మెదక్

ఒప్పించి భూసేకరణ చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తొగుట, జూన్ 26: భూనిర్వాసితులను పోలీసులు, అధికారులతో బెదిరించి కాకుండా వారిని ఒప్పించి 2013చట్టం ప్రకారం భూసేకరణ చేయాలని టిడిఎల్పీ నేత రేవంత్‌రెడ్డి అన్నారు. ఆదివారం మండలంలోని ఏటిగడ్డకిష్టాపూర్‌లో చేపట్టిన 48గం. దీక్ష ముగింపు సమావేశంలో మాట్లాడారు. ప్రభుత్వం భూసేకరణలో నిరంకుశంగా వ్యవహరించడం సరికాదన్నారు. పశ్చిమబెంగాల్ నందిగ్రామ్ భూసేకరణ ఆందోళనతో 30ఏండ్ల కమ్యూనిస్టు ప్రభుత్వమే కూలిపోయిందన్నారు. 21వేల ఎకరాల మల్లన్నసాగర్ నిర్వాసితులు ఆందోళన చేస్తే ఈ ప్రభుత్వం ఉంటుందా అని ప్రశ్నించారు. ప్రజాభిప్రాయానికి అనుగుణంగా పాలకులు వ్యవహరించాలని, ఇష్టారీతిగా వ్యవహరిస్తే ఊరుకోరన్నారు. గ్రామాల్లోని ప్రజలు చైతన్యవంతులైనారని, ప్రజాభిప్రాయానికి అనుగుణంగా ప్రభుత్వం మసలుకోవాలన్నారు. రాత్రంతా వాన వస్తున్నా మొక్కవోని దీక్షతో నాకు అండగా ప్రజలు మేలుకొని ఉండడం వారి బాధ చాటిచెప్తుందన్నారు. ప్రభుత్వ వ్యతిరేక విధానాల పై మేధావులు, రచయితలు కవులు, రాజకీయ పార్టీలు ఆందోళనకు సన్నద్దమైతున్నాయన్నారు. ప్రజలు ఏ ఒక్కరు ఆందోళన చెందవద్దని, ఏ తల్లి కంటినీరు పెట్టవద్దని, మీకు అండగా మేముంటామన్నారు. అన్యాయాలు, అక్రమాల పై బాధితులకు అండగా 10జిల్లాల్లో పర్యటించి న్యాయం కోసం ఆందోళనలు చేస్తానన్నారు. అసెంబ్లీలో సైతం నిర్వాసితులకు న్యాయం కోసం నిలదీస్తామన్నారు. నిరక్షరాస్యులతో నిర్వాసితులను విభజించి దొంగ రిజిస్ట్రేషన్లు చేయించడం సరికాదని, చట్టాన్ని అతిక్రమించకుండా అధికారులు వ్యవహరించారన్నారు. ప్రజల ఓట్లతో అధికారంలోకి వచ్చిన సిఎం, ఎమ్మెల్యేలు ప్రజలు పడుతున్న బాధలు పట్టించుకోవడం లేదంటే తెగతెంపులు చేసుకున్నట్లే అని ప్రశ్నించారు. గ్రామాల మధ్య చిచ్చుపెట్టడం సరికాదని, భూసేకరణకు ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలకు తాము వ్యతిరేకమన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగురైతు అధ్యక్షుడు ప్రతాప్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ నర్సారెడ్డి, చంద్రం, భూపేష్, రమేశ్, మల్లారెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, భూపాణి, చంద్రం, నరోత్తం, విజయపాల్‌రెడ్డి, జెఎసి నేత ప్రశాంత్, అశోక్, మహిపాల్‌రెడ్డి పాల్గొన్నారు.