మెదక్

ముంపు లేకుండా ప్రాజెక్టులు నిర్మించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తొగుట, జూన్ 21: దేశానికి స్వాతంత్య్రం తెచ్చిన కాంగ్రెస్, తెలంగాణ ఏర్పాటును సైతం చేసిందని, దేశాభివృద్ధిలో కాంగ్రెస్ పార్టీ పాత్ర ఎంతో ఉందని.. ఎన్నో ప్రాజెక్టులు నిర్మించిన పార్టీ ప్రాజెక్టులకు వ్యతిరేకం కాదని..ప్రజలకు నష్టం కలుగకుండా చట్ట ప్రకారం ప్రాజెక్టు నిర్మించాలన్నదే తమ అభిమతమని శాసన మండలి కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడర్ షబ్బీర్ అలీ అన్నారు. మంగళవారం మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర్ రాజనర్సింహ, మాజీ మంత్రి సునితరెడ్డి, టిపిసిసి కార్యదర్శి శ్రావణ్‌కుమార్‌రెడ్డిలతో కలిసి మల్లన్నసాగర్ నిర్వాసిత గ్రామాల్లో చేపట్టిన రిలేదీక్షలకు సంఘీభావం తెలిపి మాట్లాడారు. కాంగ్రెస్ పాలనలో చేపట్టిన ప్రాజెక్టుల పేరు మార్చి రీ డిజైనింగ్‌ల పేరుతో సామర్ధ్యాలను పెంచి చట్టాన్ని కాదని జిఓలతో భూసేకరణ చేపట్టడాన్ని పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుందన్నారు. కాంగ్రెస్ పార్టీ 55లక్షల మేర ఎకరాలకు సాగునీరందించిందన్నారు. రెండేళ్ల ప్రభుత్వ పాలనలో రెండెకరాలకు సైతం నీరందించలేదని విమర్శించారు. ముంపును తగ్గించి కాల్వల ద్వారా సాగునీరందించాలని కాంగ్రెస్ పార్టీ తడ్కపల్లిలో 1.5టిఎంసిలతో ప్రాజెక్ట్‌కు రూపకల్పన చేసిందన్నారు. రెండు కొండల మద్య ఎక్కడైనా ప్రాజెక్టును నిర్మిస్తారని, అలాంటిది నీరు పారని చోట 50 టిఎంసిలతో కాల్వల ద్వారా ప్రాజెక్టును నిర్మించాలనుకోవడం విడ్డూరంగా ఉందన్నారు. టిఆర్‌ఎస్ పార్టీకి అధికారం అప్పగించిన గ్రామాల ప్రజల నుండి బలవంతంగా భూములను, ఇండ్లను, గ్రామాలను లాక్కోవడంపై ప్రజలు చేస్తున్న ఆందోళనలకు తమ పూర్తి మద్దతు ఉంటుందన్నారు. నిర్వాసితులు జీవించేహక్కు కోసం ఆందోళనలు చేస్తుంటే ప్రభుత్వం అధికారులు, పోలీసులతో భయబ్రాంతులకు గురిచేయడం మంచిది కాదని, తాము ప్రజల పక్షాన న్యాయ పోరాటం చేస్తామన్నారు. గ్రామాల్లో మల్లన్నసాగర్‌కు వ్యతిరేకంగా ప్రజలు ఆందోళనలు చేస్తుంటే గ్రామాలకు రాకుండా ప్రభుత్వం వారే ప్రాజెక్టుకోసం నిరసనలు చేయించడం శోచనీయమన్నారు. మండలంలోని లక్ష్మాపూర్, తుర్కబంజేరుపల్లి, బంజేరుపల్లి గ్రామాలను సందర్శించి ఆందోళన చెందవద్దని, చెక్కులు తీసుకున్న మిగతా నిర్వాసితులలాగే న్యాయం జరిగేలా చూస్తామన్నారు. ఈ కార్యక్రమాల్లో ఆయా గ్రామాల ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రభాకర్, చిలువేరు రాంరెడ్డి, ముషిణం శ్రీనివాస్‌గౌడ్, లక్ష్మణ్‌గౌడ్, మల్లారెడ్డి, నాయకులు పాల్గొన్నారు.

