మెదక్

వ్యవస్థపై నమ్మకం కలిగేలా పనిచేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంగారెడ్డి, మే 31: ప్రభుత్వ రంగానికి చెందిన వివిధ శాఖలతో పోల్చితే పోలీసు శాఖపై బాధ్యతలు అధికంగా ఉంటాయని, ఆ బాధ్యతలు సక్రమంగా నిర్వహిస్తూ శాఖపై ప్రజలకు నమ్మకం కలిగేలా ప్రతి ఒక్కరు పని చేయాలని హైదరాబాద్ డిఐజి, నిజామాబాద్,మెదక్ రేంజ్ డిఐజి అకున్ సబర్వాల్ సూచించారు. ఇటీవలే నిజామాబాద్ రేంజ్ డిఐజిగా బాధ్యతలు స్వీకరించిన ఆయన మంగళవారం మెదక్ జిల్లా కేంద్రమైన సంగారెడ్డిలోని ఎస్పీ కార్యాలయాన్ని సందర్శించారు. జిల్లాలో పని చేస్తున్న పోలీసు అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో పలు ప్రధాన జాతీయ రహదారులు ఉన్నాయని, ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలన్నారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాల్లో ఒకటైన ఇసుక అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేసి ప్రభుత్వానికి నమ్మకం కల్పించాలన్నారు. దొంగతనాలను సమర్థవంతంగా అరికట్టేందుకు రాత్రి సమయంలో గస్తీ ముమ్మరం చేయాలని, సిసి కెమెరాల పర్యవేక్షణలో చోరీలను నియంత్రించాలన్నారు. పేకాట, మట్కా లాంటి జూదాన్ని ఉక్కుపాదంతో అణచివేయాలని, ట్రాఫిక్ వ్యవస్థను పటిష్టపర్చాలన్నారు. వాహనాలను ఎప్పటికప్పుడు తనిఖీలు చేసి గుట్టు చప్పుడు కాకుండా కొనసాగుతున్న అక్రమ రవాణా వ్యవస్థను నిర్మూలించాలని సూచించారు. గ్రామీణ పోలీసు వ్యవస్థను పటిష్టపర్చడం ద్వారా శాంతి భద్రతల పరిరక్షణకు దోహదపడుతుందని, ఆ దిశలో పోలీసులను ముందుకు నడిపించే బాధ్యత ప్రతి అధికారిపై ఉంటుందన్నారు. నేరాల సంఖ్యను తగ్గించే విధంగా చర్యలు తీసుకోవాలని ప్రజలతో మమేకమై ప్రెండ్లీ పోలీసు వ్యవస్థను ముందుకు తీసుకువెళ్లాలన్నారు. ప్రజల సహకారం పూర్తిస్థాయిలో ఉంటేనే శాంతి భద్రతలతో పాటు నేరాలను, ఘోరాలను అదుపు చేయడం సాధ్యపడుతుందని అన్నారు. అసాంఘిక కార్యకలాపాలు, మహిళల వేధింపులు, ఆకతాయిలపై దృష్టి సారించేందుకు షీ టీం వ్యవస్థను మెరుగు పర్చాలన్నారు. నమోదయ్యే ప్రతి కేసును నిశితంగా దర్యాప్తు చేసి నేరస్తులను చట్టానికి అప్పగించాలన్నారు. పోలీస్ స్టేషన్‌కు వచ్చే వారి పట్ల మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని సూచించారు. మొదటి సారిగా జిల్లా కేంద్రానికి వచ్చిన డిఐజి అకున్ సబర్వాల్‌కు జిల్లా పోలీసు శాఖ పక్షాన పోలీస్ గౌరవ వందనం సమర్పించారు. జిల్లాలో పని చేస్తున్న డిఎస్పీలతో పాటు సిఐల పేర్లను అడిగి పరిచయ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ ఎస్.చంద్రశేఖర్‌రెడ్డి, అదనపు ఎస్పీ వెంకన్న, ఓఎస్‌డి జ్యోతి ప్రకాష్, సాయుద బలగాల అదనపు ఎస్పీ బాబురావు, ఐదు డివిజన్ల డిఎస్పీలు, సిఐలు పాల్గొన్నారు.