మెదక్

‘అవతరణ’ వేడుకల్లో అందరి భాగస్వామ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంగారెడ్డి, మే 30: జూన్ 2వ తేదీన తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ సంబరాలలో ప్రజలంతా పెద్ద సంఖ్యలో పాల్గొనాలని కలెక్టర్ రొనాల్డ్ రోస్ పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రమైన సంగారెడ్డిలో జరిగే కార్యక్రమాలలో రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి టి.హరీష్‌రావు ముఖ్య అతిథిగా పాల్గొంటారని తెలిపారు. జూన్ 2వ తేదీ ఉదయం 8.30 గంటలకు కలెక్టరేట్‌లో అమరవీరుల స్థూపానికి మంత్రి, ప్రజాప్రతినిధులు పుష్పగుచ్చాలతో నివాళులు అర్పిస్తారని, 9 గంటలకు పరేడ్ గ్రౌండ్‌లో మంత్రి చేతులమీదుగా జాతీయ పతాకావిష్కరణ, పోలీసుగౌరవ వందనం స్వీకరణ, ప్రసంగం, అమరవీరుల తల్లిదండ్రులకు గౌరవ సత్కారం, 9.30 నుండి 10.15 వరకు స్థానిక విద్యా సంస్థల బాలబాలికలచే సాంస్కృతిక ప్రదర్శనలు, తెలంగాణ సాంస్కృతిక సారధి కళాకారులచే కళా ప్రదర్శనలు, 10.15 నుంచి 11 గంటల వరకు మంత్రిచేత అమరవీరుల కుటుంబ సభ్యులకు కారుణ్య నియామకాల ఉత్తర్వులు అందజేత, జిల్లాలో వివిధ రంగాల్లో ప్రతిభ కనబర్చిన వారికి నగదు బహుమతుల పురస్కారాల పంపిణీ అనంతరం స్టాల్స్‌ను సందర్శిస్తారని పేర్కొన్నారు.
అంబేద్కర్ స్టేడియంలో సాంస్కృతిక కార్యక్రమాలు
సాయంత్రం 6 గంటల నుంచి స్థానిక అంబేద్కర్ స్టేడియంలో పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు కలెక్టర్ వివరించారు. స్టేడియం ప్రాంగణంలో ఆర్ట్ ప్రదర్శనలతో పాటు ప్రజలకు ఫుడ్ కోర్టులను అందుబాటులో ఉంచనున్నామని ప్రజలు ఈ కార్యక్రమాలను తిలకించాలని కోరారు. రేవన్న మైసూర్ బృందంచే కాంసా జానపద నృత్యం, సత్యాల భారతిచే జయ జయహే తెలంగాణ సాంస్కృతిక కార్యక్రమం, శ్రీమణి మారన్ తమిళనాడు బృందంచే పరాయి సంగీత నృత్యం, దుర్గాప్రసాద్ సిద్దిపేట బృందంచే జానపద నృత్యం, తెలంగాణ సాంస్కృతిక సారధి కళాకారులచే తెలంగాణ జానపద, నృత్య కార్యక్రమాలు, గుజరాత్ రాష్ట్రానికి చెందిన పవన్ బోగుల్ బృందంచే దంగి నృత్యంతో ఈ ఉత్సవాలు ముగుస్తాయని కలెక్టర్ పేర్కొన్నారు.