మెదక్

బడిబాట షురూ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంగారెడ్డి టౌన్, జూన్ 6: బడి ఈడు పిల్లలందరు బడిలోనే ఉండాలని కలెక్టర్ రొనాల్డ్ రోస్ పిలుపునిచ్చారు. బడిబయట ఉన్న పిల్లలందరూ బడిలో ఉండాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఆచార్య జయశంకర్ బడిబాట కార్యక్రమాన్ని సోమవారం చేపట్టింది. ఇందులో భాగంగా కలెక్టర్ సోమవారం సంగారెడ్డి మండలం కొత్లాపూర్ గ్రామ పాఠశాల నుండి బడిబాట కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించి గ్రామంలో విస్తృతంగా పర్యటించి పిల్లలందరిని మడిలో చేర్పించాలని తల్లిదండ్రులను కోరారు. పేద, అనాథ పిల్లలందిరినీ వసతి గృహాల్లో చేర్పించి నాణ్యమైన విద్యనందించేందుకు జిల్లా యంత్రాంగం అన్ని చర్యలు తీసుకుంటుందని ఆయన వివరించారు. ఈ సందర్భంగా క్షేత్ర స్థాయి అధికారులతో కలెక్టర్ మాట్లాడుతూ 5 సంవత్సరాల నుండి 14 సంవత్సరాల వయస్సులోపు పిల్లలందరూ పనిలో కాకుండా విధిగా బడిలోనే ఉండాలని, ఇందుకు తల్లిదండ్రులు, స్వచ్చంద సంస్థలు, అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు కృషి చేయాలని కలెక్టర్ కోరారు. ఉపాధ్యాయులు, క్షేత్రస్థాయి సిబ్బంది, అధికారులు సామాజిక బాధ్యతగా పిల్లలను గుర్తించి బడిలో చేర్పించాలని ఆయన సూచించారు. ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు హ్యాబిటేషన్ వారిగా కార్యాచరణ రూపొందించుకుని పాఠశాలల్లో నమోదుశాతాన్ని పెంపొందించాలన్నారు. తరుచూ తమ పరిధిలోని పాఠశాలల ప్రధానోపాధ్యాయులతో సమావేశాలు నిర్వహించి బడిబాట కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మండల విద్యాధికారులను కలెక్టర్ ఆదేశించారు. సర్వశిక్ష అభియాన్ పిఓ యాస్మీన్ భాషా, స్థానిక తహశీల్దార్ గోవర్ధన్, ఉపాధ్యాయులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

ప్రైవేటుకు దీటుగా ప్రభుత్వ బడులు

డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి
రామాయంపేట, జూన్ 6: విద్యార్థులు చదువుల్లో నిర్లక్ష్యం వహించవద్దని డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి సూచించారు. సోమవారం మండల పరిధిలోని నస్కల్ గ్రామంలో నూతనంగా నిర్మించిన జిల్లా పరిషత్ భవనాన్ని ఆమె ప్రారంభించారు. ఈసందర్భంగా బడిబాట కార్యక్రమాన్ని జిల్లా విద్యాధికారి నజీమోద్దీన్‌తో కలిసి ప్రారంభించారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సమావేశంలో డిప్యూటీ స్పీకర్ మాట్లాడుతూ ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ బడులు తయారవుతున్నాయని అన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు పిల్లలను ప్రభుత్వ పాఠశాలలకు పంపించాలన్నారు. జిల్లాలోనే మొదటి సారిగా నస్కల్ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం విద్యను ప్రారంభించడం జరుగుతుందన్నారు. ఇక్కడి ప్రజలు ప్రైవేటు బడులకు వెళ్లమని ప్రభుత్వ బడులకే తమ పిల్లలను పంపిస్తామని చేసిన తీర్మానాన్ని మిగతా గ్రామాల ప్రజలు ఆదర్శంగా తీసుకోవాలన్నారు. ప్రభుత్వ బడుల్లో మాత్రమే పర్యవేక్షణ ఉంటుందన్నారు. విద్యార్థులు బాగా చదివినప్పుడే టీచర్ గర్విస్తాడన్నారు. మరో 3లక్షలు గ్రామ పాఠశాల అభివృద్ధి కోసం నిధులను మంజూరు చేస్తున్నట్లు ఆమె ప్రకటించారు. ముఖ్యంగా అమ్మను, తెలుగును, ఊరును, మర్చిపోవద్దని సూచించారు. తెలంగాణ ముఖ్యమంత్రి విద్యతో పాటు రైతుల మేలు కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టడం జరిగిందన్నారు. ఈసమావేశంలో ఆర్డీవో మెంచు నగేష్, ఎంపిపి పుట్టి విజయలక్ష్మీ యాదగిరి, జడ్పీటిసి సభ్యురాలు బిజ్జ విజయలక్ష్మీ సంపత్, వైస్ ఎంపిపి జితెందర్‌గౌడ్, నాయకులు పాతూరి ప్రభావతి, అందె కొండల్‌రెడ్డి, సుదాకర్‌రెడ్డి, బాజె చంద్రం, దేశెట్టి లింగం, గ్రామ సర్పంచు మనె్న ప్రమీల జలందర్, తహశీల్దార్, మండల విద్యాదికారితో ఆపాటు గ్రామస్థులు పాల్గొన్నారు.

