మెదక్

రాష్ట్భ్రావృథ్ధి దేశానికే ఆదర్శం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంగారెడ్డి, జూన్ 2: దేశంలో ఎక్కడ లేని విధంగా రెండు సంవత్సరాల కాల వ్యవధిలో వినూత్న అభివృద్ధి పథకాలు, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టి రాష్ట్రాన్ని బంగారు తెలంగాణాగా తీర్చిదిద్దుతున్న ఘనత తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుకే దక్కుతుందని రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల సందర్భంగా జిల్లా కేంద్రమైన సంగారెడ్డిలోని కలెక్టరేట్‌లో తెలంగాణ అమరవీరుల స్థూపానికి పుష్పగుచ్చాలతో నివాళులు అర్పించారు. అనంతరం పోలీస్ ఫరేడ్ గ్రౌండ్‌కు చేరుకున్న మంత్రి త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి గౌరవ వందనం సమర్పించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రజలను ఉద్దేశించి ఆయన సందేశమిచ్చారు. తెలంగాణ సిద్దాంత కర్త, దార్శనికుడు జయశంకర్ స్వప్నాన్ని, కొమరం భీమ్ పోరాట పటిమను, కాళోజి ధైర్యాన్ని, పాల్కురికి జాను తెలుగుదనాన్ని, దాశరథి ధర్మాగ్రహాన్ని, వందలాది మంది విద్యార్థుల, యువజన అమరవీరుల ఆత్మత్యాగ నిరతతితో సాధించుకున్న తెలంగాణలో ప్రజలకు సుస్థిరమైన పాలనను ప్రభుత్వం అందిస్తుందన్నారు. నా తెలంగాణ కోటి రతనాల వీణ అన్న మహాకవి దాశరథి అమృత వ్యాఖ్యలను అక్షర సత్యాలు చేస్తూ బంగారు తెలంగాణ సాధన దిశలో రాష్ట్రం పురోగమిస్తుందని వెల్లడించారు.
మిషన్ కాకతీయ ద్వారా జిల్లాలో 7972 కుంటలు, చెరువులను గుర్తించి ప్రణాళిక బద్దంగా పురుద్దరిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇప్పటి వరకు 364 కోట్లతో 1684 చెరువులను మొదటి విడతలో అభివృద్ధి పర్చగా, 454 కోట్లతో 1679 చెరువులను రెండవ విడతలో అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. 9 సంవత్సరాలుగా పెండింగ్‌లో ఉన్న సింగూర్ ప్రాజెక్టు లిప్ట్ పనులను, దీనిపై నిర్దేశించిన 40 వేల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించేందుకు పపనులన్నింటిని యుద్ద ప్రాతిపధికన కొనసాగిస్తున్నామని తెలిపారు.
ఘన్‌పూర్ ఆనకట్ట పనులను 24 కోట్ల జైకా నిధులతో చేపట్టినట్లు తెలిపారు. గోదావరి జలాలను జిల్లాకు మళ్లించి 50, 21 టిఎంసిల సామర్త్యంతో రెండు రిజర్వాయర్‌లు నిర్మిస్తున్నట్లు పేర్కొన్నారు. త్రాగునీటిని అందించడానికి మిషన్ భగరీథ ద్వారా బృహత్ పథకానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టిందన్నారు. క్రిష్ణా, గోదావరి నదుల నీటి వనరులను తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి గడపకు అందించాలన్న లక్ష్యంతో పనులను ముమ్మరంగా కొనసాగిస్తున్నట్లు స్పష్టం చేసారు. జిల్లాలో 3104 కోట్ల రూపాయల అంచనాలతో 2412 గ్రామాలకు నీటిని అందించేందుకు పైపులైన్ల పనులను కొనసాగిస్తున్నామన్నారు. మొదటి విడతగా గజ్వేల్, దుబ్బాక, సిద్దిపేట నియోజకవర్గాలకు గోదావరి జలాలు అందనున్నట్లు తెలిపారు. 2017 డిసెంబర్ నాటికి జిల్లా అంతటా మిషన్ భగీరథ క్రింద తాగునీరు అందించే లక్ష్యంతో ప్రణాళికలు రూపొందించామన్నారు. 2017 అక్టోబర్ 2 నాటికి బహిరంగ మలవిసర్జన లేని జిల్లాగా తీర్చిదిద్దేందుకు స్వచ్చమెదక్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామన్నారు. లక్ష మరుగుదొడ్లు నిర్మించాలన్న లక్ష్యంలో ఇప్పటి వరకు 40 వేల మరుగుదొడ్ల నిర్మాణం పూర్తయిందని, అతి త్వరలో పటన్‌చెరు, మెదక్ నియోజకవర్గాలను బహిరంగ మలవిసర్జన లేని నియోజకవర్గాలుగా ప్రకటించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. కార్యక్రమంలో కలెక్టర్ రొనాల్డ్ రోస్, జడ్పీ చైర్ పర్సన్ రాజమణి, శాసన సభ్యులు చింతా ప్రభాకర్, బాబుమోహన్, ఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి, జెసి వెంకట్రాంరెడ్డితో పాటు వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.