మెదక్

2 నుంచి సాదాబైనామాల క్రమబద్ధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెదక్, మే 30: సాదాబైనమాలలో ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం క్రమబద్ధీకరణ చేయడం జరుగుతుందని మెదక్ ఆర్డీఓ మెంచు నగేష్ తెలిపారు. సోమవారం నాడు మాయా గార్డెన్‌లో జరిగిన తహశీల్దార్లు, జడ్పీటిసి, ఎంపిపి, సర్పంచ్‌లు, విఆర్‌ఓలు, రెవెన్యూ సిబ్బందితో జరిగిన సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. సాదాబైనామాలపై క్రయ విక్రయాలు చేసుకున్నవారు జూన్ 2 నుంచి 10 వరకు దరఖాస్తులు మీసేవా కేంద్రం ద్వారా ఫారం-5ను పూర్తి చేసి నమోదు చేసుకోవాలన్నారు. సాదాబైనమాపై జరిగిన క్రయ విక్రయాలను క్రమబద్ధీకరణ చేయించుకునేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించిందన్నారు. ఎలాంటి స్టాంప్ రుసుము చెల్లించకుండానే ఉచితంగా క్రమబద్ధీకరణ చేసుకునే వెసులుబాటును ప్రభుత్వం కల్పించిందన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని రైతులకు ఆయన సూచించారు. పట్టా భూములు అయ్యి ఉండి ఒక గుంట నుంచి ఐదు ఎకరాల విస్తీర్ణం ఉన్న వాటిని మాత్రమే క్రమబద్ధీకరణ చేసుకునే అవకాశం ఉందని స్పష్టం చేశారు. 2014 జూన్ 2లోపు జరిగిన సాదాబైనమాలకు మాత్రమే రిజిస్ట్రేషన్ అవకాశం ఉంటుందన్నారు. ఈ విషయంపై రెవెన్యూ సిబ్బంది గ్రామాలకు వెళ్లి రైతులను అవగాహన కల్పించాలని ఆర్డీఓ ఆదేశించారు. ఈ విషయంలో రెవెన్యూ సిబ్బంది ఎవరైనా అవకతవకలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆర్డీఓ హెచ్చరించారు. సాదాబైనమాలు క్రమబద్ధీకరణ చేసుకుంటే బ్యాంకుల ద్వారా రుణాలు పొందడం, ప్రభుత్వ పరంగా ప్రయోజనం పొందేందుకు వీలుంటుందన్నారు. ఈ సమావేశంలో మెదక్, రామాయంపేట, శంకరంపేట, పాపన్నపేట, కౌడిపల్లి, కొల్చారం మండలాల తహశీల్దార్లు, జడ్పిటిసిలు, ఎంపిపిలు, సర్పంచ్‌లు, విఆర్‌ఓలు, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.