గుడుంబా నియంత్రణకు పటిష్ట చర్యలు
సంగారెడ్డి, జూన్ 6: తెలంగాణ రాష్ట్రాన్ని గుడుంబా రహిత రాష్ట్రంగా మార్చాలన్న సిఎం ఆదేశాల మేరకు గుడుంబా నియంత్రణకు ఎక్సైజ్ శాఖ రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా శ్రమిస్తోందని ఆ శాఖ రాష్ట్ర కమిషనర్ ఆర్‌వి.చంద్రవదన్ పేర్కొన్నారు. వర్షాకాలం సీజన్ ప్రారంభమవుతున్న సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించ తలపెట్టిన హరితహారం కార్యక్రమంలో ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో ఈత, తాటి, ఖర్జూరం చెట్ల పెంపకంపై ప్రత్యేక దృష్టి సారించింది. ఈ మేరకు సోమవారం సంగారెడ్డిలోని ప్రెస్‌క్లబ్‌లో గీత కార్మికులతో హరితహారం కార్యక్రమంపై అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరైన చంద్రవదన్ మాట్లాడుతూ రాష్ట్రంలో హైదరాబాద్, వరంగల్ జిల్లాల్లో 60 శాతం గుడుంబా రహిత జిల్లాలుగా మారితే మిగిలిన జిల్లాల్లో 95 శాతం నియంత్రించామని, వంద శాతం నియంత్రించే వరకు విశ్రమించబోమని స్పష్టం చేసారు. హరితహారం కార్యక్రమంలో భాగంగా గీత కార్మికులు వారి స్వంత పొలాల్లో ఈత, తాటి, ఖర్జూర చెట్లను పెంచాలని, ప్రభుత్వ స్థలాలు, చెరువు కట్టలపై కూడా వీటిని పెంచాలని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 4 కోట్ల కల్లు ఉత్పత్తికి చెందిన మొక్కలను నాటించేందుకు ప్రణాళికలు రూపొందించినట్లు వెల్లడించారు. కలుషిత రహిత కల్లును వినియోగదారులకు అందించాలంటే కల్లును ఇచ్చే ఈత, తాటి, ఖర్జూరపు చెట్లను విస్తృతంగా పెంచి పోషించాలని గీత కార్మికులకు సూచించారు. గత యేడాది వర్షాభావ పరిస్థితుల వల్ల అనుకున్న ఫలితం సాధించలేదని, నాటిన మొక్కల్లో పది శాతం కూడా పెరుగలేదని అసంతృప్తిని వ్యక్తం చేసారు. ఈ సారి పుష్కళమైన వర్షాలు కురిసే అవకాశం ఉందని, ఈత చెట్ల పెంపకం బాధ్యతను గీత కార్మికులు స్వీకరించాలన్నారు. గీత కార్మికుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా కృషి చేస్తుందని, పింఛన్లు నెల నెలా అందిస్తుందన్నారు. మరణించిన కార్మికుడి కుటుంబానికి 5 లక్షల పరిహారం అందించి బాసటగా నిలుస్తున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో డిప్యూటి కమిషనర్ సయ్యద్ యాసీన్ ఖురేషి, అసిస్టెంట్ కమిషనర్ డేవిడ్ రవికాంత్, డిఎఫ్‌ఓ వేణుమాదవ్, ప్రత్యేక అధికారి సుధాకర్‌రెడ్డి, సూపరింటెండెంట్ రఘురాం తదితరులు పాల్గొన్నారు. అనంతరం ఎక్సైజ్ శాఖ డిప్యూటి కమిషనర్ కార్యాలయంలో అధికారులతో సమావేశమై శాఖాపరమైన లక్ష్యాలు, సాధించిన ఫలితాలపై కమిషనర్ చంద్రవదన్ అధికారులతో సమీక్షించారు.

