మెదక్

పొన్నాలా.. నోరు అదుపులో పెట్టుకో

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంగారెడ్డి టౌన్, మే 16: ప్రజా సంక్షేమం, అభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తున్న సిఎం కెసిఆర్, మంత్రి హరీష్‌రావులపై తప్పుడు ఆరోపణలు చేస్తే సహించేది లేదని టిఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు మురళీ యాదవ్ హెచ్చరించారు. టిపిసిసి రాష్ట్ర మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, మాజీ మంత్రి గీతారెడ్డిలు చేసిన ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. సోమవారం పార్టీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మురళీయాదవ్ మాట్లాడుతూ ప్రజలు గర్జిస్తే పాతాళానికి వెళ్లింది ఎవరో గమనించాలన్నారు. 50యేళ్ల పాలనలో చేయని అభివృద్ధి కేవలం రెండేళ్లలో జరుగుతుంటే చూసి ఒర్వలేక తప్పుడు ఆరోపణలు చేయడం సిగ్గుచేటన్నారు. కాంగ్రెస్ హయంలో చెరువులు, కుంటలను తిరిగి చూసిన దాఖలాలు లేవన్నారు. దొరికినోడికి దోరికినంత దోచుకునేందుకు ఉన్న చెరువులను కబ్జాలు చేశారని విమర్శించారు. సిఎం కెసిఆర్ మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ లాంటి బృహత్తర కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి గ్రామాలను సస్యశ్యామలం చేసేందుకు కృషి చేస్తున్నారన్నారు. దొరల పాలన అనే భాషను మార్చుకోవాలని లేని పక్షంలో తగిన గుణపాఠం చెప్పడం ఖాయమన్నారు. పిచ్చి కూతలు కూస్తే సహించేది లేదని తరిమికొడుతామని హెచ్చరించారు. సమావేశంలో జడ్పీటిసి మనోహర్‌గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ కొండల్‌రెడ్డి, వైస్ చైర్మన్ సుభాన్, టిఆర్‌ఎస్ పట్టణ అధ్యక్షులు శ్రీనివాస్‌చారి, నాయకులు వెంకటేశం, జలాలోద్దీన్‌బాబా, జలేందర్‌రావు, రాజు యాదవ్, నరేష్‌రావు తదితరులు పాల్గొన్నారు.