మెదక్

ముంపు బాధితులకు ప్రభుత్వం అండ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దుబ్బాక, జూన్ 2: మల్లన్నసాగర్ ముంపు బాధితులకు ఎలాంటి నష్టం జరుగదని, దేశంలోనే ఎవరికీ ఇవ్వని పరిహారాన్ని ఇవ్వడం జరుగుతుందని, అనవసరంగా రెచ్చగొట్టేవారిని నమ్మొద్దని అంచనాల కమిటీ రాష్ట్ర చైర్మన్, ఎమ్మెల్యే రామలింగారెడ్డి అన్నారు. గురువారం దుబ్బాక గాంధీ విగ్రహం వద్ద జరిగిన రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో పాల్గొని జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మల్లన్నసాగర్ బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. వారికి ఎకరానికి 5.80నుంచి 6లక్షల వరకు పరిహారం ఇచ్చి అన్ని రకాల వసతులు కల్పిస్తామన్నారు. కాంగ్రెస్ నాయకులు ముంపు గ్రామాల్లోకి వచ్చి కపటప్రేమను ఒలకపోస్తు బాధితులను రెచ్చగొడుతూ దొంగరాజకీయాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ హయాంలోనే జరిగిన తపాస్‌పల్లి రిజర్వాయర్ బాధితులకు కేవలం 1.80లక్షలు ఇచ్చారని, ఇప్పుడు తాము 6లక్షలు ఇస్తుంటే దీన్ని చూసి ఓర్వలేకనే కుటిల రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. మాజీ డిప్యూటి సిఎం దామోదర రాజనర్సింహ మీడియా పై అసత్య పదజాలంతో దూషిస్తు తన గుండాలతో విలేకర్ల పై దాడి చేయించడం సిగ్గుచేటన్నారు.
మల్లన్నసాగర్‌తో నియోజకవర్గంలోని 1.34లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తుందని, అన్ని చెరువులు నింపుతామన్నారు. అనవసర రాద్దాంతాలు ప్రతిపక్షాలు మానుకోవాలని హెచ్చరించారు. అలాగే దీపం పథకం కింద మహిళలకు గ్యాస్ సిలిండర్లు, ఉచిత ఎల్‌ఇడి బల్బులను ఆయన అందించారు. కార్యక్రమంలో ఎంపిపి పద్మ, కమిషనర్ భోగేశ్వర్, టిఆర్‌ఎస్ నేతలు స్వామి, ఎల్లారెడ్డి, రాజవౌళి, రాజు, భూంరెడ్డి, మహిపాల్‌రెడ్డి పాల్గొన్నారు.