పనులకు కాదు.. బడులకు పంపాలి

* ఎమ్మెల్సీ ఫారూఖ్‌హుస్సేన్

నంగునూరు, జూన్ 21: ముస్లీంల పిల్లలను తల్లిదండ్రులు పనుల్లో పెట్టకుండా బడికి పంపాలని ఎమ్మెల్సీ ఫారూఖ్‌హుస్సేన్ అన్నారు. రంజాన్‌మాసం సందర్భంగా మంగళవారం ఎన్‌ఆర్‌ఐ ఇక్బాల్ ఆలీఖాన్ ఆర్థిక సహకారంతో అందించిన నిత్యవసర వస్తువులను మండలంలోని పాలమాకుల కైలాసగిరి ఫంక్షన్‌హాల్, నంగునూరు షాదీఖానాలో సుమారు 300మంది నిరుపేద ముస్లీంలకు పంపిణి చేసి మాట్లాడారు. పిల్లలను బడికి పంపకుండా పనులకు పంపి భవిష్యత్‌లో కొలువులు చేయకుండా చేస్తున్నారన్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని సిఎం కెసిఆర్ ఎన్నో పథకాలను ప్రవేశపెట్టారన్నారు. మైనార్టీ రెసిడెన్షియల్ స్కూళ్లతో విద్యాభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్నారని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఎన్‌ఆర్‌ఐ ఇక్బాల్ ఆలీఖాన్ నిత్యవసర వస్తువులు అందించడం అభినందనీయన్నారు. జడ్పీ వైస్ చైర్మన్ సారయ్య, ఎంపిపి శ్రీకాంత్‌రెడ్డి, నేతలు మల్లయ్య, నవాజ్‌షరీఫ్, పురేందర్, అజిద్ పాల్గొన్నారు.

శ్రీ విద్యాధరిక్షేత్రంలో అమ్మవారికి లక్ష పసుపుకొమ్ములు సమర్పణ

గజ్వేల్, జూన్ 21 : రజథోత్సవ సంవత్సరాన్ని పురస్కరించుకొని సుప్రసిద్ధ వర్గల్ శ్రీ విద్యాధరి పుణ్యక్షేత్రంలో ప్రత్యేక కార్యక్రమాలు కొనసాగుతుండగా, మంగళవారం అమ్మవారికి లక్ష పసుపుకొమ్ములను సమర్పించారు. ఈ సందర్భంగా జంట నగరాలతోపాటు జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి మహిళలు, భక్తులు విశేష సంఖ్యలో తరలివచ్చారు. కాగా మొదటగా శ్రీ విద్యాధరి అమ్మవారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు, అర్చనలు, చంఢీహోమం తదితర కార్యక్రమాలు నిర్వహించగా ఈ కార్యక్రమాలలో ఆలయ వ్యవస్థాపిక చైర్మెన్ చంద్రశేఖరశర్మ సిద్ధాంతి, కమిటీ నిర్వాహకులు సత్యనారాయణ, మల్లారెడ్డి, బిక్షపతి, బాపురాజు, కోటగిరి రాంచందర్, శ్రీనివాస్, కుమార్, వెంకటరాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

చదువుతోనే
మైనార్టీల్లో వెలుగు
* ఎమ్మెల్యే రామలింగారెడ్డి
దుబ్బాక, జూన్ 21: మైనార్టీల అక్షరాస్యతను పెంపొందించడమే టిఆర్‌ఎస్ సర్కార్ ధ్యేయమని అంచనాల కమిటి రాష్ట్ర చైర్మన్ రామలింగారెడ్డి అన్నారు.
మంగళవారం దుబ్బాకలోని పాఠశాలను సందర్శించి మాట్లాడారు. మైనార్టీలు పేదరికంతో పిల్లలను చదివించలేకపోతున్నారని, దీంతో ఆర్థికంగా ఎంతో నష్టపోతున్నారన్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని సిఎం కెసిఆర్ మైనార్టీల కోసం ప్రత్యేకంగా పాఠశాలలను ఏర్పాటు చేశారన్నారు. పేద ముస్లీంలకు ఎంతో మేలు చేకూరుతుందన్నారు. అక్షరాస్యతతోనే మైనార్టీలకు వెలుగు వస్తుందని ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. ఈకార్యక్రమంలో ఎఎంసి చైర్మన్ ఎల్లారెడ్డి, టిఆర్‌ఎస్ నేతలు స్వామి, శ్రీనివాస్, రాజు, భూంరెడ్డి, నరేష్ పాల్గొన్నారు.