మెదక్

అటవీ భూముల్లోనూ పచ్చదనంపై దృష్టి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గజ్వేల్, జూలై 7 : రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అటవీ భూముల్లో మొక్కలు పెంచి పర్యావరణ పరిరక్షణపై దృష్టి సారిస్తానని ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ జా పేర్కొన్నారు. గురువారం మెదక్ జిల్లా గజ్వేల్ నియోజకవర్గపరిధిలోని నర్సంపల్లి, మీనాజిపేట, బంగ్ల వెంకటాపూర్, ములుగు అటవీ ప్రాంతాలను పరిశీలించిన సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రభత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమంలో భాగంగా తమ వంతు చేయూతనిచ్చేందుకు ముందుకు వస్తుండగా మొక్కల సంరక్షణ, భాగస్వామ్యం లక్ష్యంగా ఈ పథకం విజయవంతానికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. ముఖ్యంగా నియోజకవర్గ పరిధిలో గల 30 వేల 500 ఎకరాలలో నీడనిచ్చే చెట్లు పెంచి వాటి రక్షణ బాధ్యతను చేపడుతున్నట్లు చెప్పారు. అలాగే హరితహారం కార్యక్రమాన్ని మహోద్యమంలా చేపట్టేందుకు అటవీశాఖ ప్రణాళిక సిద్ధం చేయగా ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలిచ్చినట్లు చెప్పారు. అనంతరం కోమటిబండ వద్ద నిర్మిస్తున్న మిషన్ భగీరథ నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు. ఆయన వెంట అడీషనల్ పిసిసిఎఫ్ అధికారి డోబ్రియల్, చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ అధికారి అశోక్‌కుమార్‌సిమ్హ, జిల్లా ఫారెస్ట్ అధికారి శ్రీదర్‌రావు, జిల్లా కలెక్టర్ రోనాల్డ్‌రాస్, గఢా అధికారి హన్మంతరావు, సోషల్ ఫారెస్ట్ జిల్లా అధికారి సుధాకర్‌రెడ్డి, రేంజ్ ఆఫీసర్‌లు వెంకట్‌రామారావు, చంద్రశేఖర్, గణేష్ తదితరులు ఉన్నారు.