మెదక్

భూ సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జిన్నారం, మే 27: భూ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతుందని, 5 ఎకరాల బైనామాతో ఉన్న భూములను ఉచితంగా రిజిస్ట్రేషన్ చేస్తామని రాష్ట్ర భారీనీటి పారుదల శాఖామంత్రి హరీశ్‌రావు అన్నారు. శుక్రవారం మండలంలోని జిన్నారం, అన్నారంకు 8కోట్ల 60లక్షలతో చేపడుతున్న రోడ్డు విస్తరణ పనులకు రోడ్లు భవనాల శాఖామంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావుతో కలిసి శంకుస్దాపన చేశారు. అనంతరం ఎంపీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ భూసమస్యల పరిష్కారానికే ప్రభుత్వం 58, 59 జీఓలను తీసుకువచ్చిందని తెలిపారు. అంతే కాకుండా పట్టణ, మున్సిపల్ ప్రాంతాల సమస్యల పరిష్కారానికి ఎల్‌ఆర్‌ఎస్, బీఆర్‌ఎస్ తీసుకు వచ్చి రెగ్యులరైజ్ చేస్తున్నామన్నారు. రాష్ట్రంలో సుమారు 10 నుండి 12లక్షల భూమి సాదా బైనామాల క్రింద వుందని గుర్తించినట్లు తెలిపారు. దీంతో ఆరు నుండి 8లక్షల మందికి లబ్ది చేకూరుతుందని వెల్లడించారు. జిల్లాలో 50వేల మంది వరకు లబ్ధి చేకూరుతుందని అన్నారు. గత ప్రభుత్వాలు చేసిన మాదిరిగా కాకుండా పకడ్బందిగా చేస్తామని, రెవెన్యూ అధికారులు అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
మంత్రులకు ఘన స్వాగతం
రోడ్ల విస్తరణ శంకుస్దాపనకు వచ్చిన రాష్ట్ర మంత్రులు తుమ్మల నాగేశ్వర్‌రావ్, హరీశ్‌రావుల, డిప్యూటీ స్పీకర్ పద్మాదేవెందర్‌రెడ్డి, ఎమ్మెల్సీలు భూపాల్‌రెడ్డి, శంభీపూర్ రాజు, ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డిలకు మండల నాయకులు ఘన స్వాగతం పలికారు. ఎంపీపీ రవీందర్‌రెడ్డి, జిల్లా నాయకుడు వెంకటేశంగౌడ్, చంద్రారెడ్డి, చిమ్ముల గోవర్ధన్‌రెడ్డిల ఆధ్వర్యంలో స్వాగతం పలికారు. భాణాసంచా పేల్చి సంబారులు జరుపుకున్నారు. జిన్నారం పుర వీధుల గుండా ర్యాలీ నిర్వహించారు. దీంతో జిన్నారం, అన్నారం గ్రామాలలో గులాబీ దండుకు పండగ వాతావరణం నెలకొన్నది.