మెదక్

హరితహారం కింద మూడు కోట్ల మొక్కలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెదక్, జూన్ 17: మెదక్ డివిజన్ అటవి ప్రాంతంలో మూడు కోట్ల మొక్కలను హరితహారం క్రింద టార్గెట్‌గా ప్రణాళికను సిద్దం చేసుకున్నామని మెదక్ డిఎఫ్‌ఓ శ్రీ్ధర్‌రావు తెలిపారు. శుక్రవారం నాడు ఆయన విలేఖరులతో మాట్లాడుతూ హరితహారం క్రింద లక్ష్యంగా పెట్టుకున్న 3 కోట్ల మొక్కలలో 2 కోట్ల 68 లక్షల మొక్కలు అటవివేతర భూములకు కెటాయించినట్లు ఆయన తెలిపారు. ఇందులో బీడు భూములు, ప్రభుత్వ కార్యాలయాలు, గ్రామపంచాయితీలు, కుటుంభాలకు పంపిణీ చేయనున్నట్లు శ్రీ్ధర్‌రావు తెలిపారు. మిగిలిన 38 లక్షల మొక్కలను నాలుగు రకాలుగా ప్లాంటేషన్ చేయబోతున్నట్లు ఆయన తెలిపారు. బ్లాక్, గ్యాప్, లైన్ ప్లాంటేషన్‌కు సిద్దం చేసినట్లు ఆయన తెలిపారు. బ్లాక్ ప్లాంటేషన్‌లో సెమి మెకానికల్ మూడు రకాలుగా విభజించి ప్లాంటేషన్ చేస్తున్నట్లు శ్రీ్ధర్‌రావు తెలిపారు. అందులో మిక్స్‌డు ప్లాంటేషన్ మొట్లు తొలగించడం, ఆ తరువాత దున్నడం జరుగుతుందన్నారు. సెమి మెకానికల్‌కు మూడు మీటర్లకు ఒక వరుస మొక్కలు నాటడం జరుగుతుందని తెలిపారు. వరుసలో రెండు మీటర్ల వంతున ఒక హెక్టార్‌కు 1666 మొక్కలు నాటుతున్నట్లు తెలిపారు. ఈ విధంగా 855 హెక్టార్లలో మొక్కలు నాటబోతున్నట్లు ఆయన తెలిపారు. జంగల్ క్లీన్ లేబర్ ద్వారానే చదును చేస్తామని వెల్లడించారు. గుంతలు తవ్వి మొక్కలు నాటుతున్నట్లు ఆయన తెలిపారు. స్టాగర్డ్ స్ట్రేంచర్ వంద హెక్టార్లలో ఏర్పాటు చేసి మొక్కలు నాటుతున్నట్లు తెలిపారు. దీని వలన మొక్కలకు నీటి నిలువ ఉంటుందన్నారు. రేగోడ్ మండలం బొడిగుడ్డలో గుంతలు తవ్వి స్ట్రెంచర్లు ఏర్పాటు చేసి 3/2 మొక్కలు నాటి విత్తనాలు చల్లుతామన్నారు. బండ్ ప్లాంట్ క్రింద 18 లక్షల వరకు మొక్కలు నాటబోతున్నట్లు ఆయన తెలిపారు. ఇప్పటికే 300 హెక్టార్లలో ప్లవ్వింగ్ చేయడం జరిగిందని డిఎఫ్‌ఓ శ్రీ్ధర్‌రావు తెలిపారు. 10 రోజులలో ప్లవింగ్ కార్యక్రమాలు నిర్వహించబోతున్నట్లు తెలిపారు. ఇప్పటికే హరితహారం క్రింద నాలుగు కోట్ల రుపాయలు ఉన్నట్లు తెలిపారు. ఈ నిధులను ఇటీవల డివిజన్ స్థాయి మీటింగ్ ఏర్పాటు చేసి ప్రీ యాక్షన్ ప్లాన్ 2016-17కు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. నెలవారిగా చేయవలసిన పనుల వివరాలను బీట్ అధికారులకు అప్పగించడం జరిగిందన్నారు. ఈ విధంగా మెదక్ అటవి భూములను ఒక వినూత్న పద్దతిలో అభివృద్ది చేసేందుకు ప్రణాళికను సిద్దం చేసినట్లు ఆయన తెలిపారు. గత కొనె్నళ్లుగా విస్తరించిన యూకలిప్టస్ చెట్లను అమ్మగా రెండు కోట్ల రుపాయలు ఆదాయం వచ్చిందన్నారు. మూకలిప్టస్ తొలగించిన ప్రాంతంలో భూములను చదునుచేసి మొక్కలు పెంచుతామని ఆయన తెలిపారు.
* డిఎఫ్‌ఓ నివాస గృహానికి గులాబీ రంగు
గత నాలుగు నెలల క్రింద ఇక్కడ పనిచేసిన డిఎఫ్‌ఓ శివాని డొగ్రోను కామారెడ్డికి బదిలీ చేశారు. ఇమె స్థానంలో శ్రీ్ధర్‌రావును మెదక్ డిఎఫ్‌ఓగా నియామకం చేశారు. శివాని డొగ్రో డిఎఫ్‌ఓ నివాస గృహాన్ని ఖాళీ చేయకపోవడంతో మెదక్ డిఎఫ్‌ఓగా పనిచేస్తున్న శ్రీ్ధర్‌రావు ఫారెస్ట్ వసతి గృహంలో నివాసముంటూ విధులు నిర్వహిస్తున్నారు. గత మూడు రోజుల క్రింద శివాని డొగ్రో డిఎఫ్‌ఓ నివాస గృహాన్ని ఖాళీ చేయడంతో డిఎఫ్‌ఓ ఆ గృహాన్ని రంగులతో తీర్చిదిద్దుతున్నారు. గులాబి రంగును వేయించడం కనిపించింది.