మెదక్

డివిజన్ చేయకుంటే ప్రజా ఉద్యమమే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జహీరాబాద్, జూన్ 28: జహీరాబాద్‌ను రెవిన్యూ డివిజన్ చేయకుంటే అఖిలపక్ష దీక్షను ప్రజా ఉద్యమంగా మరుస్తామని పిఎసి చైర్‌పర్సన్, ఎమ్మెల్యే డాక్టర్ జె.గీతారెడ్డి ప్రభుత్వాన్ని హెచ్చరించారు. డివిజన్ డిమాండ్‌తో అఖిలపక్షం చేస్తున్న నిరాహార దీక్షా శిబిరంలో అమె మంగళవారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జహీరాబాద్‌కు డివిజన్ కాదు జిల్లా కేంద్రం ఏర్పాటు చేసేందుకు అవసరమైన అన్ని సౌకర్యాలూ ఉన్నాయన్నారు. ప్రజాసమస్యల పరిష్కారానికి అఖిలపక్షాల మద్దతు అవసరం అన్నారు. ఐక్యపోరాటాలతోనే ప్రజా సమస్యలు పరిష్కారం అవుతాయన్నారు. జహీరాబాద్‌లో రెవిన్యూ డివిజన్‌కు అవసరమైన కనీస సౌకర్యాలతోపాటు అన్నిశాఖల కార్యాలయాలున్నాయన్నారు. అందువల్ల గత ప్రభుత్వాలు ఆర్డీఓ, డిఎస్పీ కార్యాలయాల ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపించాయన్నారు. గత జూన్‌లో ఈ విషయమై కలెక్టర్‌కు కూడా మరోమారు తెలిపామన్నారు. 2013నుంచి డివిజన్ ఏర్పాటుకోసం అవసరమైనప్పుడల్లా ప్రతిపాదనలు పంపుతున్నామన్నారు. ఇక్కడ 100 పడకల ఆసుపత్రితోపాటు రైల్వేలైన్, స్టేషన్, సబ్‌కోర్టు, అనేక విద్యాసంస్థలు, జాతీయ రహాదారి తదితర సౌకర్యాలున్నాయన్నారు. ఇక్కడికి 100 కిలోమీటర్ల దూరంలోని హైదరాబాద్ షంశాబాద్ విమానాశ్రయం చేరుకునేందుకు అవసరమైన 4లైన్లకు జాతీయ రహాదారి విస్తరణ పనులు త్వరలోనే అందుబాటులోకి రానున్నాయన్నారు. అదేవిధంగా పారిశ్రామికంగా ఎంతో అభివృద్ధి చెందిందని, దేశంలో పేరెన్నికగన్న మహింద్రా అండ్ మహింద్రా కర్మాగరాంతోపాటు అనేక కర్మాగారాలు ఈ ప్రాంతంలోన ఉన్నాయ్నారు. అదేవిధంగా దేశంలోనే అతికొన్ని రాష్ట్రాల్లో ఏర్పాటు చేస్తున్న జాతీయ ఉత్పత్తి మండలి (నిమ్జ్) కూడా ఇక్కడుందన్నారు. ఇలాంటి జహీరాబాద్‌లో డివిజన్ ఏర్పాటు కోసం కాదు జిల్లా కేంద్రం ఏర్పాటుకు అవసరమైన సౌకర్యాలులన్ని ఉన్నాయన్నారు. సిఎం.కెసిఆర్, మంత్రులు, జిల్లా కలెక్టర్‌ల దృష్టికి కూడా డివిజన్ అంశాన్ని తీసుకు పోతామన్నారు. నారాయణ్‌ఖేడ్‌ను డివిజన్ కేంద్రం చేసినా తమకు ఎలాంటి అభ్యంతరం లేదని గీతారెడ్డి స్పష్టంచేశారు. జహీరాబాద్‌ను తప్పనిసరిగా డివిజన్ చేయాలని డిమాండ్‌చేశారు. నారాయణ్‌ఖేడ్‌ను అభివృద్ధి చేయండి, అదేవిధంగా జహీరాబాద్ అభివృద్ధికి సహాకరించాలని ప్రభుత్వాన్ని కోరారు. అప్పటి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డితో పోరాడి నిమ్జ్‌ను జహీరాబాద్‌కు తీసుకుని రావడంలో విజయం సాధించామన్నారు. 12500 ఎకరాల భూమిలో పరిశ్రమలు రావడంతో 3 లక్షల ఉద్యోగాలు స్థానికులకు సమకూరుతాయన్నారు. లక్షలాది మందికి ఉపాధి కలుగనుందన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉందని కాకుండా ప్రజా సమస్యలు దృష్టిలో ఉంచుకుని జహీరాబాద్‌ను రెవిన్యూ డివిజన్ చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. టిఆర్‌ఎస్ ప్రభుత్వం రాజకీయంచేసి ప్రజలసమస్యలు పట్టించుకోకుండా ప్రజలే వారికి బుద్ధిచెబుతారన్నారు. డివిజన్ ఏర్పాటును నిర్లక్ష్యంచేస్తే అఖిలపక్ష ఆధ్వర్యంలో చేపట్టిన ఉద్యమాన్ని ప్రజా ఉద్యమంగా మారుస్తామని హెచ్చరించారు. ఆదిలాబాద్‌కు పోతున్న ట్రిబల్ ఐటిని మెదక్‌కు తీసుకుని రావడం జరిగిందని గుర్తుచేశారు. ముఖ్యమంత్రి ఉన్న జిల్లాలో ఉద్యమాలు జరగడం మంచిదికాదన్నారు. మల్లన్నసాగర్, చెక్కర కర్మాగారం, జిల్లా, డివిజన్ ఉద్యమాలు జరుగుతుంటే సిఎం. కెసిఆర్ చొరతీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి, బిజెపి నియోజకవర్గం ఇంచార్జిలు వై.నరోత్తం, మల్లికార్జున్‌పాటిల్, సిపిఐ డివిజన్ నాయకులు జలాలుద్ధీన్ వివిధ పార్టీల నాయకులు కార్యకర్తలు శ్రీనివాస్‌రెడ్డి, మంకాల్‌సుభాష్, అక్బర్, కండెం నర్సిములు, శ్రీకాంత్, బిజెపి మండల అధ్యక్షులు పండరి, సుధీర్ బండారి తదితరులున్నారు.