మెదక్

ముంపు గ్రామాల ప్రజల నిరసన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిద్దిపేట, మే 30 : సిద్దిపేట నియోజక వర్గం పరిధిలోని చిన్నకోడూరు మండలం కొచ్చగుట్టపల్లిగ్రామస్తులు ఆర్డీఓ కార్యాలయం ముందు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. తమ గ్రామంలో భూమి, ఇళ్లపై ధర నిర్ణయించకుండానే నోటిపికేషన్ జారీ చేశారని ఆరోపించారు. మెరుగైన నష్ట పరిహారం అందించిన తర్వాతనే భూసేకరణ చేపట్టాలని ఆర్డీఓ కార్యాలయం ప్రధాన ద్వారం ముందు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ఆర్డీఓ కార్యాలయంలోకి ప్రజలు వెళ్లకుండ అడ్డుకున్నారు. ఆర్డీఓ ముత్యంరెడ్డి గ్రామస్థులను పిలిపించి చర్చించారు. గ్రామస్థులకు 123 జివో ప్రకారం మెరుగైన పరిహారం అందించిన తర్వాతనే భూమిని సేకరిస్తామన్నారు. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. నిబంధనలకు అనుగుణంగా ప్రజలకు పూర్తి స్థాయిలో నష్టపరిహారం అందిస్తామన్నారు. భూ నిర్వాసితులకు ప్రభుత్వ సంక్షేమ పథకాల్లో తగిన ప్రాధాన్యత కల్పిస్తామన్నారు. రైతులకు నచ్చచెప్పి ఆందోళన విరమింప చేశారు. ఈకార్యక్రమంలో కొచ్చగుట్టపల్లి నిర్వాసితులు పాల్గొన్నారు.