మెదక్

తెరాస హామీలకు కేంద్ర బడ్జెట్ కూడా సరిపోదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంగారెడ్డి టౌన్, మే 10: తెరాస ఇచ్చిన హామిలు అమలుకు నోచుకోవాలంటే రాష్ట్ర బడ్జెట్‌తో పాటు కేంద్ర బడ్జెట్ కూడా సరిపోదని, వాగ్దానాలతో ప్రజల దృష్టిని పక్కదారి పట్టిస్తున్నారని తెలుగు రైతు రాష్ట్ర అధ్యక్షులు ఒంటేరు ప్రతాప్‌రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కోటి ఎకరాలకు సాగు నీరు అందిస్తామంటూ ప్రచారం చేసుకుంటున్న సిఎం కెసిఆర్, మంత్రి హరీష్‌రావులు ఏ విధంగా అందిస్తారో సమాధానం చెప్పాలని సవాల్ విసిరారు. ఇప్పటి వరకు కేవలం నాలుగు ప్రాజెక్టులకు శంఖుస్థాపనలు మాత్రమే చేసారని, ఎక్కడా కూడా పనులు ప్రారంభించలేదన్నారు. కెసిఆర్ ఓంటేద్దు పోకడలతో రోజుకో కొత్త ఆలోచన తప్పా రెండేళ్ల అధికారంలో చేసిందేమి లేదని విమర్శించారు. మిషన్ కాకతీయ, వాటర్‌గ్రిడ్ పథకాలన్ని అవినీతి మయంగా మారాయని, సిఎం క్యాంఫ్ ఆఫీస్ అవినీతికి అడ్డాగా మారిందని ఆరోపించారు. అవినీతి సొమ్ముతో రాజ్యమేలాలనుకుంటున్న సిఎం కెసిఆర్, మంత్రి హరీష్‌రావులను ప్రజలు తరమికొట్టే రోజులోస్తాయన్నారు. ఉవ్వెత్తున ఉద్యమించి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని ఆ నలుగురే అనుభవిస్తున్నారన్నారు. మెజార్టీ ఉన్నప్పటికి టిడిపి నాయకులను భయబ్రాంతులకు గురి చేసి పార్టీలో చేర్చుకోవడం సిగ్గుచేటన్నారు. ఇందిరాగాంధీ, వైఎస్‌ఆర్, సోనియాగాంధీ లాంటి వారే తెలుగుదేశం పార్టీని టార్గెట్ చేసి ఏమి చేయలేకపోయారని, ఈ కెసిఆర్ ఏం చేస్తాడని ఎద్దేవా చేశారు. సిఎం హోదాలో ఉండి మాములు కార్యకర్తలకు కండువాలు వేసే దుస్థిదికి దిగజారడం సోచనీయమన్నారు. ప్రజలు గమనిస్తున్నారని వచ్చే ఎన్నికల్లో తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. టిడిపి జిల్లా అధ్యక్షురాలు శశికళయాదవరెడ్డి మాట్లాడుతూ తెరాసా పార్టీ సిద్దాంతాలను పక్కన పెట్టి పార్టీలో చేర్చుకోవడమే పనిగా పెట్టుకుందని విమర్శించారు. టిడిపి అంటే కెసిఆర్ భయం పుట్టుకుంది కాబట్టే పిరాయింపులకు పాల్పడుతున్నాడన్నారు. ప్రజలను మభ్యపెట్టి, మసిపూసి గారడి చేసే ప్రయత్నం చేస్తున్నారన్నారు. రాష్ట్రంలో పార్టీకి ఎలాంటి డోకా లేదన్నారు. ఇచ్చిన హామిల అమలు కోసం ప్రజల పక్షాన పోరాటం చేస్తామన్నారు. త్వరలో జిల్లాలో నిర్వహించే మినీ మహానాడుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. సమావేశంలో టిడిపి రాష్ట్ర కార్యదర్శి ఆర్.శ్రీనివాస్‌గౌడ్, గుండప్ప, విజయ్‌పాల్‌రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి సరాప్ యాదగిరి, నర్సింలు, విజయ్‌కుమార్, బందేన్నగౌడ్, నాగేంద్ర, మల్లేశం, మాణయ్య, లక్ష్మినర్సింహాం పాల్గొన్నారు.