మెదక్

నకిలీ విత్తనాలు సరఫరా చేస్తున్న వాహనం సీజ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శివ్వంపేట, జూన్ 3: ప్రస్తుత వర్షాకాలం సీజన్‌లో ఎలాంటి అనుమతి లేకుండా రైతులను నకిలీ విత్తనాలు విక్రయిస్తుండగా స్థానిక పోలీసులు పట్టుకున్న సంఘటన శివ్వంపేట మండలంలోని గోమారం గ్రామంలో శుక్రవారం చోటు చేసుకుంది. ఎస్సై రాజేశ్‌నాయక్, నర్సాపూర్ వ్యవసాయ సంచాలకులు దత్తాత్రేయ, మండల వ్యవసాయ అధికారి మహాలక్ష్మీలు శుక్రవారం విలేఖరులతో మాట్లాడుతూ మేడ్చల్ మండలంలోని మైసిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన కుమార్ కొంపల్లిలో ఉన్న ఓ విత్తనాల సేల్స్ కంపెనీ నుంచి నారాయణ, మాధవి, కొంపల్లి, కుత్బుల్లాపూర్, రంగారెడ్డి అనే లేబుల్స్ ముద్రించి నఖిలి లేబుల్స్ సృష్టించి గోమారంలో ఉన్న మనికంఠ ఫర్టిలైజర్ యజమాన్యానికి టాటా ఎసి ఎపి 28 ఐడి 5012 గల వాహనంలో 200 సంచుల నకిలి విత్తనాలు తరలిస్తున్నట్లు గ్రామస్తుల సమాచారం మేరకు పట్టుకొని స్థానిక పోలీస్‌స్టేషన్‌లో వాహనం, డ్రైవన్‌ను తరలించినట్లు ఎస్సై తెలిపారు. 6200 నకిలి విత్తనాలు కొనుగోలు చేసినట్లు డ్రైవర్ తెలిపారు. షీడ్ యాక్ట్ ప్రకారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు స్థానిక ఎస్సై రాజేశ్‌నాయక్ తెలిపారు. ఆ విత్తన యజమానిపై చర్యలు తీసుకోనున్నట్లు ఎడి దత్తాత్రేయ, ఎఓ మాలతి తదితరులు తెలిపారు.