మెదక్

పర్యావరణ రక్షణతోనే ఆరోగ్యకర సమాజం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గజ్వేల్, జూన్ 7 : పర్యావరణ పరిరక్షణ కోసం ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తుండగా, మొక్కల పెంపకంతోనే ఆరోగ్యకర సమాజ నిర్మాణం సాధ్యపడుతుందని హరితహారం రాష్ట్ర ఒఎస్‌డి, సిఎం కార్యాలయ కార్యదర్శి ప్రియాంక వర్గీస్ పేర్కొన్నారు. మంగళవారం గజ్వేల్‌లోని ఔషద మొక్కల పార్కును పరిశీలించిన సందర్భంగా ఆమె మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా మొక్కల పెంపకానికి ప్రణాళికలు రూపొందించి సిద్ధం చేస్తుండగా, పండ్లమొక్కలతోపాటూ ఔషద, టేకు, నీడనిచ్చే చెట్లకు ప్రాధాన్యతనిస్తున్నట్లు తెలిపారు. ముఖ్యంగా సంపూర్ణ ఆరోగ్యం కోసం ప్రతి ఒక్కరూ మొక్కల పెంపకంపై దృష్టి సారించాలని అంతేగాకుండా యువజన సంఘాలు, స్వచ్చంద సేవాసంస్థలు, ప్రజాప్రతినిదులకు భాగస్వామ్యం కల్పిస్తేనే లక్ష్యం నెరవేరుతుందని తెలిపారు. అయితే గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని అడిగిన ప్రతి ఒక్కరికీ మొక్కలు పంపిణీ చేసేందుకు సన్నద్ధమవుతుండగా, కాళీ ప్రదేశాలు, ప్రభుత్వ కార్యాలయాలు, చెరువులు, కుంటల సమీపాలు, పొలం గట్లలో మొక్కల పెంపకానికి ప్రోత్సహిస్తుప్నట్లు తెలిపారు. అయితే ఔషద మొక్కల పెంపకాన్ని రాష్ట్ర వ్యాప్తంగా విస్తరింపజేసే ఆలోచనలో ఉండగా, గజ్వేల్ నియోజకవర్గంలో హరితహారంపై తీసుకోవాల్సిన చర్యలను గఢా ఒఎస్డి హన్మంతరావుకు సూచనలిచ్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ శంకర్, మున్సిపల్ వైస్ చైర్మెన్ అరుణాభూపాల్‌రెడ్డి, కౌన్సిలర్‌లు నరేందర్‌రావు, సుబాష్‌చంద్రబోస్, సంతోషినిరాంద్రాచారి పాల్గొన్నారు.