మెదక్

గ్రామాల్లోనూ అవతరణ వేడుకలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంగారెడ్డి, మే 30: గ్రామాల్లో ప్రజలను భాగస్వామ్యం చేసి ఒక పండుగ వాతావరణంలో జూన్ 2న రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను నిర్వహించందుకు అన్ని చర్యలు తీసుకోవాలని సంయుక్త కలెక్టర్ వెంకటరామిరెడ్డి అధికారులకు సూచించారు. రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు తీసుకుంటున్న చర్యలపై ఆర్డీవోలు, మండలాధికారులతో సోమవారం ఆయన వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు. గ్రామాల్లో పెద్ద ఎత్తున ప్రజలను భాగస్వామ్యం చేస్తే బాగుంటుందని సూచనలకు అధికారులు ఆమోదం తెలుపుతూ అన్ని వర్గాల ప్రజలను ఈ ఉత్సవాల్లో భాగస్వామ్యం చేస్తామన్నారు. గ్రామాలలోని పాఠశాలలు, ఆసుపత్రులు, గ్రామ పంచాయతీ కార్యాలయాలు, అంగన్‌వాడి కేంద్రాలతో పాటు ఇతర ప్రభుత్వ కార్యాలయాలను అలంకరించి విద్యుత్ దీపాలతో అలంకరించాలన్నారు. వెయ్యి రూపాయల పెన్షన్‌ను, వికలాంగులకు పదిహేను వందల పెన్షన్లు, ప్రతి మనిషికి ఆరు కిలోల బియ్యం, నూతన రహదారుల నిర్మాణం, మిషన్ కాకతీయ, మిషన భగీరథ, కల్యాణలక్ష్మి, షాదీముబారక్ లాంటి ప్రజామోద పథకాలపై ప్రజల్లో చర్చ జరిగేలా చూడాలన్నారు. గత ప్రభుత్వాల పనితీరుక, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత అమలు చేసుకుంటున్న కార్యక్రమాల్లో ప్రజల్లో స్పష్టత అవసరమన్నారు. గ్రామస్థాయిలో కార్యక్రమం విజయవంతమయ్యేందుకు ఆర్డీవోలు ప్రత్యేక శ్రద్ద తీసుకోవాలన్నారు. సిద్దిపేట ఆర్డీవో ముత్యంరెడ్డి వివరిస్తూ ఉదయం 7.30 గంటలకు ఎంపిడిఓ కార్యాలయానికి వచ్చిన అనంతరం అమరవీరులకు నివాళులు అర్పిస్తామని, అనంతరం జాతీయ జెండా ఆవిష్కరణ, వేలాది మందితో ర్యాలీగా వెళ్లి తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేసి అంబేద్కర్ చౌరస్తాలో సమావేశం నిర్వహిస్తామని, సాయంత్రం ఐదు గంటల నుంచి తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు ప్రతిబింబించే విధంగా సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవోలు శ్రీనివాస్‌రెడ్డి, ముత్యంరెడ్డి, నగేష్, డిఆర్‌డిఎ పిడి సత్యనారాయణరెడ్డి, డ్వామా పిడి సురేంద్రకరణ్, ఉద్యానవన శాఖ డిడి రామలక్ష్మి, ఎస్పీ కార్పోరేషన్ ఇడి చరణ్‌దాస్, తహశీల్దార్లు, ఎంపిడిఓలు పాల్గొన్నారు.
ఎల్‌డిఎంకు వీడ్కోలు
పదవి విరమణ పొందుతున్న ఎల్‌డిఎం రమణారెడ్డికి కలెక్టరేట్‌లో వీడ్కోలు సమావేశం నిర్వహించారు. కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమం సందర్భంగా వీడ్కోలు కార్యక్రమం చేపట్టారు. ముఖ్య అతిథిగా హాజరైన జాయింట్ కలెక్టర్ వెంకటరామిరెడ్డి మాట్లాడుతూ జిల్లాలో బ్యాంకుల ద్వారా ప్రభుత్వ పథకాల లబ్దిదారులకు ఆర్థిక సహాయం అందించడంలో రమణారెడ్డి విశేషంగా కృషి చేసారని కొనియాడారు. జడ్పీ సిఇఓ వర్షిణి, డిఆర్‌ఓ దయానంద్, డిఆర్‌డిఎ, డ్వామా పిడిలు సత్యనారాయణరెడ్డి, సురేందర్‌కరణ్, పశు సంవర్ధక శాఖ జెడి లక్ష్మారెడ్డి, వివిధ శాఖల అధికారులు ఈ వీడ్కోలు సమావేశంలో పాల్గొన్నారు. అంతకుముందు జెసితో పాటు ఇతర అధికారులు ఎల్‌డిఎం రమణారెడ్డిని శాలువాతో సన్మానించారు.