రైతుల భూములపై
దందా తగదు
హైకోర్టు రిటైర్డ్ జడ్జి చంద్రకుమార్
సంగారెడ్డి టౌన్, జూన్ 6: రైతుల భూములతో ప్రభుత్వం భూ ధందా చేయడం సరికాదని, 2013 చట్టం ప్రకారం భూ నిర్వాసితులకు న్యాయం చేయాలని హైకోర్టు రిటైర్డ్ జడ్జీ జస్టీస్ చంద్రకుమార్ డిమాండ్ చేశారు. తమకు న్యాయం చేయాలంటూ జిల్లాలోని నిమ్జ్, మల్లన్నసాగర్ భూ నిర్వాసితులు సోమవారం కలెక్టరేట్ ముందు రిలే నిరహార దీక్షలను చేపట్టారు. ఈ సందర్భంగా ముఖ్య అతిధిగా చంద్రకుమార్ హాజరై దీక్షలను ప్రారంభించి మాట్లాడారు. రైతుల పట్ల ప్రభుత్వం కర్కషంగా వ్యవహరిస్తుందని, గత రెండేళ్లుగా కరువుతో అల్లాడుతున్న రైతాంగానికి నష్టపరిహారం కూడా చెల్లించలేదన్నారు. రైతులకు అండగా నిలవాల్సిన ప్రభుత్వమే వారి భూములను లాక్కోవడం దారుణమన్నారు. 2013 చట్టం ప్రకారం రైతుల నుండి భూములు తీసుకునే ముందు ప్రభుత్వం ఒక ఎక్స్‌ఫర్ట్ కమిటీ వేయాలని ఆ కమిటీ అన్ని విషయాలను క్షుణ్ణగా పరిశీలించి నివేధిక సమర్పిస్తుందని, దానిని బేసుగా చేసుకొని ముందుకు వెళ్లాల్సి ఉంటుందన్నారు. అంతే కాకుండ భూ నిర్వాసితులకు అన్ని విధాల సౌకర్యాలు కల్పించి భూమికి భూమి ఇవ్వాలన్నారు. రైతాంగం నుండి ఎకరాకు 4,5లక్షల రూపాయలకు భూములను తీసుకొని కోట్ల రూపాయలకు అమ్ముకుంటూ సొమ్ము చేసుకుంటున్నారని ఈ పద్ధతిని మార్చుకోవాలన్నారు. సిఎం కెసిఆర్ ఫాంహౌజ్ భూమిని ఎకరాకు రూ.5లక్షలకు ఇవ్వగలడా అని ప్రశ్నించారు. కెసిఆర్ పాలనలో కాంట్రాక్టర్లు బాగుపడుతున్నారని, వారికి ప్రభుత్వం అన్ని విధాలుగా అండదండగా ఉంటుందన్నారు. ప్రాజెక్టుల పేరుతో రైతులను భయబ్రాంతులకు గురి చేయడం సరికాదన్నారు. ఇప్పటికైన ప్రభుత్వం కండ్లు తెరిచి రైతుల విషయంలో పునరాలోచించాలని డిమాండ్ చేశారు. అఖిల భారత కిసాన్ సభా జాతీయ ఉపాధ్యక్షులు సారంపల్లి మల్లారెడ్డి మాట్లాడుతూ 2013 చట్టాన్ని అమలు చేయాలని, 123జివోను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. దీక్షకు తమ సంపూర్ణ మద్దతు ఉంటుందన్నారు. దీక్షకు సిపిఎం జిల్లా కార్యదర్శి ఎ.మల్లేశం, సిఐటియు జిల్లా అధ్యక్షులు బి.మల్లేశం, రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి జయరాజ్, కెవిపిఎస్ రాష్ట్ర కార్యదర్శి మానిక్యం, వ్యకాస నాయకులు నర్సింలు సంఘీభావం తెలిపారు. దీక్షలో కూర్చున్న వారిలో లక్ష్మాపూర్ సర్పంచ్ శ్రీనివాస్, తొగుట టిఆర్‌ఎస్ నాయకులు పరిపూర్ణచారి, కనకరాజు, శివరాజ్, రాజిరెడ్డి, భూ నిర్వాసితులు పాల్గొన్నారు.

