్దిదారులకు పంద్రాగస్టు రోజున రుణాలు అందజేసేందుకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. పెద్దమొత్తంలో బీసీ కార్పోరేషన్ రుణాలకు దరఖాస్తులు వచ్చినందున పారదర్శకంగా లబ్దిదారుల ఎంపిక చేపట్టాలన్నారు. కలెక్టర్ చైర్మన్‌గా ఉన్న కమిటి ద్వారా అసలైన లబ్దిదారులను గుర్తించాలని సూచించారు. గుర్తించిన లబ్దిదారులకు పంద్రాగస్టు రోజున లబ్దిదారునికి 50 వేల చొప్పున అందజేయాలని తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ ధర్మారెడ్డి మాట్లాడుతూ జిల్లాలో సుమారు 14 వేల దరఖాస్తులు వచ్చాయని, వాటిలో అర్హులను గుర్తించి రుణాల పంపిణీకి చర్యలు చేపడతామని తెలిపారు. అలాగే వంద మంది బీసీ లబ్దిదారులకు 50 వేల రుపాయల పంపిణీకి ఎంపిక పూర్తి చేసి స్వాత్రంత్య దినోత్సవం రోజున రుణాలు పంపిణీ చేస్తామన్నారు.