మెదక్

సిద్దిపేట - తోర్నాల రహదారికి రూ. 2.40 కోట్లు మంజూరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిద్దిపేట, ఆగస్టు 20 : సిద్దిపేట-రామాయంపేట వెళ్లే రహదారిలో తోర్నాల వరకు రోడ్ల మరమ్మతులకు 2.40 కోట్ల నిధులు మంజూరైనట్లు రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి హరీష్‌రావు తెలిపారు. సోమవారం ఆయన ఫోన్‌లో మాట్లాడుతూ సిద్దిపేట రూరల్ పోలీస్‌స్టేషన్ నుండి తోర్నాల వల్యవసాయ పాలిటెక్నిక్ కళాశాల వరకు రోడ్డు గుంతలుగా, వంపులుగా ఉండటం వల్ల ప్రయాణికులకు ఇబ్బందిగా మారిందన్నారు. దీంతో సిద్దిపేట నుండి తోర్నాల వరకు 8కిలోమీటర్లు మరమ్మతులకు 2.40 కోట్లు రహదారి మరమ్మతులకు నిధులు మంజూరు చేయించినట్లు తెలిపారు. దీంతో ప్రయాణికుల ఇక్కట్లు తొలగిపోతాయన్నారు. త్వరలోనే టెండర్ ప్రక్రియ పూర్తి చేసి పనులు ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు.

బకాయ ఉపకార వేతనాలు విడుదల చేయాలని
కలెక్టరేట్ ముందు ఎస్‌ఎఫ్‌ఐ ధర్నా
సంగారెడ్డి టౌన్, ఆగస్టు 20: బకాయి ఉపకార వేతనాలు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు సందీప్, మహేష్‌లు మాట్లాడుతూ రాష్టవ్య్రాప్తంగా 4వేల కోట్ల రూపాయల ఉపకార వేతనాలు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. ఉపకార వేతనాలు రాక పేద విద్యార్థులు చదువుకు దూరమయ్యే పరిస్థితి వచ్చిందన్నారు. అదే విధంగా ప్రైవేట్ కళాశాలల్లో అధిక ఫీజులను అరికట్టడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. విద్యార్థులను భవిష్యత్‌తో చెలగాటం ఆడుతున్న ప్రభుత్వానికి తగిన బుద్ధిచెప్పడం ఖాయమన్నారు. ప్రభుత్వం స్పందించి వెంటనే ఉపకార వేతనాలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం జాయింట్ కలెక్టర్ నిఖిలకు వినతి పత్రాన్ని సమర్పించారు. కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు సుదర్శన్, శ్రీకాంత్, బాబన్న, రమేష్, విద్యార్థులు పాల్గొన్నారు.

చెరకు రైతులకు అందని తీపి
* ఆరు నెలలుగా బిల్లులకై ఎదురుచూపు
జహీరాబాద్, ఆగస్టు 12: ట్రైడెంట్ చక్కెర కర్మాగారం నిర్లక్ష్యం, ప్రజాప్రతినిధులు ఊదాసీనతవల్ల నెలలు గడుస్తున్నా చెరకు రైతులకు ఆర్థిక ఇబ్బందులు తప్పడంలేదు. ఆరుగాల కష్టపడి పండించిన చెరకు విక్రయించి ఆరు నెలలైనా ఇంతవరకు కర్మాగార యాజమాన్యం రైతులకు బిల్లులు చెల్లించడంలేదు. దీంతో రైతులు తీవ్ర ఆర్థిక ఇబ్బంధులకు గురౌతున్నారు. సాగుకోసం, కుటుంబ అవవసరాలకోసం, పిల్లల చదువులకోసం, శుభాకార్యాలు ఇతర అత్యవసరాలకోసం వడ్డీవ్యాపారులపైనే ఆధారపడాల్సిన పరిస్థితి నెలకొంది. కర్మాగారం పరిధిలోని రైతులకు సుమారు రూ.60లక్షల మేర బకాయిలు రావల్సిఉంది. వాటిని చెల్లించేందుకు కర్మాగారం మీనమేశాలు లెక్కిస్తోంది. ఈ ప్రాంతంలోని ఏకైక చెక్కర కర్మాగారమైన ట్రైడెంట్ షుగర్స్ లిమిటెడ్ యాజమాన్యం నమ్మిన రైతులను వేదిస్తోంది. గత సీజన్‌లో సాగుకోసం చేసిన అప్పులు తీరక, ఈ సీజన్‌లో మళ్లీ సాకుచేసేందుకు కొత్త అప్పులు పుట్టక రైతులు పడ్డకష్టాలు వర్ణనాతీతం. రైతుల కష్టాలకు పార్టీలు స్పందించాయి. తమ వంతుగా యాజమాన్యంపై ఒత్తిడి పెంచాయి. పలుమార్లు యాజమాన్య ప్రతినిధులతో వివిధ పార్టీ నాయకులు చర్చించారు. బిల్లులు చెల్లించాలని గట్టిగా డిమాండ్ చేశారు. మంత్రి హరీరష్‌రావు సమక్షంలో కర్మాగార యాజమాన్య ప్రతినిధులు సమావేశమయ్యారు. బిల్లుల చెల్లింపుకోసం గడువు తీసుకున్నారు. అంతకు మందు బిల్లుల చెల్లింపులో జాప్యంచేస్తూ రైతులను వేధిస్తున్న యాజమాన్యంపై ఆర్‌ఆర్ చట్టాన్ని ప్రయోగించాలని కూడా ఓ స్థాయిలో మంత్రి అధికారులను ఆదేశించారు. ఆయినా అవేవీకూడా యాజమాన్యం పట్టించుకోలేదు. రైతులకు బిల్లులు చెల్లించలేదు. దీంతో రైతులు లెక్కకు మించి అప్పులుచేస్తూ తలకు మించిన భారాన్ని మోస్తున్నారు.