ముఖ్యమంత్రిని విమర్శిస్తే సహించం

* మీరు ఎవరి తరపున మాట్లాడుతున్నారు..?
* డిప్రెషన్‌లో ఉండి మాట్లాడుతున్నారు
* జెఎసి చైర్మన్ కోదండరాంను
ప్రశ్నించిన పద్మాదేవేందర్‌రెడ్డి
మెదక్, జూన్ 6: ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావును విమర్శిస్తే తాము ఊరుకోమని, రాష్ట్రం బాగుకోసం సూచనలు సలహాలు ఇవ్వాలని శాసనసభ ఉపసభాపతి పద్మాదేవేందర్‌రెడ్డి జెఎసి చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాంకు సూచించారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం పాలకులకు చేతకాకపోతే పక్కకు తప్పుకోండని కోదండరాం చేసిన సంచలన వ్యాఖ్యలపై పద్మాదేవేందర్‌రెడ్డి తీవ్రంగా స్పందించారు. సోమవారం మెదక్ క్యాంప్ ఆఫీస్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తరువాత చేపట్టిన సంక్షేమ పథకాలు కోదండరాంకు కనిపించడం లేదా అని ఆమె ప్రశ్నించారు. జెఎసి ఎప్పుడు, ఎక్కడ పుట్టింది కూడా కోదండరాంకు తెలియదా? అని ఆమె ప్రశ్నించారు. తెలంగాణ పోరాటంలో ప్రజలను చైతన్యపరిచామని ఆమె తెలిపారు. జెఎసీని ఏర్పాటు చేసింది కెసిఆర్ కాదా అని అన్నారు. తెలంగాణ ప్రభుత్వంలో జరుగుతున్న పాలనను ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రి మెచ్చుకుంటున్నారని ఆమె తెలిపారు. ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో తెలంగాణ ప్రజల తీర్పును కోదండరాంకు కనిపించడం లేదా అని ఆమె అన్నారు. కోదండరాం డిప్రెషన్‌లో మాట్లాడుతున్నారని పద్మాదేవేందర్‌రెడ్డి వ్యాఖ్యానించారు. రాష్ట్ర అభివృద్ధిని అంతర్జాతీయ ఖ్యాతికోసం ముఖ్యమంత్రి కెసిఆర్ అహర్నిశలు పోరాడుతున్నారన్నారు. కరెంట్ విషయంలో తెలంగాణ ప్రభుత్వం చరిత్ర సృష్టించిందన్నారు. మహారాష్టత్రో ప్రాజెక్ట్ రీడిజైన్ కోసం ఒప్పందం కుదుర్చుకున్న విషయాన్ని గుర్తు చేశారు. ఆడబిడ్డలు రోడ్డుపైకి రాకుండా మిషన్ భగీరథ పనులు ముమ్మరం చేసిన విషయాన్ని ఆమె తెలిపారు. గత ప్రభుత్వాల నిర్లక్ష్యం వలనే రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారన్నారు. కెసిఆర్‌ను విమర్శిస్తే సహించేది లేదని పద్మాదేవేందర్‌రెడ్డి పరోక్షంగా హెచ్చరించారు. మీరు ఎవరి తరపున మాట్లాడుతున్నారని కోదండరాంను ప్రశ్నించారు. ప్రజలే దేవుళ్లు, ప్రజలను అవమానపరుస్తున్నారని ఆమె కోదండరాంను ఉద్దేశించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ మల్లిఖార్జున్‌గౌడ్, వైస్ చైర్మన్ రాగి అశోక్, పట్టణ తెరాస అధ్యక్షులు గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.

