మెదక్

కోటి ఎకరాలకు సాగునీరు పేరిట రూ.కోట్లాది నిధులు వృథా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తొగుట, జూన్ 7: కోటి ఎకరాలకు సాగునీరు అందించే పేరుతో ప్రాజెక్టులకు కోట్ల రూపాయలు ప్రభుత్వం వృధా చేస్తుందని, ఇప్పటికే రాష్ట్రంలో 70లక్షల ఎకరాలు సాగులో ఉండగా మరో 30లక్షల ఎకరాలకు చర్యలు చేపట్టాల్సిన ప్రభుత్వం ప్రాజెక్టుల రీడిజైనింగ్ పేరుతో ప్రజలను ముంపునకు గురి చేయడం దారుణమని బిజెపి జాతీయ కార్యవర్గసభ్యుడు, ఎమ్మెల్సీ రాంచందర్‌రావు విమర్శించారు. మంగళవారం మండలంలోని ఏటిగడ్డకిష్టాపూర్, వేములఘాట్ గ్రామాల్లో మల్లన్నసాగర్‌కు వ్యతిరేకంగా చేపట్టిన దీక్షలకు సంఘీభావం తెలిపి మాట్లాడారు. కాకతీయుల కాలంనాటి చెరువులు, కుంటలు ఉన్నాయని, వాటికి తోడు గ్రామాలు ముంపుకాకుండా చిన్న ప్రాజెక్టులు నిర్మించి సాగునీరు అందించాలన్నారు. పచ్చని పొలాలున్న గ్రామాలను ముంపుకు గరిచేసి పెద్ద రిజర్వాయర్లు నిర్మించడం సరికాదన్నారు. ప్రాజెక్టుల నిర్మాణం పై అఖిలపక్ష భేటి ఏర్పాటు చేయాలన్నారు. ప్రభుత్వం ప్రజాభిప్రాయానికి అనుగుణంగా 2013్భసేకరణచట్టం ప్రకారం సేకరణ చేయకుండా ఇష్టారీతిగా వ్యవహరించడం సరికాదన్నారు. చట్టంను అతిక్రమించి సేకరించడానికి వీలులేదన్నారు. ఏటిగడ్డకిష్టాపూర్‌వాసులు ప్రజావ్యతిరేక విధానానికి ఐక్యంగా పోరాడుతూ ఆదర్శంగా నిలుస్తున్నారన్నారు. ఏండ్లకొద్దీ అందరం కలిసి కొట్లాడి రాష్ట్రం సాధించుకుంది సంతోషంగా ఉండేందుకని, బాధలు పడేందుకు కాదన్నారు. 30 ఏళ్ల నుంచి శ్రీశైలం ఫ్రాజెక్టు భూనిర్వాసితులు న్యాయం కోసం పోరాడుతూనే ఉన్నారన్నారు. ప్రభుత్వాలు నమ్మించి ప్రజలన నుంచి భూములు తీసుకున్నాక వారిగురించి పట్టించుకోవని, ప్రజలు అప్రమత్తంగా ఉండి అన్ని సమకూర్చాకే భూసేకరణకు అంగీకరించాలన్నారు. బంగారం పండించే భూములున్న ఈ ప్రాంతాలను ముంచడం బాధాకరమని, ఎవరూ గ్రామం విడిచిపోయేందుకు సంసిద్దనంగా లేరనేందుకు నిదర్శనమే ఖరీఫ్‌సాగు ఉన్నా కూడా ప్రజలు భారీగా హాజరు కావడమేనన్నారు. ప్రభుత్వం ఎన్నికల ముందు కోటి ఎకరాలకు సాగు అని, లక్ష ఉద్యోగాలు,డబుల్ బెడ్‌రూం ఇండ్లని నమ్మించి ఆ తర్వాత వాటిని ఏమేరకు అమలు చేశారో తెలిసిందేనన్నారు. తెలంగాణ కోసం అలుపెరుగని పోరాటం చేసిన ఈ ప్రాంతవాసులు అదే స్ఫూర్తితో మల్లన్నసాగర్ ప్రాజెక్టును అడ్డుకునేందుకు ముందుకు సాగాలన్నారు. బిజెపి ప్రజలకు న్యాయం జరిగే వరకు వెంట ఉంటుందని, అవసరమైతే కేంద్రం దృష్టికి తీసుకపోయి న్యాయపోరాటానికి సైతం సిద్ధమన్నారు. ప్రజలు ఆందోళన చెందొద్దని, ఐక్యంగా ఉద్యమిస్తే న్యాయం జరుగుతుందన్నారు.
మీడియా పై దాడి కాంగ్రెస్, టిఆర్‌ఎస్ కుట్ర
ఏటిగడ్డకిష్టాపూర్‌లో ఇటీవల మీడియా పై దాడి కాంగ్రెస్, టిఆర్‌ఎస్ కుట్రలో భాగంగానే జరిగిందని బిజెపి రాష్ట్ర అదికార ప్రతినిధి రఘునందన్‌రావు ఆరోపించారు. ఉద్యమతీవ్రతను సమాజానికి చూపకుండా అడ్డుకునేందుకే ఈ దాడి జరిగిందని, ఇది విచారకరమన్నారు. ఈ దాడిని బిజెపి తీవ్రంగా ఖండిస్తుందన్నారు. ఎంతమంది ఎన్నికుట్రలు చేసినా చివరికి 14గ్రామాల ప్రజలదే తుది విజయమన్నారు. యువకులు, మహిళల్లో చైతన్యం వచ్చిందని, ఎవరెన్ని చెప్పినా సంతకాలు పెట్టకుండా అప్రమత్తంగా ఉండాలన్నారు. ప్రజలకు నష్టపరిచే 123జిఓ రర్దైతుందని, ఆందోళన చెందొద్దన్నారు. ఎవరైనా ఆందోళ చెందితే వారికి భరోసా కల్పించి బతికి ఉండి ఫలాలు అనుభవించేలా ప్రోత్సహించాలన్నారు. హింసకు తావివ్వకుండా శాంతియుతంగా ఆందోళన తీవ్రం చేయాలన్నారు.ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు సత్యనారాయణ, వాసురెడ్డి, రాష్ట్ర నాయకులు రాజయ్య, జిల్లా అధ్యక్షుడు బుచ్చిరెడ్డి మాట్లాడగా , బిజెవైఎం జిల్లా అధ్యక్షుడు శ్రీకాంత్‌రెడ్డి, నాయకులు శ్రీనివాస్, హన్మంతరెడ్డి, విభీషణ్‌రెడ్డి, రాంరెడ్డి, మల్లిఖార్జున్ పాల్గొన్నారు.