మెదక్

టెన్త్ సప్లిమెంటరీ పరీక్షలకు ఏర్పాట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంగారెడ్డి టౌన్, జూన్ 10: ఈ నెల 15నుంచి ప్రారంభం కానున్న ఎస్‌ఎస్‌సి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలకు అన్ని ఏర్పాట్లూ చేయాలని అదనపు జాయింట్ కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు అధికారులను ఆదేశించారు. శుక్రవారం తన చాంబర్‌లో పరీక్షలతో సంబంధమున్న శాఖల అధికారులతో తీసుకోవాల్సిన చర్యలపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఎజెసి మాట్లాడుతూ ఈ నెల 15నుండి 29వరకు జరిగే పరీక్షలకు జిల్లావ్యాప్తంగా 4816మంది విద్యార్థులు హాజరు కానున్నట్లు తెలిపారు. పరీక్షల నిర్వహణకు 20కేంద్రాలు ఏర్పాటు చేశామని, ప్రతి కేంద్రానికి చీప్ సూపరింటెండెంట్, వివిధ శాఖల అధికారులను నియమించామని, 11స్టోరేజ్ కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. ప్రశ్నా పత్రాలను 11వ తేదీన ఆయా కేంద్రాలను పంపడం జరుగుతుందని తెలిపారు. పరీక్షలు పూర్తయ్యేంత వరకు నిరంత విద్యుత్ సరఫరా చేయాలని, పరీక్ష కేంద్రాల్లో తాగునీటి సౌకర్యం కల్పించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఉదయం 8.30గంటల వరకు విద్యార్థులను పరీక్ష కేంద్రాలకు చేరవేసేందుకు ప్రణాళిక సిద్ధం చేసుకొని అదనపు బస్సులను నడపాలని ఆర్టీసీ ఆర్‌ఎంకు సూచించారు. ప్రతి కేంద్రంలో ఒఆర్‌ఎస్ ఫ్యాకెట్లు, మెడికల్ కిట్లు, మెడికల్ సిబ్బందిని అందుబాటులో ఉంచాలన్నారు. సమీక్షలో జిల్లా విద్యాధికారి నజీముద్దీన్, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.