శాంతి భద్రతలకు సహకరించాలి
* ఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి
నర్సాపూర్,జూన్ 6: శాంతి భద్రతల పరిరక్షణకు ప్రజలు సహకరించాలని జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. సోమవారంనాడు నర్సాపూర్ పోలీస్ స్టేషన్‌ను ఆకస్మీకంగా తనిఖీ చేశారు. ఈసందర్భంగా సిఐ తిరుపతిరాజు, ఎస్‌ఐ రాజుగౌడ్‌లతో కలిసి ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరు పాటుపడాలని అందుకు గాను పోలీసులకు సహకరించాలని సూచించారు. దాబాల్లో మద్యం సేవిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అదేవిధంగా పట్టణాల్లో ట్రాఫిక్ సమస్యలను అధిగమించేందుకు తగిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. అవసరమైన చోట ట్రాఫిక్ సిగ్నల్స్ ఏర్పాటు చేయడంతో పాటు నేరాలను అరికట్టేందుకు సిసి కెమెరాలు ఏర్పాటు చేస్తామని అన్నారు. నర్సాపూర్ అటవీ ప్రాంతంలో గుమ్మడిదల వరకు రాత్రి పెట్రోలింగ్‌ను పెంచనున్నట్లు తెలిపారు. నర్సాపూర్ అటవీ ప్రాంతంను కొందరు నేరగాళ్లు అడ్డాగా చేసుకొని శవాలను పడవేసి వేళ్తున్నారని వారిపై ప్రత్యేక నిఘాను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. జిల్లాలో దొంగతనాలు, దోపిడిల నివారణకు తగిన చర్యలు తీసుకుంటామని అన్నారు. నర్సాపూర్ పోలీస్ స్టేషన్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన రిసెప్షన్ భవనాన్ని ఆయన పరిశీలించారు.

దొంగల ముఠా అరెస్టు
* రూ 8.50 లక్షల సొత్తు స్వాధీనం
సంగారెడ్డి టౌన్, జూన్ 6: గత కొద్ది నెలలుగా తాళాలు వేసిన ఇండ్లను లక్ష్యంగా చేసుకొని చోరిలకు పాల్పడుతున్న ముఠాను అరెస్టు చేసినట్లు ఎఎస్పీ టి.వెంకన్న తెలిపారు. సోమవారం కంది సిసిఎస్ పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో నిందితుల వివరాలు వెల్లడించారు. సంగారెడ్డి పట్టణంతో పాటు జహీరాబాద్‌లో పలు దొంగతనాలకు పాల్పడినట్లు తెలిపారు. ముగ్గురు స్నేహితులైన టి.శ్రీశైలం, మంగలి కిరణ్, ఎల్.రమేష్‌లు జల్సాలకు భానిసలై సులువుగా డబ్బులు సంపాంధించాలనే దురుద్ద్యేశంతో దొంగతనాలు చేసేందుకు పూనుకున్నారు. సంగారెడ్డిలో 10, సంగారెడ్డి రూరల్‌లో 1, జహీరాబాద్ పట్టణంలో 3 ఇండ్లలో చోరిలకు పాల్పడినట్లు నిందితులు ఒప్పుకున్నట్లు తెలిపారు. వీరి నుండి 27తులాల బంగారు అభరణాలు, 8సెల్‌ఫోన్లు, ఒక ల్యాప్‌టాప్, సోని కెమరాను స్వాదీనం చేసుకోవడం జరిగిందన్నారు. ఆదివారం అర్ధరాత్రి సంగారెడ్డి ఐబి వద్ద వాహనాలు తనిఖీ చేస్తున్న సమయంలో ఈ నిందితులు ఆటోలో వస్తూ పారిపోయే ప్రయత్నం చేశారని, వెంబడించి పట్టుకొని విచారిస్తే చోరి విషయాలు భయటపడ్డాయన్నారు.
ఘనంగా బుద్ధ జయంతి
జహీరాబాద్‌టౌన్, జూన్ 6: మహాత్మా గౌతమ బుద్ధుని జయంతిని పురస్కరించుకుని పట్టణంలోని గాంధీనగర్‌లో బుడగ జంగం యువజన సంగం ఆధ్వర్యంలో దమ్మపథం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా దళితబహుజన రాష్ట్ర అధ్యక్షులు అన్నవరపు నాగేశ్వర్‌రావు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ బుద్ధుడి బోధనలు ప్రపంచంలో శాంతి, అహింసా, ధర్మంపై ప్రజలు నడుచుకోవాలన్నారు. కవిగాయకుడు రాంచందర్ భీంవంశీ మాట్లాడుతూ సమాజంలో ప్రతి మనిశి ద్వేశాన్ని విడనాడి ఒకరితో ఒకరు ప్రేమతో ఉండాలన్నారు. డాక్టర్ కె.శివబాబు, డాక్టర్ విజయలక్ష్మి, బుడగజంగం ప్రధాన కార్యదర్శి అంజయ్య తదితరులు పాల్గొన్నారు.