మెదక్

మల్లన్నసాగర్ సామర్థ్యం తగ్గించి ముంపు నుంచి కాపాడాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తొగుట, జూన్ 12: మల్లన్నసాగర్ సామర్థ్యం తగ్గించి గ్రామాలను ముంపునుంచి కాపాడాలని టియుఎఫ్ అధ్యక్షురాలు విమలక్క డిమాండ్ చేశారు. ఆదివారం మండలంలోని ఏటిగడ్డకిష్టాపూర్, వేములఘాట్, పల్లెపహాడ్ గ్రామాల్లో చేస్తున్న దీక్షలకు సంఘీభావం తెలిపి మాట్లాడారు. ప్రజాభిప్రాయం లేకుండా గ్రామాల్లో రిజర్వాయర్ ఏలా నిర్మిస్తారని ప్రశ్నించారు. ఇంజనీర్లు, పర్యావరణ నిపుణుల సలహాలు, సూచనలు తీసుకోకుండా ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తుందన్నారు. గ్రామాలు ముంపుకు గురైతే ప్రజల సంస్కృతి, సంప్రదాయాలు కనుమరుగైతాయన్నారు. 14గ్రామాల ప్రజలు ఒక్కటై ప్రభుత్వ కుట్రలను తిప్పికొట్టాలన్నారు. దేశంలో ఎక్కడాలేని పరిహారం అందిస్తున్నామంటు గొప్పలు చెప్పుకుంటున్న మంత్రి హరీష్‌రావు అదే పరిహారం తీసుకొని తమ భూములు ప్రజలకు ఇవ్వాలన్నారు. రాష్ట్రం వస్తే బతుకులు బాగుపడుతాయనుకున్న ప్రజల బతుకులు ఆగమ్యగోచరంగా మారాయన్నారు. 1.5టిఎంసిల నుంచి 50టిఎంసిలకు పెంచడం ఎవరి ప్రయోజనాలకోసమని ప్రశ్నించారు. ముంపు గ్రామాల ఉద్యమాన్ని ఢిల్లీకి తీసుకపోతామన్నారు. అంతిమ విజయం ప్రజలదేనని తెలిపారు. ఎవరైనా ప్రభుత్వానికి బ్రోకర్లుగా వ్యవహరిస్తే నిలదీయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి, తెలంగాణ ఐక్య వేదిక కన్వీనర్ చెరుకు సుధాకర్, తెలుగురైతు రాష్ట్ర అధ్యక్షుడు ప్రతాప్‌రెడ్డి, న్యాయవాది శివకుమార్ మాట్లాడగా లోక్‌సత్తా అధ్యక్షుడు నాగరాజు, పిడిఎస్‌యు రాష్ట్ర కార్యదర్శి సంతోష్, పాల్గొన్నారు.